క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఫైట్ మాస్టర్‌గా, ఫైటర్‌గా, విలన్‌గా అన్ని భాషల్లో కలుపుకుని దాదాపు ఐదు వేలకు పైగా చిత్రాలు చేశాడు విజయ్ రంగరాజు. పుట్టింది పూణెలో అయినా పెరిగింది మాత్రం ముంబైలోనే! జాకీ ష్రాఫ్, రంగరాజు ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత గుంటూరుకు షిఫ్ట్ అయి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఎన్టీరామారావు వీరాభిమానిని అని చెప్పుకునే రంగరాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
'నాకు పోలీస్ కావాలన్నది ఆశ. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఉద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఆ తర్వాత సినిమా రంగంలో ప్రయత్నించాను. అప్పుడు చాలా కష్టాలు పడ్డాను. పది రోజులపాటు కుండలో నీళ్లు తాగి కడుపునింపుకునేవాడిని. తినడానికి తిండి ఉండేది కాదు. మంచినీళ్లతో సరిపెట్టుకునేవాడిని. ఎక్కడైనా పెళ్లి జరుగుతుందంటే వెళ్లి తిని వచ్చేవాడిని. నా మొదటి సినిమా బాపుగారి దర్శకత్వంలో వచ్చిన సీతా కల్యాణం.
ఆ సినిమాలో వేషం కోసం ట్రై చేశాను. 15 రోజులు పని, రోజుకు రూ.150 ఇస్తామన్నారు. సరే అని అడ్వాన్స్ అడిగాను. వాళ్లు షాకైపోయి ఇంతవరకు వేషం వేయలేదు, ఇండస్ట్రీకి కొత్త అంటున్నావు.. నువ్వేంటి అడ్వాన్స్ అడుగుతున్నావని నిలదీశారు. మరి బతకాలి కదా సర్.. అడ్వాన్స్ ఇస్తేనే చేస్తాను, లేదంటే చేయనని చెప్పాను. ఆ తరువాత నా ధైర్యాన్ని మెచ్చి రూ.100 అడ్వాన్స్ ఇచ్చి పంపించారు' అని చెప్పుకొచ్చాడు విజయ్ రంగరాజు.
చదవండి: నాకు మాటిచ్చి, చివర్లో హ్యాండిచ్చాడు.. చాలా బాధేసింది: మనోజ్ బాజ్‌పాయ్
Comments
Please login to add a commentAdd a comment