
ప్రముఖ నటుడు శరత్ బాబు(71) ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో రెండు రోజుల క్రితం ఆయనను హైదరాబాద్‌లో ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శరీరం మొత్తం సెప్సిస్ కావడంతో ఊపిరితిత్తులు, కాలెయం, కిడ్నీలు వంటి ప్రధాన అవయావాలు పాడైపోయినట్లు వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం శరత్‌బాబుకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. మరికొన్ని గంటలు గడిస్తే తప్ప ఆయన పరిస్థితి గురించి పూర్తిగా చెప్పలేమని డాక్టర్స్ వెల్లడించారు. ఈరోజు సాయంత్రం మరోసారి శరత్ బాబు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉందని సన్నిహితుల చెబుతున్నారు.
(చదవండి: జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటికి సీరియస్? ఐసీయూలో చికిత్స!)
కాగా, 1973లో విడుదలైన ‘రామరాజ్యం’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన తమిళ, తెలుగు, కన్నడ పరిశ్రమల్లో 200కి పైగా సినిమాలలో నటించారు. హీరోగానే కాకుండా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు పాత్రలతో అలరించారు.