NTR30: Manichandana as Janhvi Kapoor's Mother - Sakshi
Sakshi News home page

NTR30: జాన్వీ కపూర్‌ తల్లిగా సీనియర్‌ నటి మణిచందన

Published Thu, May 4 2023 6:17 PM | Last Updated on Thu, May 4 2023 8:37 PM

NTR30: Manichandana As Janhvi Kapoor Mother - Sakshi

మణి చందన తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితురాలు. తొలి ప్రేమ, పిల్ల నచ్చింది, నిజం, పెళ్లాం వచ్చింది, దేవి నాగమ్మ, ఆచారి అమెరికా యాత్ర, నాంది చిత్రాలతో బోలెడంతమంది అభిమానులను సంపాదించుకున్న ఆమె ఎన్టీఆర్‌ 30వ సినిమాలో నటిస్తోంది.  ఈ చిత్రంలో హీరోయిన్‌ జాన్వీ కపూర్‌కు తల్లిగా కనిపించనుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై  నిర్మిస్తున్నారు. 

పాన్ ఇండియాగా వస్తున్న ఈ చిత్రానికి అనిరుద్‌ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే రెండు షెడ్యూల్ లు పూర్తి చేసుకుంది. కోస్టల్‌ ఏరియాలో గుర్తింపుకు, ఆదరణకు నోచుకోని, దూరంగా నెట్టివేయబడ్డ ప్రాంతం కథతో రా అండ్‌ రస్టింగ్గా ఈ మూవీ సాగనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

చదవండి: అక్కినేని కుటుంబాన్ని వెంటాడుతున్న ఫ్లాపులు.. చై స్పందనేంటంటే?
టార్చర్‌ పెట్టేవాడు.. విడాకులకు గల కారణాన్ని వెల్లడించిన నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement