బిగ్‌బాస్‌ షోను వెంటనే నిషేధించాలి! | Ban Tamil Bigg Boss Show Immediately, Demands Hindu Groups | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 5 2018 7:44 PM | Last Updated on Fri, Jul 6 2018 7:35 AM

Ban Tamil Bigg Boss Show Immediately, Demands Hindu Groups - Sakshi

సాక్షి, చెన్నై : తమిళ‌ బిగ్‌బాస్‌ షోపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహిస్తూ.. అశ్లీలకరంగా నడుస్తున్న ఈ షోను వెంటనే నిషేధించాలంటూ హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. బిగ్ బాస్‌ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమల్ హాసన్‌కు, ఈ షోను ప్రసారం చేస్తున్న విజయ్ టీవీకి వ్యతిరేకంగా గురువారం చెన్నైలో ధర్నా నిర్వహించాయి. ఈ సందర్బంగా హిందూ సంఘాల కార్యకర్తలు విజయ్ టీవీని ముట్టడించేందుకు ప్రయత్నించగా.. వారిని పోలీసుల అడ్డుకున్నారు.

విజయ్ టీవీకి, కమల్ హాసన్‌కు వ్యతిరేకంగా హిందూత్వ శ్రేణులు నినాదాలు చేశాయి. తమిళనాడులో బిగ్‌బాస్‌ షోను నిషేధించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హిందూ సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషనుకు తరలించారు. బిగ్‌బాస్‌ షో పూర్తిగా అశ్లీలకరంగా నడుస్తోందని, పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహిస్తోందని రోజురోజుకు తమిళనాడులో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement