
ముంబై: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. రెండంతస్తుల భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఇద్దరు పిల్లలతో సహా ఏడుగురు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. చెంబూరులోని సిద్ధార్థ్ కాలనీలో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఎలక్ట్రికల్ వస్తువుల దుకాణంలో మంటలు చెలరేగి.. పై అంతస్తుకు వ్యాపించాయని అధికారులు తెలిపారు. మృతులను పారిస్ గుప్తా, నరేంద్ర గుప్తా, మంజు ప్రేమ్ గుప్తా, అనితా గుప్తా, ప్రేమ్ గుప్తా, విధి గుప్తా, గీతా గుప్తాగా గుర్తించారు. వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: ప్రియుడి మోజులో.. ఆమె భర్తను ఏం చేసిందంటే?
Comments
Please login to add a commentAdd a comment