
తమిళ బిగ్‌బాస్ షో హోస్ట్‌గా విశ్వ నటుడు కమల్ హాసన్ తప్పుకున్నప్పటి నుంచి ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా? అని అంతా ఎదురు చూస్తున్నారు. మొదట్లో రమ్యకృష్ణను హోస్ట్‌గా నిలబెడతారనుకున్నారు. కానీ, బిగ్‌బాస్ అల్టిమేట్ షోలో పాల్గొంటున్న ఓ కంటెస్టెంట్ కారణంగా షో వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు ఆమె విముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.
దీంతో కోలీవుడ్ యంగ్ హీరోను సంప్రదించగా అతడు ఓకే చెప్పినట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఇది నిజమేనని వెల్లడించింది బిగ్‌బాస్ టీమ్. బిగ్‌బాస్ ఓటీటీకి హీరో శింబు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేసింది. మరి శింబు హోస్ట్‌గా బుల్లితెరపై అదరగొడతాడా? కంటెస్టెంట్ల లెక్కలు సరిచేస్తాడా? అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తాడా? అనేది చూడాలి!
#STRtheHostOfBBUltimate 💥 pic.twitter.com/GWozob5Kwu
— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) February 24, 2022
Comments
Please login to add a commentAdd a comment