
గ్రామీణ నేపథ్యంలో...
‘జయం’ చిత్రంతో నటుడిగా పరిచయమైన ప్రణీత్ పండగ పలు చిత్రాల్లో నటించారు. తాజాగా ఆయన దర్శకునిగా మారారు. వరం, తన్యారెడ్డి జంటగా ప్రణీత్ దర్శకత్వంలో వైష్ణవి నిరంజన్ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సీనియర్ నటుడు చలపతిరావు, సుమన్‌శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హీరో, హీరోయిన్లపై చలపతిరావు క్లాప్ ఇచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రణీత్‌లో మంచి ప్రతిభ ఉంది’’ అన్నారు. ‘‘పల్లెటూరి నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. హైదరాబాద్, వైజాగ్, చిక్ మంగళూరు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతాం’’ అని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహేష్ ధీర, కెమేరా: రాహుల్ మాచినేని, సమర్పణ: పరమ గీత.