తిరుమల లడ్డూ కాంట్రాక్టర్ గుండెపోటుతో మృతి
తిరుమల ఆలయ లడ్డూ కాంట్రాక్టర్ బుధవారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆలయానికి లడ్డూ విభాగానికి చెందిన రంగరాజు, అలియాస్ పోటు రమేష్ కు ఉదయం గుండెపోటు రాగా వెంటనే అతడిని తిరుమలలోని ఆశ్విన్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. రంగరాజు మృతి విషయం తెలిసిన ఆలయ ఆర్చకులు, శ్రేయోభిలాషులు పెద్దెత్తున ఆసుపత్రి వద్దకు వచ్చారు. టీటీడీ చైర్మన్ చదలవాడ, జేఈవో శ్రీనివాసర్ రాజు, ఆయన మృతికి సంతాపం తెలిపారు.