Ramaprabha
-
జాలేస్తోంది, నవ్వు వస్తోంది, ఒక్కోసారి బాధగానూ..: రమా ప్రభ
దివంగత నటుడు శరత్ బాబు మాజీ భార్య రమాప్రభ తనపై వస్తున్న కొన్ని వార్తలపై మండిపడింది. అదే సమయంలో శరత్ బాబు మరణ వార్తపై పరోక్షంగా విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు రమాప్రభ ప్రయాణం అనే సొంత యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియోను వదిలింది. 'ఈ మూడు నెలల్లో చిన్న టూర్లు వేశాను. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, షిరిడీ వెళ్లొచ్చాను. ఈ మూడు నెలల్లో ఎన్నో మార్పులు జరిగాయి. కొన్ని సంఘటనలు జరిగాయి. ఒక్కోసారి జాలేస్తుంది.. ఒక్కోసారి నవ్వు వస్తుంది.. ఒక్కోసారి బాధగా ఉంటుంది.. ఈ మధ్య ఏదో ఒకరకంగా పాపులర్ అవుతున్నా. ఒకటీ రెండు సంఘటనలు నా గురించే ఉన్నాయి. కాబట్టి మాట్లాడాలి. చెన్నైలో నాకు ఒక ఇల్లు ఉంది. నా ఇంట్లో చాలామంది ఉన్నారు. అక్కడుంది రమాప్రభ హీరో అని ఎవరూ చెప్పడం లేదు. అందరూ అక్కడే ఉన్నారు కానీ అది నా ఇల్లు అని కాకుండా వేరేవాళ్ల ఇల్లు అని చెప్తున్నారు. నాకు నవ్వొచ్చింది. నాకు రజనీకాంత్ డబ్బులిచ్చారని ప్రచారం జరుగుతోంది. అది నిజం కాదు. నేను 13 ఏళ్ల నుంచే సంపాదిస్తున్నాను. ఇప్పుడు నా గురించి నోటికొచ్చింది మాట్లాడుతూ మిగతావారు సంపాదిస్తున్నారు' అని చెప్పుకొచ్చింది రమాప్రభ. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. 'శరత్‌బాబు గురించి ఫీల్ అవుతున్నారా అమ్మ? 13 ఏళ్లు కలిసున్నారు కాబట్టి ఆ బాధ తప్పకుండా ఉంటుంది', 'శరత్‌బాబును హీరోగా నిలబెట్టడం కోసం వింత ఇల్లు సంతగోల అనే సినిమా తీసి మీరు ఎంత నష్టపోయారో నాకు తెలుసు. ఈ రోజు ఆయన కీర్తి మీ చెమట, మీ రక్తం.. వాటి పునాది మీదే ఆయన ఆనాడు నిలబడ్డారు' అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: హీరోయిన్‌తో లవ్.. ముద్దు ఫోటో షేర్ చేసిన అజిత్ బావమరిది -
శరత్‌బాబు-రమాప్రభ లవ్‌స్టోరీ వెనుక ఇంత కథ నడిచిందా?
విలక్షణ నటుడు శరత్‌బాబు మరణంతో టాలీవుడ్ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. రామరాజ్యం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన శరత్‌బాబు తెలుగు, తమిళం సహా వివిధ భాషల్లో సుమారు 200కి పైగా సినిమాల్లో నటించారు. నటుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటిన ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సీనియర్ నటి రమాప్రభతో ఆయన ప్రేమాయణం అప్పట్లో ఇండస్ట్రీలో ఓ సంచలనం. శరత్ బాబు కంటే రమాప్రభ ఇండస్ట్రీలో సీనియర్ నటి. అప్పటికే ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు దశాబ్దం తర్వాత శరత్ బాబు సినీ నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఇద్దరికి తెలిసిన ఓ స్నేహితుడి ద్వారా వీళ్లు ఒకరికొకరు పరిచయమయ్యారు. కొన్ని సినిమాల్లో కలిసి నటించారు కూడా. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. అప్పటికే నటిగా, స్టార్ కమెడియన్‌గా రమాప్రభకు ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలతో శరత్‌బాబును సినిమాల్లో రికమండ్ చేసి వేషాలు ఇప్పించారని వార్తలు వచ్చేవి. ఆ సమయంలో వీరి సాన్నిహిత్యంపై కథలు కథలుగా పుకార్లు షికార్లు చేశాయి. చివరికి వాటినే నిజం చేస్తూ వయసులో తనకంటే నాలుగేళ్ల పెద్దదైన రమప్రభను శరత్‌బాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు 14 ఏళ్ల పాటు వీరి సంసారం సజావుగానే సాగింది. అప్పట్లో శరత్ బాబు తాను మరచిపోలేని రోజులు మూడే అని అందులో ఒకటి తన పుట్టినరోజు కాగా, రెండు రెండు తన భార్య రమ పుట్టినరోజు, మూడు తమ పెళ్ళి రోజూ అంటూ ఓ సినిమా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అంతలా అన్యోన్యంగా కలిసున్న వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం ప్రముఖ తమిళ నటుడు నంబియార్ కూతురు స్నేహలతను పెళ్లాడగా ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. ఆమెకు సైతం విడాకులిచ్చేశారు. -
రమాప్రభతో జరిగింది పెళ్లే కాదన్న శరత్‌బాబు!
పోలీస్ అవ్వాలనుకుని సినీ యాక్టర్ అయ్యారు శరత్ బాబు. మనము ఒకటి తలిస్తే, దేవుడు మరొకటి తలుస్తారు. శరత్ బాబుకు యాక్టర్ కావాలి అని రాసి పెట్టి ఉంది. అందుకే.. ముఖానికి రంగేసుకొని వెండితెర మీద మెరిసిపోయారు. బిగ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఎన్టీఆర్, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి దిగ్గజాలతో కలిసి నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్ని కలుపుకుని దాదాపు 220కి పైగా చిత్రాలు చేశారు. భాషతో సంబంధం లేకుండా అన్నిచోట్లా ప్రేక్షకుల్ని సంపాదించుకున్నారు శరత్ బాబు. అండగా ఉన్న రమాప్రభ కానీ ఆయన వైవాహిక జీవితం మాత్రం అంత సజావుగా సాగలేదు. తను ఇండస్ట్రీలో నిలదొక్కుకునేనాటికే స్టార్ కమెడియన్‌గా రాణిస్తోంది రమాప్రభ. అప్పట్లో ఇండస్ట్రీలోకి వచ్చేవారికి అండగా ఉండేది రమా ప్రభ. ఈ క్రమంలో శరత్ బాబు తను నిలదొక్కుకోవడానికి పాట్లు పడుతున్న సమయంలో ఆయనకు సపోర్ట్‌గా నిలబడింది. తనకంటే వయసులో నాలుగైదేళ్లు పెద్దదైన రమప్రభతో ప్రేమలో పడ్డారు శరత్ బాబు. ఈ ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లారు. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. 14 ఏళ్లు కలిసి ఉన్న ఈ దంపతులు విడాకులు తీసుకుని చెరో దారి చూసుకున్నారు. దాని విలువ రూ.60 కోట్లు అయితే విడాకుల తర్వాత రమాప్రభ శరత్‌బాబుపై అనేక ఆరోపణలు చేశారు. తన ఆస్తి మొత్తం లాక్కున్నారని, తనను మోసం చేసి నడిరోడ్డుపై వదిలేశారని ఆరోపించారు. అయితే ఆమె ఆరోపణలపై చాలావరకు సహనంగా ఉన్న శరత్‌బాబు ఓ ఇంటర్వ్యూలో మాత్రం నోరు విప్పారు. ఆమె పేరు వాడకుండానే తన ఆరోపణలను తిప్పికొట్టారు. 'రమాప్రభకు ఆస్తులు లేవు. తన పేరిట ఉన్న ఒకే ఒక ఆస్తిని అమ్మి ఆ డబ్బుతో రమా ప్రభ పేరు మీద, ఆమె తమ్ముడి పేరు మీద ఫ్లాట్లు కొనిచ్చాను. పొలం అమ్మి ఆ డబ్బుతో ఉమాపతి స్ట్రీట్‌లో ఒక ఇల్లు కొనిచ్చాను. అమ్మిన భూమి విలువ ఇప్పుడు రూ.60 కోట్లు. ఇక ఆ ఇల్లు విలువ ఇంకెన్ని కోట్లు ఉంటుందో! మాదసలు పెళ్లే కాదు.. రమా ప్రభతో నేను క్లోజ్ అయ్యే సమయానికి నా వయసు 22 ఏళ్లు. రమాప్రభ నాకంటే ఐదేళ్లు పెద్ద. ఫ్రెష్‌గా కాలేజీ నుంచి అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చాను. ప్రపంచం గురించి తెలియని వయసులో ఆమెతో పరిచయం ఏర్పడింది. తెలియని వయసులో పొరపాటు చేశా. అది నా దృష్టిలో పెళ్లి కూడా కాదు. ఒక కలయిక అంతే!' అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు శరత్ బాబు. చదవండి: శరత్ బాబుకు కలిసిరాని పెళ్లిళ్లు -
ఆర్థిక కష్టాలతో అతి దారుణంగా సీనియర్ నటి పరిస్థితి?
దాదాపు పద్నాలుగు వందాలకు పైగా సినిమాల్లో నటించింది సీనియర్ నటి రమాప్రభ. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా లేడీ కమెడియన్‌గానూ అలరించింది. వయోభారంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ఆర్థిక కష్టాలతో అడుక్కు తినే పరిస్థితికి వచ్చిందంటూ కొందరు వార్తలు రాసేశారు. తాజాగా దీనిపై రమాప్రభ స్పందించింది. 'యూట్యూబ్‌లో నేను అడుక్కు తిన్నానని రాస్తున్నారు. నా సొంత యూట్యూబ్ ఛానల్ రమాప్రభ ప్రయాణంలో నా ఇంటిని కూడా చూపించాను. నేను అడుక్కు తింటే అది నా ఇల్లు ఎలా అవుతుంది? నేను బిజీగా పని చేస్తున్నా.. అలాంటిది ఏ గ్యాప్‌లో అడుక్కున్నాను? పూరీ, నాగార్జున.. ఇలా కొందరు సెలబ్రిటీలు నామీద ఆప్యాయతతో నన్ను ఆదుకుంటున్నారు. వాళ్లు నన్ను ఇంటి మనిషిగా ఫీలైనప్పుడు అది సహాయమో, అడుక్కోవడమో ఎందుకవుతుంది? వాళ్లు నాకు భిక్ష వేయడం లేదు.. ప్రేమతో ఇస్తున్నారు. అందరికంటే నేను రిచ్‌గా ఉన్నాను' అని చెప్పుకొచ్చింది రమాప్రభ. చదవండి: అలాగైతే కె.విశ్వనాథ్ సగం హైదరాబాద్ కొనేసేవారు అర్ధరాత్రి లేచి మా గురించి ఆరా తీసేవారు: విశ్వనాథ్ పర్సనల్ బాయ్ -
అయ్యప్ప కటాక్షంతో...
సుమన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘వీరశాస్త అయ్యప్ప కటాక్షం’. ఎ. జ్యోతి, రమాప్రభ, ఆకెళ్ల, చలపతి, మాస్టర్ హరీంద్ర, అశోక్ కుమార్ ముఖ్యపాత్రధారులు. రుద్రాభట్ల వేణుగోపాల్ దర్శకత్వం వహించారు. నటుడు సుమన్ కెరీర్లో ఇది నూరవ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాకు కథ,స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు అందించిన వి.యస్.పి. తెన్నేటి, టి.ఎస్. బద్రీష్ రామ్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘ఒక సినిమా పూర్తి కావాలంటే అద్భుతాలు జరగాలంటుంటారు. అలాంటివి ఈ సినిమాకు జరిగాయి. అయ్యప్పకటాక్షం వల్లే ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేస్తున్నామనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ఇరవై ఏళ్లకు పైగా అయ్యప్ప దీక్ష చేస్తున్నాను. అయ్యప్ప దీక్ష ఎలా చేయాలి? అయ్యప్ప దీక్ష చేసేవారు నలుపు రంగు దుస్తులే ఎందుకు వేసుకోవాలి? కాషాయ రంగు వస్త్రాలు ధరించి కూడా దీక్ష చేయవచ్చా? ఎలా క్రమశిక్షణగా ఉండాలి? అనే ఇలాంటి చాలా అంశాలకు ఈ సినిమాలో వివరణలు ఇచ్చాం’’ అన్నారు వి.యస్. పి. తెన్నేటి. -
పూరీతో జన్మజన్మల బంధం..
రెడీ, స్టార్ట్.. కెమెరా, యాక్షన్.. అంటూ క్షణం తీరిక లేకుండా 1500 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేశారు. రంగుల ప్రపంచంలో వెండితెరపై ఒక వెలుగు వెలిగారు. చిత్రసీమలో దాదాపు మూడు తరాల హీరోల సినిమాలలో నటించారు. ప్రస్తుతం ఆ రంగుల ప్రపంచానికి దాదాపుగా దూరమయ్యారు. ఇప్పుడు ఆధ్మాత్మికం వైపు తన పయనాన్ని ప్రారంభించారు. మరో జన్మంటూ ఉంటే.. రమాప్రభగానే పుట్టాలని ఉందని, ఈ మదనపల్లె ముద్దుబిడ్డ సాక్షితో తన అభిప్రాయాలను పంచుకున్నారు. మదనపల్లె సిటీ : వెండితెర సహాయ నటిగా.. దశాబ్దాల పాటు.. తన అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన సీనియర్ నటి రమాప్రభ ప్రస్తుతం సాయిసేవలో తరిస్తున్నట్లు తెలిపారు. గతంలో హైదరాబాదు జూబ్లిహిల్స్‌లో ఉన్న ఆమె గత ఏడాది నుంచి స్వస్థలమైన మదనపల్లెలోనే ఉంటున్నట్లు చెప్పారు. తన సినీరంగ అనుభవాలు ఆమె మాటల్లోనే.. వెండితెరతో ఆరు దశాబ్దాల అనుబంధం.. జిల్లాలోని వాల్మీకిపురం మాఊరు. నాన్న గంగిశెట్టి. సాధారణ కుటుంబం. మా అమ్మ,నాన్నకు మేం 13 మంది సంతానం. 1947 మే 5న నేను జన్మించాను. ఊటీలో ఉంటున్న మా మేనమామ కృష్ణరావు ముఖర్జీకి పిల్లలు లేనందున నన్ను దత్తత తీసుకున్నారు. ఊటిలోనే నా బాల్యం గడిచింది. అనంతరం ఆయన తన నివాసాన్ని చెన్నైకి మార్చుకున్నారు. నేను కూడా ఆయనతో పాటే చెన్నై వెళ్లాను. ఓ సందర్భంలో దర్శకులు ప్రత్యగాత్మ నన్ను, నా టాలెంట్‌ను చూసి సినిమాలో అవకాశం ఇచ్చారు. దీంతో 1963లో చిలకాగోరింక సినిమాలో నాకు మొదటి అవకాశాన్ని కల్పించారు. అలా ప్రారంభమైన నా సినీప్రస్థానం 55 సంవత్సరాల పాటు ఏకధాటిగా కొనసాగింది. దాదాపు 1500 సినిమాల్లో వివిధ క్యారెక్టర్లలో నటించాను. సినీరంగంలో వెండితెరపై, వెనుక అనేక ఎత్తుపల్లాలు చూశాను. దాదాపు మూడు తరాల హీరో, హీరోయిన్లతో నటించాను. తరువాత సినీరంగంలో కొద్దిరోజుల పాటు విరామం తీసుకోవాల్సి వచ్చింది. తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైంది. మాఅన్నయ్య, ప్రేమంటే ఇదేరా, ప్రేమించుకుందాం. రణం, పండుగ తదితర సినిమాల్లో బామ్మ పాత్రలు పోషించాను. అప్పటి పరిస్థితుల బట్టి జూబ్లీహిల్స్‌లో ప్లాటు కొన్నా. హైదరాబాదు మన ఊరు కాదు కదా.. షూటింగ్‌కు వెళ్లిన ఊరు. ఎందుకో రావాలనిపించి స్వస్థలం మదనపల్లెకు వచ్చేశా. నాపేరుతో అంటూ ఏమీ లేవు. నాకు ఎక్కడ ప్లాట్లు లేవు. ఇప్పుడు నా మçనసు ఆ«ధ్యాత్మికం వైపు మరలింది. దీంతో రంగుల ప్రపంచాన్ని వదిలేసి సొంత జిల్లాకు వచ్చేశాను. మదనపల్లె రూరల్ మండలం గంగన్నగారిపల్లెలో మాపెద్ద తమ్ముడి ఇంటిలో ఉంటున్నాను. మదనపల్లె పట్టణంలోచిన్న తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. పూరీతో జన్మజన్మల బంధం సినీరంగం నుంచి దాదాపు పూర్తిగా సంబంధాలు వదిలేశాక ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాంటి సమయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ నన్ను ఆదుకున్నారు. పూరిబాబుతో నాకు జన్మజన్మల బంధం. ప్రస్తుతం నాకు చివరి స్టేజి, సినిమాలు లేవు. ఎక్కడో మదనపల్లెలో ఉన్నా. అయినప్పటికీ నాకు డబ్బులు పంపించాలన్న తపన ఆయనలో ఉంది. గోపీచంద్ నటించే ఆరు అడుగుల బుల్లెట్ సినిమా షూటింగ్లో అనుకోకుండా పూరిబాబును కలసిననప్పుడు నా సెల్ నంబర్ , పుట్టిన తేదీ అడిగారు. అప్పటి నుంచి ప్రతి నెలా 5వ తేదీలోపు నెలకు రూ.20 వేలు పంపుతున్నారు. జయలలిత మంచి స్నేహితురాలు.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నాకు మంచి స్నేహితురాలు. షూటింగ్లో ఇద్దరు కలిసి మెలసి ఉండేవాళ్లం. నేను అప్పట్లో నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. జయలలిత ఎప్పుడూ నా గురించి అందరినీ అడిగేవారు. బయటకు వెళ్లాలంటే ఫోన్లో ‘ఎన్నా.. వరిలియా’ (ఏం రాలేదా..) అని అడిగేవారు. సీఎం అయ్యాక ఫోన్ చేస్తే మరో మహిళ (శశికళ) ఫోన్ ఎత్తి ఎవరు..? అనేవారు. నాకు కొంచెం అలగుడు ఎక్కవ. అది అహంకారమో ఈగోనో.. తెలియదు. ఈ కారణంగానే మా ఇద్దరి మధ్యదూరం పెరిగింది. ఏఎన్ఆర్ మరణం జీర్ణించుకోలేను.. నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు మృతి ఇప్పటికీ జీర్ణించుకోలేను. ఆయన మృతి చెంది న విషయాన్ని.. వాణిశ్రీ ఫోన్ చేసి చెప్పారు. నేను అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లాను. కొందరు నన్ను రావద్దని అవమానించారు. నా మనసును అకారణంగా గాయపరిచారు. ఎస్వీ రంగారావు మా డాడీ.. ఎస్వీ రంగారావును నేను డాడీ అని అనేదాన్ని. రాజబాబు నేనూ కలిసి దాదాపు 300 సినిమాల్లో నటించాం. ఒకానొక దశలో మేమిద్దం కలిసి నటించిన సినిమాలు వరుసగా ఉండేవి. రాజబాబును రేయ్.. అని అప్యాయంగా పిలిచేదాన్ని. రాజబాబు మృతితో నేను బాగా దిగలుపడ్డాను. సూర్యకాంతం అంటే గౌరవం, చాలా మంచి ఆవిడ. మహానటితో మంచి సంబంధాలు.. సావిత్రమ్మతో నాకు మంచి సంబంధాలు ఉన్నా యి. షూటింగ్ విరామంలో డ్రైవర్లు, పనివాళ్ల ఇళ్లకు వెళ్లేవాళ్లం. మహానటి సినిమా చూడలేదు. చాలా మంది ఫోన్ చేశారు. ఆ సినిమాలో.. మ్యూజిక్, పాటలు ఏంటండి..? మహానటి అన్న పేరు పెట్టిన తరువాత ఆమెతో అనుబంధం ఉన్నవారిని సంప్రదించకుండా సినిమా తీశారు. మాహానటి సినిమా