అభిమానికి ఇల్లు కొనిచ్చింది! | Taylor Swift saves homeless and pregnant fan by buying her a house | Sakshi
Sakshi News home page

అభిమానికి ఇల్లు కొనిచ్చింది!

Published Mon, Jan 1 2018 12:30 AM | Last Updated on Mon, Jan 1 2018 12:30 AM

Taylor Swift saves homeless and pregnant fan by buying her a house - Sakshi

మాంచెస్టర్‌లో పాప్‌స్టార్‌ టేలర్‌ స్విఫ్ట్‌ షో జరుగుతోంది. ఆమె పాటలు వినడం కోసం వేలాదిమంది అభిమానులు వచ్చారు. అందులో స్టెఫానీ కూడా ఓ అభిమాని. ఆమె ఓ గర్భిణి. టేలర్‌ స్విఫ్ట్‌ షో చూడడానికి మాత్రమే కాక, ఆమెతో చిన్న అపాయింట్‌మెంట్‌ కూడా దక్కించుకుంది స్టెఫానీ. అప్పటికే టేలర్‌ స్విఫ్ట్‌తో స్టెఫీనా తల్లి మాట్లాడి ఉంది. ‘స్టెఫానీని సంతోషపెట్టేలా ఆమెతో మాట్లాడు’ అని మాత్రమే స్విఫ్ట్‌ను అడిగింది స్టెఫానీ తల్లి. షో అయ్యాక స్టెఫానీని తన గదికి పిలిపించుకొని.. ‘నీకేం కావాలో చెప్పు..’ అనడిగింది స్విఫ్ట్‌. స్టెఫానీ తన బాధ చెప్పుకుంది.

ఆ బాధ విన్న టేలర్‌ స్విఫ్ట్‌ ఆమెకు ఏ కొన్ని డబ్బులో, ఏదో చిన్న సాయమో చేసి పంపితే అది ఇంత పెద్ద వార్త అయ్యేదే కాదు. స్టెఫానీకి ఓ ఇల్లు కొనుక్కోమని డబ్బులిచ్చి, అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసి పంపింది టేలర్‌. ఇది జరిగిన సమయానికి స్టెఫానీ ఎనిమిది నెలల గర్భిణి. ఇప్పుడామెకు ఓ కూతురు. ‘‘నాకు ఇల్లు లేదు. అప్పుల్లో చిక్కుకొని అమ్మేసుకోవాల్సి వచ్చింది. నా భర్తకు ఉద్యోగం పోయింది. అప్పుడే టేలర్‌ షో చూడడానికి వెళ్లా. షో అయ్యాక నా గురించి తెలుసుకొని, ఇల్లు కొనుక్కోమని డబ్బులు ఇచ్చింది. నేనిది ఊహించలేదు. టేలర్‌ ఈజ్‌ లవ్‌..’’ అని తన కథను షేర్‌ చేసుకుంది స్టెఫానీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement