అసిఫ్ బస్రా (ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై: 2020 సంవత్సరం చిత్రపరిశ్రమలో తీరని విషాదాన్ని మిగుల్చుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది బాలీవుడ్ పలువురు ప్రముఖ నటులను కోల్పోయింది. తాజాగా మరో విషాద వార్త పరిశ్రమ వర్గాలను షాక్‌కు గురి చేసింది. బాలీవుడ్ సీనియర్ నటుడు ఆసిఫ్ బాస్రా (53)ఆత్మహత్య కలకలం రేపింది. అయితే ఆసిఫ్ ఎందుకు ఇలాంటి నిర్ణయానికి తీసుకున్నారనే దానిపై స్పష్టత లేదు.
హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలోని ధర్మశాల కేఫ్ సమీపంలో ఆసిఫ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో ఆయన ఉరివేసుకుని చనిపోయినట్టు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీనియర్ పోలీసు అధికారులు ఫోరెన్సిక్ బృందం దర్యాప్తు ప్రారంభించిందని పోలీసు ఉన్నతాధికారి విముక్త్ రంజన్ వెల్లడించారు. యుకెకు చెందిన మహిళతో సహజీవనం చేస్తున్న ఆసిఫ్ తన పెంపుడు కుక్క గొలుసుతోనే ఉరివేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు ప్రాథమిక సమాచారం.
కాగా టీవీ నటుడుగా ప్రసిద్ధి చెందిన ఆసిఫ్ 'పర్జానియా', బ్లాక్ 'ఫ్రైడే' ‘పాతాళ్‌లోక్’, 'జబ్ వి మెట్', 'కై పో చే', 'క్రిష్ 3', 'ఏక్ విలన్', 'ఫ్రీకీ అలీ' 'హిచ్కి' లాంటి అనేక బాలీవుడ్ మూవీల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. హాలీవుడ్ మూవీ ‘అవుట్‌సోర్స్’లో కూడా కనిపించారు. అలాగే ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై’ లో ఇమ్రాన్ హష్మీ తండ్రిగా కూడా నటించారు.
Asif Basra! Can't be true... This is just very, very sad.
— Hansal Mehta (@mehtahansal) November 12, 2020
Comments
Please login to add a commentAdd a comment