ఎన్నారైల బాధలు | 'Greencard' is the screenplay of the story of how many turns for Green Card. | Sakshi
Sakshi News home page

ఎన్నారైల బాధలు

Published Mon, Jul 31 2017 12:20 AM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM

ఎన్నారైల బాధలు

ఎన్నారైల బాధలు

అమెరికా వెళ్లిన ఇండియన్స్‌ గ్రీన్‌కార్డ్‌ కోసం ఎన్ని తిప్పలు పడతారనే కథతో తెరకెక్కిన సినిమా ‘గ్రీన్‌కార్డ్‌’. శతృఘ్న రాయపాటి, స్టెఫానీ, జోసెలిన్, చలపతిరావు ముఖ్య తారలుగా రమ్స్‌ దర్శకత్వంలో శ్రీనివాస్‌ గుప్తా, మోహన్‌. ఆర్, నరసింహ, నాగ శ్రీనివాసరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 4న విడుదల కానుంది. ‘‘ఈ సినిమాను 80 శాతం అమెరికాలోనే చిత్రీకరించారు.

నేను హీరో తండ్రిగా చేశా. అమెరికాలో మనవాళ్లు పడే కష్టాలను వివరిస్తూ, ప్రణయ్‌కుమార్‌ ఈ సినిమాలో మంచి పాట రాశారు’’ అన్నారు సీనియర్‌ నటుడు చలపతిరావు. ‘‘అమెరికాకు వెళ్తే ఎక్కువ డాలర్లు సంపాదించవచ్చని, ఎన్నారైలు సంతోషంగా ఉంటారనని అందరూ అనుకుంటారు. కానీ, వారు కన్నీళ్లతో బతుకుతున్నారు. వారి కష్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదు’’ అన్నారు దర్శకుడు రమ్స్‌. ఈ చిత్రానికి  కెమెరా: నవీన్‌–నాగ శ్రీనివాస్‌రెడ్డి, సంగీతం: కు, హెన్నీ ప్రిన్స్, ప్రణయ్‌కుమార్‌. సమర్పణ: దేవాన్ష్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement