
నందమూరి తారకరత్న భౌతికకాయానికి సినీ ప్రముఖులు నివాళులర్పించారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఆయన నివాసానికి చేరుకుని తారకరత్న కుటుంబాన్ని పరామర్శించారు. తారకరత్న భార్యను ఓదార్చిన మెగాస్టార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతో పాటు నందమూరి బాలకృష్ణ సైతం తారకరత్న నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.
గుండెపోటుకు గురైన తారకరత్న దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. త 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందతూ మరణించారు. ఆయన మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. టాలీవుడ్‌తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
జనవరి 27న నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్ర మొదటి రోజే తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. వెంటనే ఆయన్ను కుప్పంలోకి స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అదేరోజు అర్థరాత్రి బెంగళూరుకు షిఫ్ట్ చేశారు. అప్పట్నుంచి నిపుణలైన వైద్య బృందం ఆయనకు చికిత్స అందించింది. గత వారం రోజులుగా నిపుణులైన విదేశీ వైద్యులను సైతం రప్పించి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. కానీ వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
Comments
Please login to add a commentAdd a comment