Nandamuri Balakrishna and Other Actors Condoled The Death of Chalapathi Rao - Sakshi
Sakshi News home page

ఓ గొప్ప నటుడ్ని కోల్పోయాం.. చలపతిరావు మృతిపై బాలకృష్ణ దిగ్భ్రాంతి

Published Sun, Dec 25 2022 10:19 AM | Last Updated on Sun, Dec 25 2022 11:31 AM

Nandamuri Balakrishna And Other Actors Expressed Their Grief On Demise Of Chalapathi Rao - Sakshi

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు చలపతి రావు మృతిపట్ల హీరో నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఓ మంచి నటుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘చలపతిరావు గారి హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసింది. తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులని అలరించారు. నిర్మాతగా కూడా మంచి చిత్రాలని నిర్మించారు. మా కుటుంబంతో చలపతిరావు గారికి అవినాభావ సంబంధం ఉంది.

నాన్నగారితో కలసి అనేక చిత్రాల్లో నటించారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. చలపతిరావు గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’అని బాలకృష్ణ అన్నారు. 

విలక్షణమైన నటుడు,తనదైన శైలి తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న శ్రీ చలపతి రావు గారి అకాల మరణ వార్త నన్ను కలచివేసింది.ఎన్నో చిత్రాల్లో ఆయన తో నేను కలిసి నటించడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, రవి బాబు కి, ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి.- మెగాస్టార్‌ చిరంజీవి

‘అందరి ఆప్తుడు.. చలపతిరావు బాబాయ్ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. నా మిత్రుడు రవిబాబుకి ఆ భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ.. ‘తెలుగు దర్శకుల సంఘం’ తరపున.. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను - వై. కాశీ విశ్వనాధ్, టీఎఫ్‌డీఏ ప్రెసిడెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement