బాలీవుడ్ సీనియర్ నటుడు రసిక్ దేవ్(65) కిడ్నీ ఫెయిల్యూర్‌తో మరణించారు. గత నాలుగేళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సుమారు 15 రోజులపాటు చికిత్స తీసుకున్న ఆయనను గురువారం డిశ్చార్జ్ చేశారు. ఆ మరునాడే కిడ్నీ ఫెయిల్ అవడంతో ప్రాణాలు విడిచారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. రసిక్ దేవ్‌కు భార్య కేత్కి, కూతురు రిద్ధి దేవ్, ఓ కుమారుడు ఉన్నారు.
కాగా రసిక్ దేవ్ పుత్ర వధు అనే గుజరాతీ సినిమాతో ఫిలిం ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. తన భార్య కేత్కితో కలిసి నాచ్ బలియే డ్యాన్స్ షోలోనూ పాల్గొన్నారు. ఇకపోతే రసిక్ బుల్లితెర ప్రేక్షకులకూ సుపరిచితమే! మహాభారత్ సీరియల్‌లో ఆయన నంద పాత్రలో ఒదిగిపోయారు.
Sad to know about the demise of a dear friend Rasik Dave who was a versatile actor on stage , tv and films due to kidney failure.
— Ashoke Pandit (@ashokepandit) July 29, 2022
Heartfelt condolences to his wife Ketaki Dave and his entire family .
Will always be remembered .
ॐ शान्ति !
🙏 pic.twitter.com/tORLPIUKA4
చదవండి: ఇదే నాకు తొలిసారి.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాడు: రష్మిక
నోట్లో సిగరెట్, చెవికి పోగు.. అల్లు అర్జున్ న్యూ లుక్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment