
సాక్షి, సినిమా : హర్వే వెయిన్‌స్టన్ ఉదంతం యావత్ చిత్ర పరిశ్రమనే దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం విదితమే. మూవీ మొఘల్ వేధింపుల పర్వం గురించి ఒక్కోక్కరుగా మీడియా ముందుకు రావటం.. అది కాస్త మీ టూ ఉద్యమంగా మారి సోషల్ మీడియాలో వైరల్ కావటం చూస్తున్నాం. ఇంతలో మరో నట దిగ్గజంపై ఇప్పుడు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
ది గ్రాడ్యుయేట్, లెన్నీ, టూట్సీ చిత్రాలతో గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటుడు డస్టిన్ హోఫ్‌మన్(80) తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నటి కేథ్రైన్ రోస్టర్ ఆరోపణలు చేస్తున్నారు. హోఫ్‌మన్ సరసన ఆమె డెత్ ఆఫ్ ఏ సేల్స్‌మాన్ చిత్రంలో నటించారు. ఓ హాలీవుడ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో చికాగోలో ఓసారి ఆమె ఇచ్చినప్పుడు హోఫ్‌మన్ తన భార్యతోసహా హాజరయ్యాడు. అక్కడ ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె చెప్పుకొచ్చారు.
అంతకు ముందు మెరైల్ స్ట్రీప్(1979లో), వెండీ రిస్(1991లో), ఈ మధ్యే నటి అన్నా గ్రాహం హంటర్ కూడా హోఫ్‌మన్‌పై ఇలాంటి ఆరోపణలే చేశారు. అయితే ముప్పై ఏళ్ల క్రితం జరిగినవని చెబుతున్న ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని.. వారందరినీ తన కుటుంబ సభ్యులుగా తాను భావించే వాడినని హోఫ్‌మన్ చెబుతున్నారు. వాస్తవాలు విచారణలో వెలుగు చూస్తాయని ఆయన చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment