దుబాయ్‌లో మరో అమ్మాయితో భర్త ఎఫైర్‌.. మోసం చేశాడన్న నటి | Samyuktha Shan Reveals About Her Broken Marriage And Husband Cheating - Sakshi
Sakshi News home page

Samyuktha: ప్రేమపెళ్లి.. కొడుకు పుట్టాక మరో అమ్మాయితో 4 ఏళ్లుగా ఎఫైర్‌.. భర్త అన్యాయం చేశాడంటూ 'వారసుడు' నటి భావోద్వేగం

Published Mon, Oct 2 2023 4:12 PM | Last Updated on Mon, Oct 2 2023 6:10 PM

Samyuktha Opens Up on Broken Marriage, Husband Cheating - Sakshi

ప్రేమ, పెళ్లి అనేది నమ్మకం అనే పునాదులపైనే నిలబడుతుంది. కానీ తన భర్త తానే సర్వస్వం అని నటిస్తూనే మరొకరితో ఎఫైర్‌ పెట్టుకున్నాడని వాపోయింది నటి సంయుక్త. ఈ బ్యూటీ తమిళ బిగ్‌బాస్‌ 4వ సీజన్‌లో పాల్గొంది. ఈ షో ద్వారా వచ్చిన క్రేజ్‌తో వారసుడు, తుగ్లక్‌, దర్బార్‌ వంటి పలు చిత్రాల్లో నటించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది.

ప్రేమ పెళ్లి.. దుబాయ్‌లో మరో అమ్మాయితో
'నా భర్త దుబాయ్‌లో వ్యాపారం చేస్తుంటాడు. కరోనా సమయంలో అతడి గురించి నాకు భయంకరమైన నిజం తెలిసింది. నాలుగేళ్లుగా అతడు మరో అమ్మాయితో ఎఫైర్‌ పెట్టుకున్న విషయం తెలిసింది. అప్పుడు నా మనసు ముక్కలైంది. అసలేం చేయాలో కూడా తోచలేదు. లాక్‌డౌన్‌ వల్ల ఎక్కడికీ వెళ్లలేకపోయాను. అప్పుడే నాకు యాంకర్‌ భావన పరిచయమైంది. నేను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే తను కూడా ఉంటుంది. కలిసినప్పుడల్లా హాయ్‌, బై.. ఇంతే మాట్లాడుకునేవాళ్లం. తర్వాత కలిసి వాకింగ్‌కు వెళ్లడం మొదలుపెట్టాం. ఒకరోజు తను నా భర్త, కుటుంబం గురించి అడిగింది. అప్పుడే నా గుండెల్లో ఉన్న బాధనంతా ఒక్కసారిగా కన్నీటిరూపంలో తన్నుకుంటూ వచ్చింది.

బిగ్‌బాస్‌కు ట్రై చేయొచ్చుగా అని సలహా
నా మనసులో ఉన్న బాధనంతా తనతో చెప్పుకున్నాను. అప్పటికి తనింకా నాకంత క్లోజ్‌ ఏమీ అవలేదు. అయినా నా తరపున నిలబడింది. నన్ను ఓదార్చింది. లాక్‌డౌన్‌ కావడంతో ఇంటిదగ్గరే కలిసి వర్కవుట్‌ చేసేవాళ్లం. అలా చాలా క్లోజ్‌ అయిపోయాం. మేలో నా 8వ వివాహ వార్షికోత్సవం వచ్చింది. నా బతుకు ఇలా అయిపోయిందేంటని ఒక్కదాన్ని ఎంతలా ఏడ్చానో! నాకు ఓ కొడుకు ఉన్నాడు. ఇల్లు గడవాలంటే సంపాదన అవసరం. అందుకే నాకేదైనా పని దొరుకుతుందేమో చూడమని భావనకు చెప్పాను. తను నీకేది నచ్చితే అదే చేయాలంది. బిగ్‌బాస్‌ షోకి ట్రై చేయవచ్చు కదా అని సలహా ఇచ్చింది. అంతేకాదు, బిగ్‌బాస్‌ షోకి నన్ను రిఫర్‌ చేసింది కూడా!

విడాకులిస్తానంటే రావట్లేదు
సంయుక్త ఎవరనేది ఈ ప్రపంచానికి తెలిసిందంటే అది భావన వల్లే! తన వల్లే నేను ఇక్కడిదాకా వచ్చాను. ఇప్పటికీ నా కొడుకు నాన్న ఎక్కడ? అని అడుగుతుంటాడు. తను బయట దేశంలో పని చేస్తున్నాడు, ఇండియాకు రాలేడు అని సర్ది చెప్తూ వస్తున్నాను. ఆయన మాకు ఎందుకింత అన్యాయం చేశాడో తెలియడం లేదు. తనకు విడాకులిచ్చేందుకు ఎప్పుడో సిద్ధమయ్యాను. కానీ తను ఇండియాకు రావడానికి కూడా ఇష్టపడటం లేదు. అందుకే ఇంకా విడాకుల ప్రక్రియ పూర్తి కాలేదు' అని చెప్తూ ఎమోషనలైంది. కాగా సంయుక్త ఎంటర్‌ప్రెన్యూర్‌ కార్తీక్‌ శంకర్‌ను ప్రేమించి పెళ్లాడింది. వీరికి ఒక బాబు రేయాన్‌ ఉన్నాడు. బిగ్‌బాస్‌ తర్వాత తను మోడల్‌, నటిగా కెరీర్‌లో దూసుకుపోతోంది.

చదవండి: కట్టప్పనే మించిపోయావ్‌, నీకన్నా పాము నయం.. గడగడలాడించిన గీతూ.. షాకైన రతిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement