![Actress Kavitha Husband Dasharatha Raju Passes Away Due To Covid - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/30/kavitha.jpg.webp?itok=VDXOAeuP)
సీనియర్ నటి కవిత ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్‌తో పోరాడుతూ ఆమె భర్త దశరథ రాజు బుధవారం కన్నుమూశారు. ఇప్పటికే కోవిడ్ కారణంగా ఆమె కుమారుడు స్వరూప్ మృతి చెందాడు. 15 రోజుల్లో వ్యవధిలోనే ఆమె ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంతో కవిత కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది.. కవిత భర్త దశరథ రాజు మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆమెను పరామర్శిస్తున్నారు.
కాగా కవిత 'ఓ మజ్ను' అనే తమిళ సినిమాతో 11 ఏళ్లకే వెండితెర అరంగ్రేటం చేసింది. సుమార్ 50కి పైగా తమిళ చిత్రాల్లో తళుక్కున మెరిసిన ఆమె తెలుగు, మలయాళ, కన్నడ సినిమాల్లోనూ నటించింది. హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment