
కడ్తాలలో నటుడు చలపతిరావు సందడి
కడ్తాల : మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండలం కడ్తాల గ్రామంలో తెలుగు సినిమా నటుడు చలపతిరావు సోమవారం సందడి చేశారు. కుటుంబ సమేతంగా శ్రీశైలం వెళ్లి మల్లిఖార్జున స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వెళ్తూ.. కడ్తాల గ్రామ సమీపంలో కాసేపు ఆగారు. అక్కడ తాటి ముంజలు విక్రయిస్తుండటంతో వాటిని తిని, కాసేపు సరదగా గడిపారు. ఈ సందర్భంగా ఆయనను గమనించిన స్థానికులు ఆయనతో పోటోలు దిగడానికి ఉత్సాహం చూపారు. అనంతరం ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.