Greencard
-
వీగిపోయిన అమెరికా వలస బిల్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ప్రతిపాదిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు గురువారం ప్రతినిధుల సభలో వీగిపోయింది. దేశాల వారీ గ్రీన్‌కార్డు కోటాను రద్దు చేయడంతో పాటు భారత్ వంటి వర్ధమాన దేశాల పౌరులు చట్టబద్ధంగా అమెరికాకు వలస వెళ్లేలా ఈ బిల్లులో నిబంధనలు పొందుపర్చిన సంగతి తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ సభ్యుడు బాబ్ గుడ్‌లాటె ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అనుకూలంగా 121 ఓట్లు, వ్యతిరేకంగా 301 ఓట్లు పడ్డాయి. ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేయాలని ఓటింగ్‌కు ముందు ట్రంప్ ఇరు పార్టీల సభ్యులకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. రిపబ్లికన్లు ఏకపక్షంగా ప్రవేశపెట్టిన మరో బిల్లు ఓటమిపాలైందని డెమొక్రటిక్ పార్టీ విప్ హోయర్ వ్యాఖ్యానించారు. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమయ్యేలా బిల్లులో మార్పులు చేయడమే మిగిలిన ఏకైక మార్గమని మరో సభ్యుడు టాడ్ షూల్టె అన్నారు. చట్టబద్ధంగా వలసొచ్చే వారికి తాజా బిల్లు ప్రతికూలంగా మారిందని, వలస కుటుంబాలు, వారి పిల్లల నిర్బంధాన్ని సమర్థించేలా ఉందన్నారు. -
గ్రీన్‌కార్డు కోసం 151 ఏళ్లు వేచిచూడాలా?
వాషింగ్టన్ : అమెరికా వెళ్లి, అక్కడే స్థిరపడాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. వారి కలలకు ఇటీవల ట్రంప్ సర్కార్ కళ్లెం వేస్తూ వస్తోంది. అంతేకాక అక్కడికి వెళ్లి, గ్రీన్‌కార్డు కోసం వేచిచూస్తున్న వారి పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండేందుకు పొందే గ్రీన్ కార్డు కోసం భారతీయులు 150 ఏళ్లకు పైన వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పరుడుతోంది. అడ్వాన్స్ డిగ్రీలు కలిగి ఉన్నప్పటికీ 150 సంవత్సరాలకు పైగా వేచిచూడాల్సి వస్తుందని తాజా అంచనాలు పేర్కొంటున్నాయి. వాషింగ్టన్కు చెందిన కాటో ఇన్స్టిట్యూట్ ఈ గణాంకాలను వెల్లడించింది. గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్యను అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్(యూఎస్సీఐఎస్) విడుదల చేసిన అనంతరం కాటో ఇన్స్టిట్యూట్ ఈ గణాంకాలను రిలీజ్చేసింది. ఈ గణాంకాలు 2017లో గ్రీన్‌కార్డు జారీని అనుసరించి ఉన్నాయి. 2018 ఏప్రిల్ 20 వరకు 632,219 మంది భారతీయ వలసదారులు, వారి జీవిత భాగస్వాములు, మైనర్ పిల్లలు గ్రీన్ కార్డు కోసం వేచిచూస్తున్నారని పేర్కొంది. ఈ కార్డునే అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండేందుకు న్యాయబద్దమైనదిగా భావిస్తారు. ఎవరైతే అడ్వాన్స్ డిగ్రీలు కలిగి ఉన్నారో అంటే ఈబీ-2 వర్కర్ల పరిస్థితే దారుణంగా ఉందని కాటో ఇన్స్టిట్యూట్ తెలిపింది. ఈ కేటగిరీ భారతీయులు గ్రీన్ కార్డు కోసం 151 ఏళ్ల వరకు వేచిచూడాల్సి వస్తుందని, ఈ చట్టంలో మార్పులు తీసుకురావాల్సి ఉందని కాటో ఇన్ స్టిట్యూట్ సూచించింది. ఒకవేళ చట్టంలో కనుక మార్పులు తీసుకురాకపోతే, వారికి గ్రీన్ కార్డు వచ్చే సరికి వారు చనిపోవడమో లేదా ఎక్కడికైనా వెళ్లిపోవడమో జరుగుతుందని పేర్కొంది. యూఎస్సీఐఎస్ ప్రకారం ఈబీ-2 కేటగిరీ కింద 2,16,684 మంది భారతీయ దరఖాస్తుదారులున్నారు. వారి జీవిత భాగస్వాములు, పిల్లల్ని తీసుకుంటే, మొత్తంగా 4,333,368 మంది ఉన్నట్టు తెలిసింది. అయితే అత్యధిక నైపుణ్యమున్న కేటగిరీకి చెందిన ఈబీ-1 వలసదారులు ఈ కార్డుల కోసం కాస్త తక్కువ సమయమే వేచిచూడాల్సి వస్తుందని కాటో ఇన్స్టిట్యూట్ అధ్యయనం పేర్కొంది. అసాధారణ ప్రతిభ కలిగిన వలసదారులకు కేవలం ఆరు సంవత్సరాలే పడుతుందని చెప్పింది. ఇక ఈబీ-3 కేటగిరీ వలసదారులైతే గ్రీన్‌కార్డు కోసం 17 సంవత్సరాలు వేచిచూస్తున్నారని కాటో ఇన్స్టిట్యూట్ తెలిపింది. ఏప్రిల్ 20 వరకు ఈ కేటగిరీ కింద 54,892 మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 60,381 మంది జీవిత భాగస్వాములు, పిల్లలను కలుపుకుంటే, మొత్తంగా 1,15,273 మంది భారతీయులు ఈ కేటగిరీలో గ్రీన్‌కార్డు పొందేందుకు వేచి ఉన్నారని కాటో ఇన్స్టిట్యూట్ రిపోర్టు వెల్లడించింది. -
ఎన్నారైల బాధలు
అమెరికా వెళ్లిన ఇండియన్స్ గ్రీన్‌కార్డ్ కోసం ఎన్ని తిప్పలు పడతారనే కథతో తెరకెక్కిన సినిమా ‘గ్రీన్‌కార్డ్’. శతృఘ్న రాయపాటి, స్టెఫానీ, జోసెలిన్, చలపతిరావు ముఖ్య తారలుగా రమ్స్ దర్శకత్వంలో శ్రీనివాస్ గుప్తా, మోహన్. ఆర్, నరసింహ, నాగ శ్రీనివాసరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 4న విడుదల కానుంది. ‘‘ఈ సినిమాను 80 శాతం అమెరికాలోనే చిత్రీకరించారు. నేను హీరో తండ్రిగా చేశా. అమెరికాలో మనవాళ్లు పడే కష్టాలను వివరిస్తూ, ప్రణయ్‌కుమార్ ఈ సినిమాలో మంచి పాట రాశారు’’ అన్నారు సీనియర్ నటుడు చలపతిరావు. ‘‘అమెరికాకు వెళ్తే ఎక్కువ డాలర్లు సంపాదించవచ్చని, ఎన్నారైలు సంతోషంగా ఉంటారనని అందరూ అనుకుంటారు. కానీ, వారు కన్నీళ్లతో బతుకుతున్నారు. వారి కష్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదు’’ అన్నారు దర్శకుడు రమ్స్. ఈ చిత్రానికి కెమెరా: నవీన్–నాగ శ్రీనివాస్‌రెడ్డి, సంగీతం: కు, హెన్నీ ప్రిన్స్, ప్రణయ్‌కుమార్. సమర్పణ: దేవాన్ష్. -
గ్రీన్‌కార్డు ‘కోటా’ తొలగించాలి
అమెరికా రిపబ్లికన్ సభ్యుడు కెవిన్ వాషింగ్టన్: అమెరికాలో తాత్కాలిక వీసాపై ఉద్యోగం చేస్తున్న విదేశీయులకు నైపుణ్యం, దరఖాస్తుల ఆధారంగా గ్రీన్‌కార్డులు(శాశ్వత నివాస ధ్రువీకరణ) మంజూరు చేయాలని, ప్రస్తుతమున్న కోటా విధానాన్ని రద్దు చేయాలని అమెరికన్ చట్టసభ ప్రముఖుడొకరు డిమాండ్ చేశారు. ప్రతీ దేశానికి ఒకే నిష్పత్తిలో కేటాయింపు కారణంగా భారత్, చైనా వంటి దేశాలకు చెందిన వృత్తి నిపుణులకు కేటాయింపులో అన్యాయం జరుగుతుందని రిపబ్లికన్ సభ్యుడు కెవిన్ యోదెర్ అన్నారు. ట్రంప్‌పై అభిశంసన తీర్మానం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభిశంసనకు సంబంధించి తొలి ఆర్టికల్(ఆర్టికల్ ఆఫ్ ఇంపీచ్మెంట్)ను డెమొక్రాట్ సభ్యుడు బ్రాడ్ షెర్మన్ ప్రవేశపెట్టారు. అమెరికా ఎన్నికల్లో రష్యా పాత్రకు సంబంధించి సాగుతున్న విచారణకు ట్రంప్ విఘాతం కల్గించారని ఆరోపిస్తూ ప్రతినిధుల సభలో ఆయన పెట్టిన తీర్మానంపై మరో డెమొక్రాట్ సభ్యుడు అల్ గ్రీన్ సంతకం చేశారు. పారిస్ ఒప్పందంపై నిర్ణయం మారొచ్చేమో: ట్రంప్ పారిస్: పారిస్ వాతావరణ ఒప్పందంపై తన నిర్ణయం మారొచ్చేమోనని ట్రంప్ గురువారం అన్నారు. ‘ఒప్పందంపై ఏదో ఒకటి జరగొచ్చు. చూద్దాం ఏమవుతుందో’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడితో భేటీ తర్వాత ట్రంప్ వ్యాఖ్యానించారు.