
తమిళ బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటుడు ప్రదీప్ ఆంటోని పెళ్లికి రెడీ అయ్యాడు. ప్రియురాలితో ఏడడుగులు వేయనున్నాడు. ఈ మేరకు ఆదివారం (జూన్ 16న) అతడి నిశ్చితార్థం కూడా జరిగింది. ఇరు కుటుంబాలు సహా అత్యంత దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రదీప్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాగా ప్రదీప్ ఆంటోని తమిళ బిగ్‌బాస్ ఏడో సీజన్‌తో పాపులర్ అయ్యాడు. ముక్కుసూటిగా మాట్లాడేవాడు. అయితే ఆ ధోరణి చాలామందికి నచ్చేది కాదు. తన కుళ్లు జోకులు కూడా బిగ్‌బాస్ హౌస్‌లో కొందరు ఇష్టపడలేదు.
అసభ్య జోకులు వేస్తున్నాడని, బూతులు మాట్లాడుతున్నాడని, తన ప్రవర్తన బాగోలేదని మాయ, పూర్ణిమ, జోవిక, నిక్సెన్, కూల్ సురేశ్, శరవణ విక్రమ్, అక్షయ వంటి పలువురు కంటెస్టెంట్లు బిగ్‌బాస్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కమల్ హాసన్ రెడ్ కార్డు చూపించి తనను బయటకు పంపించేశారు. సినిమాల విషయానికి వస్తే దాదా, అరువి, వాళ్ వంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్నాడు.
Got engaged, yesterday 🙏 #FamilyMan#EnakulaamNadakathuNuNinaichen #ParavaillaPonnuKudukurangaEnnaNambi#90sKidsSaadhanaigal pic.twitter.com/vyg0DuCnaQ
— Pradeep Antony (@TheDhaadiBoy) June 17, 2024
చదవండి: మరికొద్ది రోజుల్లో పెళ్లి.. ప్రియుడి ఇంట్లో ప్రత్యక్షమైన హీరోయిన్