
సోషల్ మీడియా హవా పెరిగిన తర్వాత సెలబ్రిటీలపై వస్తోన్న వార్తల్లో ఏది నిజమో, ఏది అబద్దమో తెలియకుండా పోతుంది. బతికున్నవాళ్లనే చనిపోయారంటూ కొందరు ప్రచారం చేసేస్తున్నారు. ఇలా జరిగడం ఇదేమీ మొదటిసారి కాదు. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి కవితపై కూడా ఇలాంటి పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత రెండు, మూడు రోజులుగా నటి కవిత చనిపోయారంటూ నెట్టింట ఫేక్ న్యూస్‌లు సర్క్యులేట్ అవుతున్న సంగతి తెలిసిందే.
దీంతో స్వయంగా కవిత తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఇలాంటి ఫేక్ న్యూస్‌లు నమ్మొద్దని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 'నేను చనిపోయానంటూ యూట్యూబ్‌లో కొందరు వీడియోలు పెడుతున్నారు. అవి చూసి నా స్నేహితులు, బంధువులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వెంటనే ఆ వీడియోలు డిలీట్ చేయకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుంది' అంటూ కవిత యూట్యూబ్ ఛానెళ్లకి వార్నింగ్ ఇచ్చారు. కాగా బాలనటిగా వెండితెరకు పరిచయమైన కవిత 350కి పైగా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment