మహాభారత్ సీరియల్‌లో శకుని మామగా నటించిన సీనియర్ నటుడు గుఫి పైంటాల్ (80) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం గుఫి పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని ఆయన బంధువు హిటెన్ మీడియాకు వెల్లడించాడు. 'గుఫికి రక్తపోటు అలాగే హృదయ సంబంధిత సమస్యలున్నాయి. చాలాకాలంగా ఆయనకు ఆరోగ్యం బాగుండటం లేదు.
ఇటీవల ఆయన పరిస్థితి మరింత విషమించింది. అందుకే ఆయన్ను వారం రోజుల క్రితం ఆస్పత్రికి తీసుకొచ్చాం. మొదట ఆయన పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం గుఫి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన్ను అబ్జర్వేషన్‌లో ఉంచారు' అని పేర్కొన్నాడు. కాగా నటుడు గుఫి పైంటాల్.. మహాభారత్ సీరియల్ మాత్రమే కాకుండా సీఐడీ, హెల్లో ఇన్‌స్పెక్టర్ వంటి టీవీ షోలు కూడా చేశాడు. సిల్వర్ స్క్రీన్‌కే పరిమితం కాకుండా శర్మాజీ నామ్‌కీన్, సుహాగ్, దిల్లగీ చిత్రాలతో వెండితెరపైనా మెరిశాడు.
Comments
Please login to add a commentAdd a comment