బిగ్‌బాస్ షో.. లోనికి వెళ్లడమే కంటెస్టెంట్ల చేతిలో ఉంటుంది. బయటకు రావడమనేది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. వారి ఆట నచ్చినంతవరకు కంటెస్టెంట్లను ముందుకు నడిపిస్తూ ఉంటారు. నచ్చని మరుక్షణం ఓట్లు వేయడం మానేసి ఎలిమినేట్ చేస్తారు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం బిగ్‌బాస్ స్వయంగా కంటెస్టెంట్లను అవతలకు పంపించి వేస్తూ ఉంటాడు.
ఒక షో.. రెండు ఇళ్లు
ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే, హౌస్‌లో ఉండలేకపోతున్నామని పోరు పెడితే ఉన్నపళంగా గేట్లు ఎత్తి వెళ్లిపోమంటాడు. ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. తాజాగా తమిళ బిగ్‌బాస్ 7వ సీజన్‌లోనూ ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. అక్టోబర్ 1వ తేదీన తమిళ బిగ్‌బాస్ 7 ప్రారంభమైంది. ఈ షోలో రెండు హౌస్‌లు ఉన్నాయి. ఒకటి పెద్దది, రెండవది చిన్న ఇల్లు. నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్లను చిన్న ఇంట్లో పెట్టి వారితో పనులు చేయిస్తారు. చిన్న ఇంట్లో ఉన్నవారు ఏ టాస్కుల్లోనూ పాల్గొనడానికి వీల్లేదు.
ఆరోగ్యం సహకరించడం లేదంటూ..
రచయిత, నటుడు బావ చెల్లదురై గతవారం నామినేషన్‌లో ఉండటంతో తనకు కూడా వంట చేయడం, క్లీనింగ్ వంటి పనులు తప్పలేదు. ఈ క్రమంలో ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. ఇదే విషయాన్ని బిగ్‌బాస్‌కు చెప్తూ తనను పంపించేయమని వేడుకున్నాడు చెల్లదురై. తన శారీరక, మానసిక ఆరోగ్యం బాగోలేదని, ఇంట్లో నుంచి వెళ్లిపోతానని మొర పెట్టుకున్నాడు.
తండ్రిలా చూసుకున్నారు, కానీ..
బాగా ఆలోచించుకుని సమాధానం చెప్పమని బిగ్‌బాస్ అన్నప్పటికీ తాను వెళ్లిపోవాలన్న మాటకే కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నాడు. 'నేను ఇక్కడ ఇండలేను. ఇంకా ఆలోచించడానికేం లేదు. కంటెస్టెంట్లు నన్ను తండ్రిలా చూసుకున్నారు. కానీ నాకు ఆరోగ్యం సహకరించడం లేదు. ప్లీజ్, వెళ్లిపోతాను' అని అభ్యర్థించాడు. దీంతో బిగ్‌బాస్ తన కోరిక మేరకు బావ చెల్లదురైని ఇంటి నుంచి పంపించేశాడు.
Bava Chelladurai walks out of the show.#BiggBossTamil7 pic.twitter.com/FmVG8sdHM4
— Bigg Boss Follower (@BBFollower7) October 9, 2023
Comments
Please login to add a commentAdd a comment