
తమిళ బిగ్‌బాస్ మూడో సీజన్ కంటెస్టెంటు లోస్లియా ఇంట విషాదం నెలకొంది. ఆమె ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తండ్రి మారియనేసన్ హఠాన్మరణం చెందారు. కెనడాలో ఆదివారం ఆయన గుండెపోటుతో ప్రాణాలు విడవడంతో ఆమె పుట్టెడు శోఖంలో మునిగిపోయారు. మారియనేసన్ మృతి పట్ల సినీ ప్రముఖులు, ఆమె స్నేహితులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా శ్రీలంకకు చెందిన న్యూస్ రీడర్ లోస్లియా బిగ్‌బాస్ షోలో పాల్గొన్నాక ఎనలేని పాపులారిటీ సంపాదించుకున్నారు. (చదవండి: బ్రో.. అతడో తాగుబోతు.. వదిలెయ్!)
పదేళ్లుగా కెనడాలో స్థిరపడిన మారియనేసన్ బిగ్‌బాస్ షోలో పాల్గొన్న తన కూతురిని కలిసేందుకు హౌస్‌లోకి వెళ్లారు. ఆ సమయంలో తండ్రిని చూసి ఆమె భావోద్వేగానికి లోనైన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక తన ఆటతో విశేషంగా అభిమానులను సంపాదించుకున్న లోస్లియా టాప్ 3లోనూ చోటు దక్కించుకున్నారు. బిగ్‌బాస్ తర్వాత ఆమె నటనా రంగంలోకి అడుగు పెట్టారు. క్రికెటర్ హర్భజన్ సింగ్ హీరోగా నటిస్తున్న "ఫ్రెండ్‌షిప్" సినిమాలో నటిస్తున్నారు. (చదవండి: ప్యాంటులో మాస్క్ పెట్టుకుంటావా?: సల్మాన్ ఫైర్)
Popular #BiggBossTamil3 Contestant / Tamil Actress #Losliya 's father #Mariyanesan passed away, due to heart attack..
— Ramesh Bala (@rameshlaus) November 16, 2020
Condolences to family and friends.. May his soul RIP! pic.twitter.com/0ZF0ezo0Fl