Stephanie
-
అభిమానికి ఇల్లు కొనిచ్చింది!
మాంచెస్టర్‌లో పాప్‌స్టార్ టేలర్ స్విఫ్ట్ షో జరుగుతోంది. ఆమె పాటలు వినడం కోసం వేలాదిమంది అభిమానులు వచ్చారు. అందులో స్టెఫానీ కూడా ఓ అభిమాని. ఆమె ఓ గర్భిణి. టేలర్ స్విఫ్ట్ షో చూడడానికి మాత్రమే కాక, ఆమెతో చిన్న అపాయింట్మెంట్ కూడా దక్కించుకుంది స్టెఫానీ. అప్పటికే టేలర్ స్విఫ్ట్‌తో స్టెఫీనా తల్లి మాట్లాడి ఉంది. ‘స్టెఫానీని సంతోషపెట్టేలా ఆమెతో మాట్లాడు’ అని మాత్రమే స్విఫ్ట్‌ను అడిగింది స్టెఫానీ తల్లి. షో అయ్యాక స్టెఫానీని తన గదికి పిలిపించుకొని.. ‘నీకేం కావాలో చెప్పు..’ అనడిగింది స్విఫ్ట్. స్టెఫానీ తన బాధ చెప్పుకుంది. ఆ బాధ విన్న టేలర్ స్విఫ్ట్ ఆమెకు ఏ కొన్ని డబ్బులో, ఏదో చిన్న సాయమో చేసి పంపితే అది ఇంత పెద్ద వార్త అయ్యేదే కాదు. స్టెఫానీకి ఓ ఇల్లు కొనుక్కోమని డబ్బులిచ్చి, అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసి పంపింది టేలర్. ఇది జరిగిన సమయానికి స్టెఫానీ ఎనిమిది నెలల గర్భిణి. ఇప్పుడామెకు ఓ కూతురు. ‘‘నాకు ఇల్లు లేదు. అప్పుల్లో చిక్కుకొని అమ్మేసుకోవాల్సి వచ్చింది. నా భర్తకు ఉద్యోగం పోయింది. అప్పుడే టేలర్ షో చూడడానికి వెళ్లా. షో అయ్యాక నా గురించి తెలుసుకొని, ఇల్లు కొనుక్కోమని డబ్బులు ఇచ్చింది. నేనిది ఊహించలేదు. టేలర్ ఈజ్ లవ్..’’ అని తన కథను షేర్ చేసుకుంది స్టెఫానీ. -
ఎన్నారైల బాధలు
అమెరికా వెళ్లిన ఇండియన్స్ గ్రీన్‌కార్డ్ కోసం ఎన్ని తిప్పలు పడతారనే కథతో తెరకెక్కిన సినిమా ‘గ్రీన్‌కార్డ్’. శతృఘ్న రాయపాటి, స్టెఫానీ, జోసెలిన్, చలపతిరావు ముఖ్య తారలుగా రమ్స్ దర్శకత్వంలో శ్రీనివాస్ గుప్తా, మోహన్. ఆర్, నరసింహ, నాగ శ్రీనివాసరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 4న విడుదల కానుంది. ‘‘ఈ సినిమాను 80 శాతం అమెరికాలోనే చిత్రీకరించారు. నేను హీరో తండ్రిగా చేశా. అమెరికాలో మనవాళ్లు పడే కష్టాలను వివరిస్తూ, ప్రణయ్‌కుమార్ ఈ సినిమాలో మంచి పాట రాశారు’’ అన్నారు సీనియర్ నటుడు చలపతిరావు. ‘‘అమెరికాకు వెళ్తే ఎక్కువ డాలర్లు సంపాదించవచ్చని, ఎన్నారైలు సంతోషంగా ఉంటారనని అందరూ అనుకుంటారు. కానీ, వారు కన్నీళ్లతో బతుకుతున్నారు. వారి కష్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదు’’ అన్నారు దర్శకుడు రమ్స్. ఈ చిత్రానికి కెమెరా: నవీన్–నాగ శ్రీనివాస్‌రెడ్డి, సంగీతం: కు, హెన్నీ ప్రిన్స్, ప్రణయ్‌కుమార్. సమర్పణ: దేవాన్ష్.