
మహాభారత్ సీరియల్‌లో శకుని మామగా నటించిన సీనియర్ నటుడు గుఫి పైంటాల్ (80) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుఫి ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని గుఫీ మేనల్లుడు హిటెన్ వెల్లడించారు.
(ఇది చదవండి: కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటావ్? అని నా భార్య ప్రశ్నించింది: మనోజ్)
ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయనకు ఓ కొడుకు, కోడలితో పాటు ఓ మనవడు కూడా ఉన్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు అంధేరి సబర్బన్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
(ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నటుడు మృతి)
కాగా.. గుఫీ టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటించారు. మహాభారత్ సీరియల్‌తో పాటు బహదూర్ షా జఫర్, కానూన్, ఓం నమః శివాయ, సీఐడీ, కోయి హై ద్వారకాధీష్ భగవాన్ శ్రీ కృష్ణ, రాధాకృష్ణ, జే కనియా లాల్ షోలలో కనిపించాడు. అతను 1975 చిత్రం రఫూ చక్కర్‌తో బాలీవుడ్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత దిల్లాగి, దేశ్ పరదేశ్, సుహాగ్ చిత్రాలలో కనిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment