Gol Maal Actor Harish Magon Dies At 76 In Mumbai - Sakshi
Sakshi News home page

Harish Magon: బాలీవుడ్ సీనియర్ నటుడు హరీశ్ కన్నుమూత!

Published Sun, Jul 2 2023 7:54 PM | Last Updated on Mon, Jul 31 2023 8:13 PM

Gol Maal Actor Harish Magon Dies At 76 In Mumbai - Sakshi

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు హరీశ్ మాగోన్(76) ముంబయిలో కన్నుమూశారు. ఈ విషయాన్ని సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) ట్విట్టర్‌లో వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అయితే ఆయన మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.

(ఇది చదవండి: రిలేషన్‌షిప్‌పై సీతారామం బ్యూటీ ఆసక్తికర కామెంట్స్..!)

గోల్ మాల్, నమక్ హలాల్, చుప్కే చుప్కే, షహెన్‌షా, ఖుష్బూ, ఇంకార్, ముఖద్దర్ కా సికందర్ వంటి బాలీవుడ్ చిత్రాలలో హరీశ్ మాగోన్ నటించారు. ఆయన చివరిసారిగా కనిపించిన చిత్రం ఉఫ్! యే మొహబ్బత్ కాగా.. ఆ మూవీ 1997లో విడుదలైంది. కాగా.. హరీష్‌కు భార్య, ఓ కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. అతను ముంబయిలోని జుహులో హరీష్ మాగోన్ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్ పేరుతో ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను నడిపారు. 

స్టూడెంట్ సంతాపం

ఆయన మృతికి సంతాపంగా 1975లో విడుదలైన ఆంధీ సినిమాలోని ఒక పాటలోని హరీష్ వీడియోను ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. హరీష్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్‌నని.. గుల్జార్ అసిస్టెంట్ మేరాజ్‌కి సన్నిహిత మిత్రుడినని ట్విటర్‌లో పేర్కొన్నారు.

(ఇది చదవండి: చివరి చిత్రం సక్సెస్.. దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన హీరో!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement