బాధ్యతగా చదివిస్తున్నారా? | are you Read your child responsibly? | Sakshi
Sakshi News home page

బాధ్యతగా చదివిస్తున్నారా?

Published Wed, Sep 13 2017 12:21 AM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM

బాధ్యతగా చదివిస్తున్నారా?

బాధ్యతగా చదివిస్తున్నారా?

సెల్ఫ్‌చెక్‌

‘‘మావాడు మెడిసిన్‌ చదువుతున్నాడు... మా అమ్మాయి ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ చేస్తోంది... మా ఇద్దరు పిల్లలూ ఐఐటీలో ర్యాంకులు సాధించారు.’’ ఇవి నేటి చదువుల ట్రెండ్‌. ఇవే తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలు. పిల్లల సామర్థ్యాలు, ఇష్టాయిష్టాలకు తగినట్లు తల్లిదండ్రులు వారి చదువుల పట్ల  ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. పాఠశాల దశ నుంచి ప్రొఫెషనల్‌ డిగ్రీదాక పిల్లల వెన్నంటి ఉంటున్నారు. ఈ విధంగా చేయటం  ఎంతో అవసరం అంటే అతిశయోక్తి కాదేమో. మీరూ మీ పిల్లల చదువుపట్ల శ్రద్ధ తీసుకుంటున్నారా? లేక బిజీగా ఉండి వారి మానాన వారిని వదిలేస్తున్నారా?

1.    క్రమం తప్పకుండా పిల్లల హోమ్‌ వర్క్‌ని పరిశీలిస్తారు.
    ఎ. అవును      బి. కాదు  

2.    నెలలో ఒక్కసారైనా పాఠశాలకు వెళ్లి చదువులో పిల్లల అభివృద్ధి తెలుసుకుంటారు.
    ఎ. అవును      బి. కాదు  

3.    పిల్లలకు ఏ సబ్జెక్ట్‌పై ఆసక్తి ఉందో తెలుసుకొని ఆ సబ్జెక్ట్‌పై మరింత పట్టు సాధించేలా ప్రయత్నిస్తారు.
    ఎ. అవును      బి. కాదు  

4.    పరీక్షసమయాల్లో పిల్లల్ని జాగ్రత్తగా చదివించటంతో పాటు పరీక్షహాలు దాకా వెళతారు.
    ఎ. అవును      బి. కాదు  

5.    పాఠశాలలో నిర్వహించే సమావేశాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు తప్పక హాజరవుతారు.
    ఎ. అవును      బి. కాదు
 
6.    పిల్లలు కొన్ని సబ్జెక్ట్‌లలో తక్కువ మార్కులు తెచ్చుకుంటుంటే వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని ఉపాధ్యాయులని కోరతారు.
    ఎ. అవును      బి. కాదు  

7.    పాఠ్య పుస్తకాలలో ఎలాంటి పాఠాలు, ఎక్సర్‌సైజ్‌లు వస్తున్నాయో గమనిస్తారు.
    ఎ. అవును      బి. కాదు  

8.    పాఠాలలో ఎప్పుడైనా తప్పులు దొర్లితే  వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళతారు.
    ఎ. అవును      బి. కాదు  

9.    భవిష్యత్‌ దార్శనికత చిన్నప్పటి నుంచే పిల్లల్లో పెంపొందించటానికి ప్రయత్నిస్తారు (ఏ కోర్సు చేస్తే ఏమవుతారోనని).
    ఎ. అవును      బి. కాదు  

10.    పాఠ్యపుస్తకాలతో పాటు కొన్ని కథల పుస్తకాలు, పేపర్లు, మ్యాగజైన్‌లను చదవమని పిల్లల్ని ప్రోత్సహిస్తారు.
    ఎ. అవును      బి. కాదు  

‘ఎ’ సమాధానాలు 7 దాటితే మీరు పిల్లల చదువుపట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని అర్థం. ఇది వారి భవిష్యత్తుకు సోపానంగా ఉండటంతో పాటు స్పష్టతనిస్తుంది. మీరు తీసుకొనే శ్రద్ధవల్ల తెలియకుండానే పిల్లల్లో చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ‘బి’ సమాధానాలు ‘ఎ’ కంటే ఎక్కువగా వస్తే మీరు మీ పిల్లల చదువుపై శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది. ‘ఎ’ సమాధానాలను సూచనలుగా భావించి అలా చేయటానికి ప్రయత్నించండి. ఉన్నత చదువులే  పిల్లల కెరియర్‌ను నిలబెడతాయని గ్రహించండి. పిల్లల చదువుపై మీరు కనబరిచే శ్రద్ధ వారి చదువుల్లో వృద్ధికి  కారణమవుతుందని తెలుసుకోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement