Bigg Boss Tamil 4: Akhila Narayanan Slams Daughter Shivani About Balaji - Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: కంటెస్టెంట్‌ను దూషించిన తల్లి

Published Wed, Dec 30 2020 1:46 PM | Last Updated on Wed, Dec 30 2020 3:18 PM

Bigg Boss 4 Tamil: Akila Narayanan Slams Daughter Shivani - Sakshi

స్టార్‌ హీరో కమల్‌ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న‌ తమిళ బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. ఎన్నో రోజులుగా అయినవారికి దూరంగా ఉంటున్న హౌస్‌మేట్స్‌ కోసం బిగ్‌బాస్‌ వారి ఫ్యామిలీ మెంబర్స్‌ను లోనికి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కంటెస్టెంటు శివానీ తల్లి అఖిల నారాయణన్‌ మంగళవారం హౌస్‌లో అడుగు పెట్టింది. ఆమెను చూడగానే శివానీ కన్నీటి పర్యంతం అయింది. ఆమె కంటినీరు తుడిచి ఓదార్చిన అఖిల కూతురిని పక్కకు తీసుకెళ్లి మాట్లాడింది. ఆమె మీద ఉన్న కోపాన్నంతా ప్రదర్శిస్తూ చీవాట్లు పెట్టింది. అసలు నువ్వు బిగ్‌బాస్‌ హౌస్‌కు ఎందుకు వచ్చావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? అని నిలదీసింది. బాలాజీని అంటి పెట్టుకుని ఉండటం తప్ప నువ్వు సొంతంగా గేమ్‌ ఆడుతున్న దాఖలాలే లేవని ఘాటుగా రియాక్ట్‌ అయింది. (చదవండి: ఒక్క సినిమాకు రూ.135 కోట్లు తీసుకోనున్న హీరో?!)

'నువ్వేమైనా బాలాజీకి ఊడిగం చేస్తున్నావా?, నిన్ను చూస్తుంటే కొట్టాలన్నంత కోపం వస్తుంది. ఈ ఇంట్లో ఎంతో మంది అమ్మాయిలు ఉండగా నేను ఇచ్చిన క్రిస్‌మస్‌ బహుమతులను బాలాజీకే ఎందుకిచ్చావు? అతడేం మాట్లాడినా ఎందుకు సపోర్ట్‌ చేస్తావు? ఇది జోడీ నంబర్‌ 1 కాదు, బిగ్‌బాస్‌ షో' అని హెచ్చరించింది. ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లో నీ ప్రవర్తన వల్ల మేము గర్వపడటం కాదు కదా! ట్రోల్‌ అవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తీవ్రస్థాయిలో ఆమెపై ఫైర్‌ అవడమే కాదు ఏకంగా దూషణలకు కూడా దిగడతో శివానీ మరింత దుఃఖించింది. ఇది ఆమె అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. శివానీ తన ఆటపై దృష్టి పెట్టాలన్న ఉద్దేశ్యంతోనే ఆమె తల్లి అంత సీరియస్‌ అయినప్పటికీ నోటికొచ్చినట్లు తిట్టడం ఏమాత్రం సరికాదని అభిప్రాయపడుతున్నారు. తమిళ దర్శకుడు సీఎస్‌ అముధాన్‌ సైతం అఖిల ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని చెప్పుకొచ్చారు. ఇక శివానీని కించపరిచేలా మాట్లాడినందుకు ఆమె తల్లిని సోషల్‌ మీడియాలో దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె మాట్లాడినదాంట్లో తప్పేమీ లేదని వెనకేసుకొస్తున్నారు. మరోవైపు ఇదంతా తనవల్లే జరిగిందని బాలాజీ హౌస్‌మేట్స్‌ దగ్గర వాపోయాడు. (చదవండి:బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఇంట తీవ్ర‌ విషాదం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement