సినిమాల్లో బోలెడన్ని ట్విస్టులు ఉంటాయి. కొన్నిసార్లు రియల్ లైఫ్‌లో అంతకన్నా ఎక్కువ ట్విస్టులే ఉంటాయి. ఊహించని మలుపులతో జీవితమే ఒక కథగా మారుతుంది. సీనియర్ హీరో కార్తీక్ జీవితం కూడా ఇందుకు అతీతం కాదు. సౌత్‌లో 100కు పైగా సినిమాలు చేసిన ఆయన భార్య చెల్లెలినే పెళ్లి చేసుకున్నాడు. అందుకు గల కారణాలేంటి? తన కెరీర్‌లో చోటు చేసుకున్న ఊహించని పరిణామాలపై ప్రత్యేక కథనం..
తండ్రి నుంచి వారసత్వం..
మురళి కార్తికేయన్ ముత్తురామన్.. 1960 సెప్టెంబర్ 13న జన్మించాడు. తండ్రి ఆర్ ముత్తురామన్ గొప్ప నటుడు, మచ్చలేని మనిషి. ఆయన నుంచే నటనను పుణికి పుచ్చుకున్నాడు కార్తీక్. అలైగళ్ ఒవతిల్లై(1981) అనే తమిళ చిత్రంతో కార్తీక్ నట ప్రస్థానం మొదలైంది. తన లుక్స్, నటన చూసి డైరెక్టర్స్ తమతో సినిమాలు చేయమని వెంటపడ్డారు. తక్కువకాలంలోనే కోలీవుడ్‌లో స్టార్ హీరోగా మారాడు. సీతాకోక చిలుక సినిమాతో టాలీవుడ్‌లోనూ అడుగుపెట్టాడు.
కోలీవుడ్‌లో స్టార్ హీరోగా బిజీబిజీ
అన్వేషణ, అభినందన, గోపాలరావు గారి అబ్బాయి, ఓమ్ 3D సినిమాలతో తెలుగువారికీ దగ్గరయ్యాడు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరో కార్తీక్/మురళిగా బాగా ఫేమస్ అయ్యాడు. అభినందన సినిమాకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నాడు. తమిళంలో ఏడాదికి 8-10 సినిమాలు చేస్తూ బిజీగా ఉండటంతో తెలుగులో ఎక్కువగా చిత్రాలు చేయలేకపోయాడు కార్తీక్. అప్పుడప్పుడూ తన గాత్రానికి పని చెప్తూ పాటలు సైతం ఆలపించాడు. స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న కార్తీక్ ఎప్పుడూ ఏదో ఒక హీరోయిన్‌తో ఎఫైర్ నడుపుతున్నట్లు వార్తలు వచ్చేవి.
హీరోయిన్‌తో ప్రేమ.. పెళ్లి
ఈ క్రమంలో హీరోయిన్ రాగిణిని ప్రేమించిన అతడు 1988లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి గౌతమ్ కార్తీక్, జ్ఞాన్ కార్తీక్ అని ఇద్దరు పిల్లలు సంతానం. అయితే రాగిణి సోదరి రతిపైనా మనసు పారేసుకున్నాడు కార్తీక్. ఆమె కూడా అక్కతో పాటు అతడి ఇంట్లోనే ఉండటంతో.. తనతో ఎఫైర్ పెట్టుకున్నాడని.. దీంతో ఆమె గర్భం దాల్చిందని అప్పట్లో రూమర్స్ వినిపించాయి. ఇంతలో 1992లో రాగిణి సోదరి రతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి తిరన్ కార్తీక్ అనే కుమారుడు జన్మించాడు. అయితే భార్య ఉండగా ఆమె చెల్లెలిని పెళ్లి చేసుకున్నందుకు నటుడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 2000వ దశకం నుంచి కార్తీక్ సినిమాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. హీరో కాస్తా విలన్‌గా మారాడు. తనకున్న చెడు వ్యసనాల వల్లే కెరీర్ నాశనమైందని స్వయంగా అతడే గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
రాజకీయ ప్రస్థానం..
2006లో రాజకీయాల్లోనూ అడుగుపెట్టాడు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరిన అతడు తర్వాతి కాలంలో సొంతంగా పార్టీ స్థాపించాడు. అఖిల ఇండియా నాదలమ్ మక్కల్ కచ్చి అని దీనికి పేరు పెట్టాడు. తన పార్టీ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అతడు దారుణంగా ఓడిపోయాడు. కార్తీక్‌కు కేవలం 15వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో అతడు 2018లో మనిత ఉరిమైగల్ కాక్కమ్ కచ్చి అనే మరో పార్టీని స్థాపించాడు. అయితే ఏఐఏడీఎమ్‌కే కూటమికి తన మద్దతును ప్రకటించాడు. తను చేసిన తప్పిదాల వల్లే కార్తీక్ కెరీర్ అతలాకుతలమైందని తమిళ ప్రజలు ఇప్పటికీ చెప్పుంటూ ఉంటారు.
చదవండి: గుండెపోటుతో నటి మృతి అంటూ ట్వీట్.. వెంటనే డిలీట్.. కానీ అప్పటికే..
'అమ్మాయితో చాటింగ్ చేయడం వల్లే అంతా'.. నెట్టింట వైరల్!
Comments
Please login to add a commentAdd a comment