
తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించిన ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్.. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పి సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమయ్యాడు. పలు యాడ్ ఫిల్స్మ్ కోసం కెమెరా ముందుకొచ్చిన హర్భజన్ సింగ్.. ఈసారి ‘ఫ్రెండ్ షిప్’ అనే తమిళ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. తమిళ బిగ్‌బాస్ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు.
సీన్‌టో స్టూడియోస్, సినీ మాస్ స్టూడియోస్ పతాకాలపై జేపీఆర్, స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ‘ఫ్రెండ్ షిప్’ను పలు భారతీయ భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాలోని ఇతర నటీనటులు. సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. సినిమా చిత్రీకరణ వేగంగా పూర్తి చేసి ఈ ఏడాది సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment