తమిళసినిమా: సీనియర్ నటుడు కార్తీక్ తీ ఇవన్ చిత్రం కోసం ఫైట్ చేశారు. ఈయన చాలా కాలం తరువాత కథానాయకుడిగా రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. మనిదన్ సినీ ఆర్ట్స్ పతాకంపై నిర్మలాదేవి జయమురుగన్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి టి.ఎం.జయమురుగన్ కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు రోజా మలరే, అడడా ఎన్న అళగు, సింధుబాద్ చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించారన్నది గమనార్హం.
నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పిన నటుడు కార్తీక్ పేర్కొంటూ దర్శకుడు కథ చెప్పినప్పుడే అందులోని సత్తా తనకు అర్థం అయ్యిందన్నారు. తమిళ సంప్రదాయాన్ని, మన జీవన విధానాన్ని అందంగా తెరపై చూపించారన్నారు. చిత్రాన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారన్నారు. పాటల రూపకల్పన, చిత్రీకరణ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ఈ చిత్రం కోసం తాను నాలుగు పోరాట దృశ్యాల్లో నటించానని చెప్పారు. చాలా గ్యాప్ తరువాత నటించిన ఈ చిత్రం తన కెరీర్‌లో మంచి చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని కార్తీక్ పేర్కొన్నారు.
చదవండి: Andrew Garfield: బ్రేకప్ చెప్పుకున్న ప్రేమజంట, కారణమే విడ్డూరంగా ఉంది!
Comments
Please login to add a commentAdd a comment