
పోలీస్ అవ్వాలనుకుని సినీ యాక్టర్ అయ్యారు శరత్ బాబు. మనము ఒకటి తలిస్తే, దేవుడు మరొకటి తలుస్తారు. శరత్ బాబుకు యాక్టర్ కావాలి అని రాసి పెట్టి ఉంది. అందుకే.. ముఖానికి రంగేసుకొని వెండితెర మీద మెరిసిపోయారు. బిగ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఎన్టీఆర్, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి దిగ్గజాలతో కలిసి నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్ని కలుపుకుని దాదాపు 220కి పైగా చిత్రాలు చేశారు. భాషతో సంబంధం లేకుండా అన్నిచోట్లా ప్రేక్షకుల్ని సంపాదించుకున్నారు శరత్ బాబు.
అండగా ఉన్న రమాప్రభ
కానీ ఆయన వైవాహిక జీవితం మాత్రం అంత సజావుగా సాగలేదు. తను ఇండస్ట్రీలో నిలదొక్కుకునేనాటికే స్టార్ కమెడియన్‌గా రాణిస్తోంది రమాప్రభ. అప్పట్లో ఇండస్ట్రీలోకి వచ్చేవారికి అండగా ఉండేది రమా ప్రభ. ఈ క్రమంలో శరత్ బాబు తను నిలదొక్కుకోవడానికి పాట్లు పడుతున్న సమయంలో ఆయనకు సపోర్ట్‌గా నిలబడింది. తనకంటే వయసులో నాలుగైదేళ్లు పెద్దదైన రమప్రభతో ప్రేమలో పడ్డారు శరత్ బాబు. ఈ ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లారు. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. 14 ఏళ్లు కలిసి ఉన్న ఈ దంపతులు విడాకులు తీసుకుని చెరో దారి చూసుకున్నారు.
దాని విలువ రూ.60 కోట్లు
అయితే విడాకుల తర్వాత రమాప్రభ శరత్‌బాబుపై అనేక ఆరోపణలు చేశారు. తన ఆస్తి మొత్తం లాక్కున్నారని, తనను మోసం చేసి నడిరోడ్డుపై వదిలేశారని ఆరోపించారు. అయితే ఆమె ఆరోపణలపై చాలావరకు సహనంగా ఉన్న శరత్‌బాబు ఓ ఇంటర్వ్యూలో మాత్రం నోరు విప్పారు. ఆమె పేరు వాడకుండానే తన ఆరోపణలను తిప్పికొట్టారు. 'రమాప్రభకు ఆస్తులు లేవు. తన పేరిట ఉన్న ఒకే ఒక ఆస్తిని అమ్మి ఆ డబ్బుతో రమా ప్రభ పేరు మీద, ఆమె తమ్ముడి పేరు మీద ఫ్లాట్లు కొనిచ్చాను. పొలం అమ్మి ఆ డబ్బుతో ఉమాపతి స్ట్రీట్‌లో ఒక ఇల్లు కొనిచ్చాను. అమ్మిన భూమి విలువ ఇప్పుడు రూ.60 కోట్లు. ఇక ఆ ఇల్లు విలువ ఇంకెన్ని కోట్లు ఉంటుందో!
మాదసలు పెళ్లే కాదు..
రమా ప్రభతో నేను క్లోజ్ అయ్యే సమయానికి నా వయసు 22 ఏళ్లు. రమాప్రభ నాకంటే ఐదేళ్లు పెద్ద. ఫ్రెష్‌గా కాలేజీ నుంచి అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చాను. ప్రపంచం గురించి తెలియని వయసులో ఆమెతో పరిచయం ఏర్పడింది. తెలియని వయసులో పొరపాటు చేశా. అది నా దృష్టిలో పెళ్లి కూడా కాదు. ఒక కలయిక అంతే!' అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు శరత్ బాబు.
Comments
Please login to add a commentAdd a comment