టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు పొట్టి వీరయ్య(74) తనువు చాలించాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఆదివారం గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో వీరయ్య తుదిశ్వాస విడిచాడని వైద్యులు వెల్లడించారు.
వీరయ్యది నల్గొండ జిల్లా, తిరుమలగిరి తాలూకా ఫణిగిరి గ్రామం. హైస్కూల్‌లో ఉన్నప్పుడే నాటకాల్లో పాత్రలు వేస్తూ అందరినీ నవ్వించేవాడు. సినిమాల్లోకి రావడానికి ముందు ఫ్లవర్ డెకరేషన్ షాపులో పని చేశాడు. ఒకసారి శోభన్‌బాబు కనిపిస్తే సినిమా అవకాశం కావాలని అర్థించాడు.ఆయన వెంటనే విఠలాచార్య, భావనారాయణ తప్ప ఎవరూ ఉపాధి కల్పించలేరని, వెంటనే వాళ్లకు కనిపించమని గోల్డెన్ సలహా ఇచ్చాడు.
దీంతో జానపద దర్శకుడు విఠలాచార్య, నిర్మాత రామస్వామిగార్లను కలిశాడు. అలా కాంతారావు, భారతి హీరోహీరోయిన్లుగా నటించిన 'అగ్గిదొర' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. తాతామనవడు, రాధమ్మ పెళ్లి, యుగంధర్, గజదొంగ, గోల నాగమ్మ, అత్తగారి పెత్తనం సహా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిసి సుమారు 500కి పైగా చిత్రాల్లో నటించాడు.
చదవండి:
టాలీవుడ్‌లో మరో విషాదం.. పూజా హెగ్డే ఎమోషనల్ ట్వీట్
వరుణ్ ధావన్‌కి కరోనా పాజిటివ్.. జుగ్ జుగ్.. చిన్న బ్రేక్!
Comments
Please login to add a commentAdd a comment