కాదల్ దండపాణి కన్నుమూత | Popular Actor Kadhal Dhandapani Passes Away | Sakshi
Sakshi News home page

కాదల్ దండపాణి కన్నుమూత

Jul 20 2014 11:53 PM | Updated on Jul 31 2018 5:31 PM

కాదల్ దండపాణి కన్నుమూత - Sakshi

కాదల్ దండపాణి కన్నుమూత

సీనియర్ నటుడు కాదల్ దండపాణి(71) ఆదివారం తెల్లవారుజామున చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ‘కాదల్’ చిత్రంతో ప్రతినాయకునిగా కోలీవుడ్‌కు పరిచయమయ్యారాయన.

సీనియర్ నటుడు కాదల్ దండపాణి(71) ఆదివారం తెల్లవారుజామున చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ‘కాదల్’ చిత్రంతో ప్రతినాయకునిగా కోలీవుడ్‌కు పరిచయమయ్యారాయన. తొలి చిత్రంతోనే దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రాచుర్యం పొందారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడం మొదలగు భాషలలో అతి తక్కువ కాలంలోనే 150 చిత్రాలకు పైగా వివిధ పాత్రలు పోషించారు దండపాణి. తెలుగులో ప్రేమిస్తే, రాజు బాయ్, కృష్ణ వంటి పలు చిత్రాలలో నటించారు.
 
  శనివారం కూడా శరత్‌కుమార్ హీరోగా నటిస్తున్న ‘చండమారుతం’ చిత్రం షూటింగ్‌లో పాల్గొన్నారాయన. ఆదివారం తెల్లవారుజామున చెన్నై వడపళనిలోని స్వగృహంలో ఉండగా గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం పొద్దున దండపాణి మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని సొంత ఊరు దిండుగల్‌కు తరలించి సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ‘కాదల్’ దండపాణి మృతికి నటుడు శరత్‌కుమార్‌తో పాటు పలువురు చిత్రరంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement