బిగ్‌బాస్ షోకు యమ క్రేజ్ ఉంది కాబట్టే ఈ షో అనేక భాషల్లో ప్రసారమవుతోంది. తెలుగులో నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ ప్రస్తుతం ఐదో సీజన్ నడుస్తోంది. ఈ మధ్యే తమిళంలోనూ ఐదో సీజన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో 'గృహలక్ష్మీ' సీరియల్ ఫేమ్, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి కస్తూరి శంకర్.. తమిళ బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో ఇప్పటివరకు తాను ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదని, తనలాంటి వాళ్లు ఎవరైనా ఉన్నారా? అని ట్వీట్ చేసింది. దీంతో కొందరు నెటిజన్లు చూశామని, మరికొందరు చూడలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
'గతంలో మీరు బిగ్‌బాస్‌కు వెళ్లినప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ చివరికి మీకన్నా మిగతావాళ్లే ఎంతో నయం అనిపించింది' అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. దీనిపై కస్తూరి స్పందిస్తూ.. 'మీరు చూసినదాన్ని బట్టి ఎవ్వరినీ జడ్జ్ చేయకండి.. వారు చూపించేది కచ్చితంగా నిజాలే కానక్కర్లేవు' అని చెప్పుకొచ్చింది. హౌస్‌లో అంతమందికి ఒక్క కుక్కర్‌లోనే వంట చేశారా? అని ఓ వ్యక్తి అనుమానం వ్యక్తం చేయగా.. మాకు కొంత ఫుడ్ పంపిస్తారని, కాకపోతే కంటెస్టెంట్లు తగ్గేకొద్దీ వంటసరుకుల మోతాదు కూడా తగ్గిపోతూ ఉంటుందని తెలిపింది. అలాగే ఎంతో త్వరగా హౌస్ నుంచి బయటకు వచ్చేసినందుకు ప్రతిరోజు ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటానంది కస్తూరి.
Raise your hand if you are like me and haven't watched a single episode of #BiggBossTamil5 till date. Hugs !
— Kasturi Shankar (@KasthuriShankar) October 16, 2021
Consolation hugs to those who never managed to watch a single full episode. #StarVijayTV #companyArtists #100naal_velaivaipputhittam
Don't judge based on what you get to see- The narrative they show is not necessarily the truth
— Kasturi Shankar (@KasthuriShankar) October 16, 2021
I know !!! I thank god everyday that i escaped early and have done genuine work since then !
— Kasturi Shankar (@KasthuriShankar) October 16, 2021
Comments
Please login to add a commentAdd a comment