సీనియర్ నటుడు శరత్‌బాబు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే! ఈ క్రమంలో ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలో వదంతులు మొదలయ్యాయి. ఇదే నిజమని నమ్మిన కొందరు సెలబ్రిటీలు సైతం ఆయనకు నివాళులు అర్పిస్తూ ట్వీట్లు చేశారు. అంతలోనే అదంతా ఫేక్ అని తెలియడంతో నాలుక్కరుచుకుని ట్వీట్లు డిలీట్ చేశారు. ఈ సోషల్ మీడియా వల్ల ఆయన్ను బతికుండగానే చంపేస్తున్నారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా శరత్‌బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడి కుమారుడు ఆయుష్ తేజస్ స్పందించాడు. శరత్‌బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, మునుపటి కంటే ఇప్పుడు కొంచెం కోలుకున్నారని తెలిపాడు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని డాక్టర్లు చెప్పినట్లు పేర్కొన్నాడు. దయచేసి ఆయన ఆరోగ్యం గురించి వచ్చే వదంతులను నమ్మవద్దని కోరాడు. శరత్‌బాబు సోదరి సైతం త్వరలోనే ఆయన కోలుకుని మీడియాతో మాట్లాడతారని ఆశాభావం వ్యక్తం చేసింది.
కాగా 1973లో విడుదలైన రామరాజ్యం సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టారు శరత్ బాబు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 200కి పైగా చిత్రాల్లో నటించారు. హీరోగానే కాకుండా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రల్లో మెప్పించారు.
చదవండి: టార్చర్.. రోజూ కొట్టేవాడు.. విడాకుల ఫోటోషూట్ వెనక నటి దీనగాధ
Comments
Please login to add a commentAdd a comment