కేవలం బిజినెస్. ఇక సావిత్రమ్మ మహామొండి. చాలా దగ్గరగా ప్రేమించే వాళ్లును కూడా పో.. అనేది. అందుకే చాలా మంది ఆమెకు దూరమయ్యా రు. పేద సినీ కళాకారులను ఆదుకునేందుకు అప్పటి ప్రముఖ హిందీ నటుడు ప్రాణ్ న్యూజెర్సీలో గంధంమాలను వేలం వేశారు. దాన్ని కొనుగోలు చేసేందుకు సావిత్రమ్మ మైలాపూర్‌లో ఓ ఇళ్లును రాసిచ్చేశారు. ఇది ఆమె దాతృత్వానికి నిదర్శనం. కృష్ణ నిజజీవితంలోనూ సూపర్‌స్టారే.. సూపర్ స్టార్ కృష్ణ వెండి తెరపైనే కాదు నిజజీవితంలోనూ సూపర్‌స్టారే. ఆయన వ్యక్తిత్వం ఉన్నతమైంది. ఆ రోజుల్లో రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు చాలా పెద్ద మనసుతో స్పందించే వారు. తన వంతు సహాయాన్ని బాధితులకు ప్రభుత్వం ద్వారా అందించేవారు. ఇంతమంది గొప్పవారితో పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం. మనో జన్మంటూ ఉంటే.. రమాప్రభగానే పట్టాలని, ప్రేక్షకులను అలరించాలని ఉంది. సాయిబాబా ఇష్టం.. నాకు షిరిడీ సాయిబాబా అంటే చాలా ఇష్టం. ఆయన భక్తురాలిని. ఇంటి ఆవరణలోనే బాబా విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నా. రోజూ ప్రత్యేక పూజలు చేయడం అలవాటుగా మార్చుకున్నా. అందులోనే నాకు మనశ్శాంతి లభిస్తోంది. ఇంటిలో మాపెద్ద తమ్ముడు, పి ల్లలు అందరూ ఉంటారు. నేను వారితోకలిసినా నాకంటూ ఓ ప్రత్యేకమైన పెంట్ హౌస్ నిర్మించుకుని ఒంటరిగానే ఉంటున్నా ను. ఇందులోనే నాకు మానసిక ప్రశాంతత. సమయం ఉన్నప్పుడు కుట్లు, అల్లికలు చేస్తా. పెయింగ్ అంటే ఇష్టం. ఎక్కిరాల భరద్వాజ నా ఆధ్యాత్మిక గురువు. ఆయన చూపిన మార్గంలోనే నడుస్తున్నా. నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు షిర్డీకి వెళ్తాను. -
మే 5న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు: నటి రమాప్రభ, లక్ష్మీరాయ్ ఈ సంవత్సరం విద్యా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. సాంకేతిక విద్య, మెడికల్ సర్జరీ విద్యార్థులకు ఇది అనుకూల సమయం. విదేశాలలో చదువుకోవాలనుకునేవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్నేళ్లుగా ఆశాజనకంగా లేని పనులు ఈ ఏడాది ఒక కొలిక్కి వచ్చి సంతృప్తి కలుగుతుంది. అయితే, దూకుడుగా ప్రవర్తించడం తగ్గిస్తే శ్రేయస్కరం. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనుకూలమైన రంగులు ఆకుపచ్చ, నారింజ, ఎరుపు. అనుకూలమైన సంఖ్యలు: 5, 6, 9 వీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, రక్తదానం చేయడం మంచిది. - రహిమాన్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్