‘ఆప్‌’ నేతపై కాల్పులు..బుల్లెట్‌ గాయం | Aap Leader Injured In Gun Fire In Punjab | Sakshi
Sakshi News home page

‘ఆప్‌’ నేతపై కాల్పులు..బుల్లెట్‌ గాయం

Published Sun, Oct 6 2024 1:31 PM | Last Updated on Sun, Oct 6 2024 2:00 PM

Aap Leader Injured In Gun Fire In Punjab

చండీగఢ్‌:పంజాబ్‌లో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) నేత మన్‌దీప్‌ సింగ్‌ బ్రార్‌ కాల్పుల్లో గాయపడ్డారు.ప్రతిపక్ష శిరోమణి అకాళీదళ్‌నేత మన్‌దీప్‌సింగ్‌పై కాల్పులు జరిపినట్లు ఆరోపనలున్నాయి. ఆదివారం(అక్టోబర్‌6) అకాలీదళ్‌ నాయకుడు వర్దేవ్‌ సింగ్‌ మాన్‌ ఓ స్కూల్‌కు సంబంధించిన ఫైల్‌ గురించి బీడీపీఓ కార్యాలయానికి వెళ్లారు.

ఆ ఫైల్‌ చూపించేందుకు అధికారులు నిరాకరించడంతో సింగ్‌ అక్కడినుంచి వెనుదిరిగారు. వెళుతు వెళుతూ బయట ఉన్న ఆప్‌ నేత మన్‌దీప్‌ సింగ్‌ బ్రార్‌తో సింగ్‌ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో ఆప్‌నేత మన్‌దీప్‌కు బుల్లెట్‌ గాయమైంది. వెంటనే ఆయనను  జలాలాబాద్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అకాలీ పార్టీ నాయకులే కాల్పులకు ఆప్‌ నేతలు ఆరోపించారు. పంచాయితీ ఎన్నికల సమయంలో అకాళీదళ్‌ పార్టీ దాడులకు పాల్పడుతోందన్నారు. ఈ నెల 15న పంజాబ్‌లో సర్పంచ్‌ ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చదవండి: ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement