
బిగ్‌బాస్ రియాల్టీ గేమ్ షోలో పాల్గొన్న నటీనటులకు ఆ తర్వాత మంచి పబ్లిసిటీతో పాటు సినీ అవకాశాలు వరుస కడుతూ ఉంటాయి. అలాంటి అవకాశాలే ఇప్పుడు నటి రమ్య పాండియన్‌కు వరుస కడుతున్నాయి. తమిళ బిగ్‌బాస్ సీజన్ ఫోర్‌లో పాల్గొన్న ఈ నటి ప్రతి వారం ట్రెండింగ్ స్టార్‌గా వార్తల్లో నిలిచారు. దీంతో ఆమె సింగపెణ్ అనే బిరుదు కూడా అందుకున్నారు.
ప్రస్తుతం ఈ బ్యూటీకి సినీ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అందులో ఒకటి 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ నిర్మించనున్న చిత్రంలో నటించే అవకాశం. ఈ చిత్రాన్ని నవ దర్శకుడు అరిసిల్ మూర్తి తెరకెక్కించనున్నారు. ఈయన చెప్పిన కథ నచ్చడంతో వెంటనే కాల్ సీట్లు కేటాయించినట్లు రమ్య పాండియన్ తెలిపారు. త్వరలో సెట్ పైకి వెళ్లనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటులు సాంకేతికవర్గం ఎంపిక ముమ్మరంగా జరుగుతోంది. పూర్తి వివరాలను చిత్ర వర్గాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment