attention
-
విభిన్న ప్రతిభావంతులపై ఏపీ ప్రభుత్వం మరింత శ్రద్ధ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతుల పట్ల ప్రభుత్వం మరింత శ్రద్ధ వహిస్తోంది. వారి ప్రత్యేక హాస్టళ్లు, పాఠశాలలకు తాజా బడ్జెట్‌లోను తగినంత నిధులు కేటాయించింది. రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రభుత్వం 20 వసతి గృహాలు నిర్వహిస్తోంది. వాటిలో 1,675 మంది విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలను కల్పిస్తోంది. బధిరుల కోసం బాపట్లలో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆరు రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్వహిస్తోంది. వాటిలో విజయనగరం, బాపట్ల, ఒంగోలులో బధిరులకు, విజయనగరం, విశాఖపట్నం, హిందూపురంలో అంధుల కోసం పాఠశాలలు నిర్వహిస్తున్నారు. వీటిని విభిన్న ప్రతిభావంతులకు అనుకూలంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నాడు–నేడు కార్యక్రమంలోను వారి కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. బడ్జెట్లో ప్రాధాన్యం.. ►రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ ద్వారా వారికి అవసరమైన ఆసరా కల్పించేందుకు ప్రస్తుత బడ్జెట్లో రూ. 4,201.26 లక్షలు కేటాయించారు. వారికి సబ్సిడీపై పరికరాలు, కృత్రిమ అవయవాలు, పునరావాసం, వైఎస్సార్ కళ్యాణమస్తు తదితర వాటి కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. ►రాష్ట్రంలో అంధ, బధిర విద్యార్థుల కోసం నిర్వహించే పాఠశాలలకు రూ. 973.02 లక్షలు, బాపట్లలోని బధిరుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలకు రూ. 45.67 లక్షలు కేటాయించారు. ►విభిన్న ప్రతిభావంతుల క్రీడా ఉత్సవాలను నిర్వహించేందుకు రూ. 25 లక్షలు కేటాయించారు. ►నిపుణులతో 300 మందికి కోచింగ్ ఇచ్చి పోటీ పరీక్షలకు విభిన్న ప్రతిభావంతులను సన్నద్ధం చేసేలా విజయవాడ కేంద్రంగా నిర్వహిస్తున్న స్టడీ సర్కిల్‌కు రూ. 20 లక్షలు కేటాయించారు. ►అనంతపురం, కాకినాడలలో అంధులకు హోమ్‌లు ఏర్పాటు చేసేందుకు రూ. 66.86 లక్షలు ప్రతిపాదించారు. చదవండి: సంతోష సూచీలో మనమెక్కడ.. మనకంటే మెరుగైన స్థానాల్లో పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ప్రభుత్వ పాఠశాలల్లోను సౌకర్యాలు రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు, కాలేజీలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ వారికి సౌకర్యాలు కలి్పంచేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. దూర ప్రాంతాల్లో ఉండే ప్రత్యేక పాఠశాలలకు వెళ్లలేని వారికి స్థానిక బడుల్లోనే అడ్మిషన్ ఇస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వ పాఠశాల్లోని తరగతి గదుల్లో విభిన్న ప్రతిభావంతులకు సౌకర్యంగా ఉండేలా.. వీల్చైర్లు, నడిచి వెళ్లేందుకు వీలుగా ర్యాంపు వంటి నిర్మాణాలు చేపట్టారు. –బి.రవిప్రకాశ్‌రెడ్డి, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు -
అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఈస్ట్ జోన్లో అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్‌ను పోలీసు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశామని.. వారి నుంచి సుమారు రూ. 12 లక్షల రూపాయల నగదును స్వాదీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసులో అబిద్ మోహినుద్దీన్, షేక్ అబ్దుల్ బాసిత్, సంబరం రాజేష్‌లను అరెస్ట్ చేశామన్నారు. రాజేష్ కుమార్ బగడియా అనే వ్యక్తిని ఈ ముఠా మోసం చేసిందని పేర్కొన్నారు. పాత నోట్లను మార్పిడి చేస్తామంటూ.. రాజేష్‌ను నమ్మించారని చెప్పారు. రెండు రోజుల్లో ఈస్ట్ జోన్ పోలీసులు ఈ కేసును చేధించారని సీపీ పేర్కొన్నారు. -
ఆయన జీవితమే అందుకు నిదర్శనం
హనుమంతుడు సూర్యుడి దగ్గర విద్యను నేర్చుకోవాలనుకున్నాడు. వెంటనే వెళ్లి సూర్యనారాయణుడికి నమస్కరించి విద్యలు నేర్పమని వినయంగా అడిగాడు. అందుకాయన ‘‘నేను ఒకచోట కూర్చుని పాఠం చెప్పలేనని’’ చెప్పాడు. ఎందుకంటే ఒకేచోట కూర్చునుంటే లోకానికి ఇబ్బంది. ఉదయాన్నే బయల్దేరతాడు. అదేవేగంతో వెళ్ళిపోతుంటాడు. వెళ్లిపోవడమంటే ఏ విజయవాడో వెళ్ళి రావడం కాదు. బ్రహ్మాండాలన్నీ చుట్టివస్తాడు. అంతవేగంతో వెడుతున్నవాడు చెబుతున్న మాటలు వినడం కష్టం. పైగా ఎప్పుడూ ఒకేలా ఉండడు. ఉదయం బయల్దేరినప్పుడు దగ్గరగా వెళ్ళి వినవచ్చు. మధ్యాహ్న సాయంకాలాలు అలా కుదరదు. మార్తాండుడై ఉంటాడు. భరించడం కష్టం.సాధారణంగా ఎదురుగా కూర్చుని ముఖం కనబడేటట్లుగా ఉండి చెపుతుంటే మాటలను పట్టుకోవడం తేలిక. కానీ ఇక్కడలా కుదరదు. అలాగని గురువుగారి పక్కన పరుగెడుతూ నేర్చుకుందామా అంటే... రెండు చెవులతో స్పష్టంగా వినడం కుదరదు. గురువుగారికి పృష్ఠభాగం చూపకూడదనే నియమం వల్ల ముందుండడానికి వీల్లేదు. ఇక ఏమిటి మార్గం– గురువుగారి ఎదురుగా నిలబడి, వెనకకు పరుగెడుతూ అదీ సూర్యుడితో సమానంగా, ఒక్క మాట విడిచిపెట్టకుండా నాలుగు వేదాలు, 9 వ్యాకరణాలు నేర్చుకున్నాడు. ఇదీ హనుమ వైభవం. అలా నేర్చుకోగలగాలంటే ఆయనకు ఎంత శ్రద్ధ, భక్తి ఉన్నాయో ఆలోచించండి. లోకంలో ఎన్నో అవతారాలున్నాయి. హనుమ అవతారం మాత్రమే అంత వైశిష్ట్యం పొందడానికి కారణం – అంత శ్రమకోర్చి గురువుగారి దగ్గర పాఠం నేర్చుకోవడమే. హనుమ జీవితం ఒకసారి గమనించండి. ఆయన పుట్టీపుట్టగానే సూర్యుడిని చూసి పండనుకొని ఆకాశానికెగిరిపోయాడు. ఇంద్రుడు వజ్రాయుధం పెట్టికొడితే ఎడమ దవడ విరిగి అక్కడినుంచి కిందపడ్డాడు. ఆ తరువాత దేవతలందరూ వచ్చి ఎన్నో శక్తులు ధారపోశారు. అన్ని శక్తులు పొందిన హనుమ తన జీవితంలో ఓ గంట విశ్రాంతి తీసుకున్నట్లు మీరెప్పుడయినా విన్నారా! లోకంలో ఎవ్వరూ ఎప్పుడూ చేయడానికి సాహసించని కార్యాలను ఆయనొక్కడే సంకల్పించాడు. నూరుయోజనాల సముద్రాన్ని ఎవరు దాటగలరు? అటువంటిది దాటడమే కాకుండా తానొక్కడే రామభక్తుడిగా ఉండి చుట్టూ రాక్షసులున్నా నిర్భయంగా రావణాసురుడితో మాట్లాడి అంతే వేగంతో తిరిగి వస్తాడు. అంతటి బలవంతుడు, శక్తిమంతుడు, అంతటి పండితుడు, వ్యాకరణవేత్త, తనగురించి చేసుకున్న పని ఒక్కదాన్ని చూపగలరా! ఎన్ని గ్రంథాలు వెతికినా ఒక్కటీ కనిపించదు. కార్యదీక్షాపరుడు అలా ఉండాలి. – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాల నుంచి... -
బాధ్యతగా చదివిస్తున్నారా?
సెల్ఫ్‌చెక్ ‘‘మావాడు మెడిసిన్ చదువుతున్నాడు... మా అమ్మాయి ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ చేస్తోంది... మా ఇద్దరు పిల్లలూ ఐఐటీలో ర్యాంకులు సాధించారు.’’ ఇవి నేటి చదువుల ట్రెండ్. ఇవే తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలు. పిల్లల సామర్థ్యాలు, ఇష్టాయిష్టాలకు తగినట్లు తల్లిదండ్రులు వారి చదువుల పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. పాఠశాల దశ నుంచి ప్రొఫెషనల్ డిగ్రీదాక పిల్లల వెన్నంటి ఉంటున్నారు. ఈ విధంగా చేయటం ఎంతో అవసరం అంటే అతిశయోక్తి కాదేమో. మీరూ మీ పిల్లల చదువుపట్ల శ్రద్ధ తీసుకుంటున్నారా? లేక బిజీగా ఉండి వారి మానాన వారిని వదిలేస్తున్నారా? 1. క్రమం తప్పకుండా పిల్లల హోమ్ వర్క్‌ని పరిశీలిస్తారు. ఎ. అవును బి. కాదు 2. నెలలో ఒక్కసారైనా పాఠశాలకు వెళ్లి చదువులో పిల్లల అభివృద్ధి తెలుసుకుంటారు. ఎ. అవును బి. కాదు 3. పిల్లలకు ఏ సబ్జెక్ట్‌పై ఆసక్తి ఉందో తెలుసుకొని ఆ సబ్జెక్ట్‌పై మరింత పట్టు సాధించేలా ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు 4. పరీక్షసమయాల్లో పిల్లల్ని జాగ్రత్తగా చదివించటంతో పాటు పరీక్షహాలు దాకా వెళతారు. ఎ. అవును బి. కాదు 5. పాఠశాలలో నిర్వహించే సమావేశాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు తప్పక హాజరవుతారు. ఎ. అవును బి. కాదు 6. పిల్లలు కొన్ని సబ్జెక్ట్‌లలో తక్కువ మార్కులు తెచ్చుకుంటుంటే వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని ఉపాధ్యాయులని కోరతారు. ఎ. అవును బి. కాదు 7. పాఠ్య పుస్తకాలలో ఎలాంటి పాఠాలు, ఎక్సర్సైజ్లు వస్తున్నాయో గమనిస్తారు. ఎ. అవును బి. కాదు 8. పాఠాలలో ఎప్పుడైనా తప్పులు దొర్లితే వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళతారు. ఎ. అవును బి. కాదు 9. భవిష్యత్ దార్శనికత చిన్నప్పటి నుంచే పిల్లల్లో పెంపొందించటానికి ప్రయత్నిస్తారు (ఏ కోర్సు చేస్తే ఏమవుతారోనని). ఎ. అవును బి. కాదు 10. పాఠ్యపుస్తకాలతో పాటు కొన్ని కథల పుస్తకాలు, పేపర్లు, మ్యాగజైన్లను చదవమని పిల్లల్ని ప్రోత్సహిస్తారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు 7 దాటితే మీరు పిల్లల చదువుపట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని అర్థం. ఇది వారి భవిష్యత్తుకు సోపానంగా ఉండటంతో పాటు స్పష్టతనిస్తుంది. మీరు తీసుకొనే శ్రద్ధవల్ల తెలియకుండానే పిల్లల్లో చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ‘బి’ సమాధానాలు ‘ఎ’ కంటే ఎక్కువగా వస్తే మీరు మీ పిల్లల చదువుపై శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది. ‘ఎ’ సమాధానాలను సూచనలుగా భావించి అలా చేయటానికి ప్రయత్నించండి. ఉన్నత చదువులే పిల్లల కెరియర్ను నిలబెడతాయని గ్రహించండి. పిల్లల చదువుపై మీరు కనబరిచే శ్రద్ధ వారి చదువుల్లో వృద్ధికి కారణమవుతుందని తెలుసుకోండి. -
శ్రద్ధగా వినాలి... ఆదరంగా మాట్లాడాలి!
ఆత్మీయం మనం ఎవరితో మాట్లాడుతున్నా, ఏ సందర్భంలో సంభాషిస్తున్నా, ఏ పరిస్థితుల్లో ఇతరులతో సంప్రదింపులు జరుపుతున్నా... అవతలివారు చెప్పేది శ్రద్ధగా వినాలి, వింటున్న విషయం మీద అత్యంత జాగరూకతతో ఆలోచన చేయాలి. అలాగే మనకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఒక్కమాట పొల్లుపోకూడదు. కొంతమందికి కొన్ని ప్రమాదకరమైన ఊతపదాలు అపయత్నంగా దొర్లుతుంటాయి. వాటి విషయంలో జాగత్తగా ఉండాలి. జీవితంలో వృద్ధిలోకి రావడానికి మొట్టమొదట అలవరచుకోవలసింది ఈ నైపుణ్యాలనే. ఒకవేళ అవి లేకపోతే భేషజాలకు పోకుండా నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పు ఎందుకు జరిగి ఉండొచ్చన్న అంశం మీద ఎక్కువ శ్రద్ధచూపే బదులు... ‘సరే! ఈ తప్పు జరిగింది, వెంటనే దీన్ని ఎలా సరిదిద్దవచ్చు, సాధ్యమైనంతగా దీన్ని మనం ఎలా సఫలీకృతం చేయవచ్చు’ అన్న దాని మీద దృష్టి పెట్టాలి. విమర్శించడానికి, రాళ్ళు వేయడానికి గుంపులో ఒకడిగా నిలబడడం గొప్పకాదు. ఒకరు చేసిన పొరబాటును వేరొకరు దిద్దడం విశాల హృదయానికి సంకేతం. అదేవిధంగా ఏదైనా ఒక విషయంలో అవతలివారు నోరు విప్పకముందే మనం ఒక నిర్ణయానికి వచ్చేస్తుంటాం. అలా వచ్చేసిన తరవాత ఎదుటివాడు చెప్పేది వినడానికి మనసు అంగీకరించదు, కాబట్టి మనం వినం. అది ప్రతిఘటనకు దారితీస్తుంది. దాంతో వినే ఓపిక నశించిపోయి అవతలివారి మీద కోప్పడతాం. అది మంచి లక్షణం కాదు. -
అటెన్షన్.. ర్యాలీ!
ర్యాలీ నిర్వహించి తీరతామన్న టీజేఏసీ.. అనుమతి లేదంటున్న పోలీసులు - పాల్గొంటే క్రిమినల్ కేసులు పెడతామంటూ హెచ్చరికలు - తెలంగాణ ఉద్యమాన్ని నేరంగా చూపుతారా: కోదండరాం ఫైర్ - నేడు ర్యాలీ, సభ యథాతథంగా నిర్వహిస్తామని స్పష్టీకరణ - పోలీసుల గుప్పిట్లో హైదరాబాద్.. కట్టుదిట్టమైన భద్రత - జిల్లాల్లో జేఏసీ నేతలు, విద్యార్థుల నిర్బంధం రాజధాని వేడెక్కింది.. నిరుద్యోగుల ర్యాలీపై అటు జేఏసీ.. ఇటు పోలీసులు పట్టువీడలేదు! ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహిస్తామంటూ టీజేఏసీ.. అందులో పాల్గొంటే క్రిమినల్ కేసులు పెడతామంటూ పోలీసుల హెచ్చరికల నడుమ నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అనుమతి నిరా కరణపై హైకోర్టు తలుపు తట్టిన జేఏసీ మంగళవారం చివరి నిమిషంలో పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు దాకా ర్యాలీ నిర్వహిస్తామని జేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టంచేశారు. ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని హింసగా, నేరంగా చిత్రీకరిస్తోందంటూ ధ్వజమెత్తారు. ‘‘నాపై, జేఏసీపై గతంలో పెట్టిన అన్ని కేసుల్లో కేసీఆర్ కూడా ఉన్నారు. ఆ కేసులన్నీ సీఎంపైనా పెడతారా’’అని నిలదీశారు. ఇక ర్యాలీ, సభను భగ్నం చేసేందుకు పోలీసులు సన్నద్ధమైంది. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేసింది. ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌ను ఆధీనంలోకి తీసుకున్నారు. జిల్లాల్లోనూ.. ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న జేఏసీ నేతలు, విద్యార్థులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. సాక్షి, హైదరాబాద్ నిరుద్యోగ ర్యాలీ, బహిరంగ సభకు పోలీసులు అనుమతినివ్వకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని టీజేఏసీ మంగళవారం నాటకీయ పరిణామాల మధ్య ఉపసంహరించుకుంది. ఉస్మానియా వర్సిటీలో సభ నిర్వహణకు సైతం పోలీసులు అనుమతిని నిరాకరించడం.. నాగోల్ మెట్రోరైల్ ఓపెన్ గ్రౌండ్లో సభ నిర్వహించుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు సిద్ధపడ టంతో తమ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుం టున్నట్లు టీజేఏసీ హైకోర్టుకు తెలిపింది. ఇందుకు న్యాయస్థానం అనుమతించింది. జేఏసీ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు మంగళవారం మరోసారి విచారించారు. సోమవారం నాటి విచారణలో.. సభను ఆదివారం నిర్వహించుకోవడానికి ఇబ్బంది ఏమిటో చెప్పాలని టీజాక్‌ను ఆదేశించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం కేసు విచారణకు రాగానే... ఆదివారం సభ నిర్వహణ సంగతేమిటని న్యాయమూర్తి ప్రశ్నించారు. కొంత సమయం ఇస్తే చెబుతానని జేఏసీ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి చెప్పడంతోన్యాయమూర్తి విచారణను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఆదివారం సభ సాధ్యం కాదు.. తిరిగి విచారణ ప్రారంభం కాగానే రచనారెడ్డి వాదనలు వినిపించారు. శుక్రవారం మహాశివరాత్రని, శనివారం జాగారం ఉంటారని, ఆదివారం పబ్లిక్ సర్వీస్ పరీక్ష ఉందని కోర్టుకు నివేదించారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం సభ నిర్వహించుకోవడం సాధ్యం కాదన్నారు. అంతేకాక సభ నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామన్నారు. ర్యాలీ, సభకు బయలుదేరిన పలువురుని పోలీసులు ఆయా జిల్లాల్లో అరెస్టులు చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ... హైదరాబాద్ వెలుపల సభ నిర్వహించుకుంటే పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా ఉస్మానియాలో సభకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారా? లేదంటే వెంటనే చేసుకోవాలని న్యాయమూర్తి జేఏసీ న్యాయవాదికి సూచించారు. జేఏసీ దరఖాస్తుపై మధ్యాహ్నం 3 గంటలకల్లా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను మధ్యాహ్నం 3.30 గంటలకు వాయిదా వేశారు. ఈ సమయంలో రచనారెడ్డి ఆవేశంగా మాట్లాడబోతుండగా... న్యాయమూర్తి ఆమెను వారించారు. తిరిగి విచారణ ప్రారంభం కాగానే... ఉస్మానియాలో అనుమతి కోసం దరఖాస్తు చేశామని, అన్ని హామీలు కూడా ఇచ్చామని రచనారెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అందుకు జారీ చేశామంటూ ఉత్తర్వుల కాపీని రామకృష్ణారెడ్డి న్యాయమూర్తి ముందుంచారు. దాన్ని పరిశీలించిన ధర్మాసనం.. ‘నిన్నటి ఉత్తర్వుల్లాగానే ఉన్నాయి కదా.. పోలీసులు ప్రతిపాదిస్తున్నట్లు మియాపూర్ మెట్రోరైల్ గ్రౌండ్స్‌లో ఎందుకు సమావేశం పెట్టుకోకూడదు’అని రచనను ప్రశ్నించారు. అది సిటీకి చాలా దూరమని ఆమె చెప్పగా.. కాదని, అది ఇన్నర్ రింగ్‌రోడ్డు లోపలే ఉందని ఏజీ తెలిపారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరుగుతుండగానే ఓయూ జేఏసీకి చెందిన కొందరు శరణం గచ్ఛామి సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వాలంటూ సెన్సార్ బోర్డు కార్యాలయంపై దాడి చేశారని తెలిపారు. ఉస్మానియాలో సభకు అనుమతినిస్తే ఇలాంటి పరిస్థితులే పునరావృత్తమయ్యే అవకాశాలున్నాయన్నారు. ఆ విగ్రహాల విధ్వంసం జేఏసీ పనే.. ఈ సందర్భంగా న్యాయమూర్తి.. గతంలో జరిగిన ఉద్యమాల్లో టీజేఏసీ పాల్గొంది కదా అని అన్నారు. అందుకు అవునని, అప్పుడు ట్యాంక్‌బండ్‌పై జరిగిన విగ్రహాల విధ్వంసానికి వారే కారణమని ఏజీ కోర్టుకు వివరించారు. దీనికి రచనారెడ్డి తీవ్రంగా స్పందిస్తూ... ఆ ఆందోళనల్లో ప్రస్తుత అధికార పార్టీ నేతలు కూడా పాల్గొన్నారని, విగ్రహాల కూల్చివేతలో ప్రస్తుత అధికార పార్టీ ఎంపీ కూడా ఉన్నారని, ఇందుకు సంబంధించి తమ వద్ద వీడియోలు, ఫోటోలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి.. పోలీసులు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన నాగోల్ మెట్రోరైల్ గ్రౌండ్స్‌ను ప్రస్తావించారు. అది చాలా దూరమని రచన చెప్పబోగా.. ఎంత మాత్రం కాదని, అది సిటీ పరిధిలోనే ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వద్ద పెద్ద స్థలం ఉందని, అక్కడ సభ పెట్టుకునేందుకు అనుమతినివ్వాలని రచనారెడ్డి కోరారు. అందుకు యూనివర్సిటీ వీసీ లేదా ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ అనుమతి ఇవ్వాలని కదా? అని న్యాయమూర్తి అనగా.. వారు సుముఖంగానే ఉన్నారని, పోలీసులే అనుమతులు ఇవ్వకుండా చేస్తున్నారని రచనారెడ్డి వివరించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలన్నదే తమ అభిమతమని, అందువల్ల నాగోల్ గ్రౌండ్స్‌లోనే సభ పెట్టుకోవడం మంచిదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే అది తమకు సమ్మతి కాదని ఆమె చెప్పగా.. మరో ప్రత్యామ్నాయం లేదంటూ న్యాయమూర్తి నాగోల్‌లో సభకు ఉత్తర్వులు ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ సమయంలో రచనారెడ్డి, మిగిలిన న్యాయవాదులు కోర్టు హాలులోనే చర్చించుకుని, తమ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని న్యాయమూర్తికి తెలిపారు. అందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. -
అమరావతిపై డేగ కన్ను
* ఏవోబీ ఘటనతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం * టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకోవాలని నిర్ణయం సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రా, ఒడిషా బోర్డర్లో జరిగిన మావోయిస్టుల ఎన్కౌంటర్ రాజధాని పల్లెలను ఉలికిపాటుకు గురి చేసింది. గతంలో ఎక్కవగా మావోయిస్టుల సానుభూతిపరుల కదలికలున్న ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్ కలకలం రేపింది. దీనికి తోడు అమరావతి రాజధాని ప్రాంతం కావడం వీఐపీ, వీవీఐపీల తాకిడి పెరగడంతో మావోయిస్తుల కదలికలు ఉండొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో పోలీసులు ప్రతి గ్రామాన్నీ జల్లెడ పడుతున్నారు. గతంలో కదలికలు రాజధాని ప్రాంత పల్లెల్లో గతంలోను మావోయిస్టుల కదలికలు ఉన్నాయి. చత్తీస్ఘడ్ ప్రాంతంలో పోలీసుల కాల్పుల్లో గాయపడిన మహిళా మావోయిస్టు చికిత్స కోసం రాజధాని ప్రాంతంలో బంధువుల ఇంటికి వచ్చినప్పడు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటనలున్నాయి. పలువురు మావోయిస్టులు ఈ ప్రాంతాలను షెల్టర్‌జోన్‌గా ఉపయోగించుకోనేవారని తెలిసింది. ఎక్కడైనా నిఘా పెరిగి కూంబింగ్ ఉన్నప్పుడు వారు సానుభూతిపరుల ఇళ్లకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఉంటారనేది నిఘా వర్గాలకు అందిన సమాచారం. ఏవోబీ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు పెద్ద నష్టం జరిగింది. అంతేగాక పోలీసులు అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల సంచార ప్రాంతాలపై పోలీస్డేగ కన్ను వేయడంతో ప్రస్తుతం జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు ఇలా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. తుళ్లూరు మండలంలోని అనంతవరం, దొండపాడు, తాళ్లాయపాళెం, పెద్దలంక ప్రాంతాల్లో వారి కదలికలు ఉండే అవకాశం ఉందనే సమాచారంతో నిఘా పెంచారు. సీఎంకు లేఖతో మరింత అప్రమత్తం.. ఆంధ్రా, ఒడిషా బోర్డర్ ఎన్‌కౌంటర్‌కు సీఎం చంద్రబాబును బాధ్యుడ్ని చేస్తూ మావోయిస్టుల రాష్ట్ర కమిటీ లేఖను విడుదల చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సీఎంతోపాటు వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని లేఖలో పేర్కొనడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. సీఎం, మంత్రులు రాజధాని ప్రాంతంలో తరచూ పర్యటిస్తుంటారు.. ఈ నేపథ్యంలో వారికి రక్షణ కల్పించడం పోలీసులకు పెద్ద కష్టంగా ఉంటుంది. రాజధాని పల్లెల్లో సానుభూతిపరులు ఉండటంతో ప్రభుత్వాధినేతల పర్యటనలను ఎప్పటికప్పుడు వారి ద్వారా తెలుసుకోనే అవకాశముంది. నిఘా వర్గాలు కాస్త ఏమరుపాటుగా ఉన్నా మావోయిస్టులు చెలరేగుతారు. టెక్నాలజీ సాయంతో.. ఆధునిక టెక్నాలజీని వాడుకోనేందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే టెక్నాలజీని అన్ని విధాలా వినియోగించుకుని విజయవంతమయ్యారు. పుష్కరాల్లోనూ ఇదే టెక్నాలజీతో ప్రజలకు రక్షణ కల్పించారు. విజయవాడలో సీసీ కెమెరాలతో నిఘాను పెంచారు. తుళ్లూరును పోలీస్ డివిజన్ కేంద్రంగా చేయనున్నారు. ఈ డివిజన్లో రాజధాని ఉండడంతో ప్రత్యేకSనిఘా ఉంచాలి. ఈ డివిజన్లో కూడా టెక్నాలజీని వాడుకోనున్నారు. -
బెల్ట్‌షాపుల నిర్మూలనకు కమిటీ!
* బుచ్చిబాపన్నపాలెంలో బెల్ట్‌షాపుల నిర్మూలన కమిటీ ఏర్పాటు * ఎమ్మెల్యే ఫిర్యాదుతో అధికారుల్లో చలనం నరసరావుపేట టౌన్: గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ ఎస్ఐ ఏవీఎస్ ప్రసాద్ హెచ్చరించారు. బుచ్చిబాపన్నపాలెంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గ్రామస్తులతో కలసి బుధవారం జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండేకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన నరసరావుపేట ఎక్సైజ్ శాఖ సీఐ వి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం ఆ గ్రామంలో బెల్ట్ షాపుల నిర్మూలన గ్రామస్థాయి నూతన కమిటీని ఏర్పాటుచేశారు. కమిటీకి కన్వీనర్‌గా ఎస్ఐ, అధ్యక్షురాలిగా గ్రామసర్పంచ్ గజ్జల నాగమల్లేశ్వరి, సభ్యులుగా వీఆర్ఓ కొండపరెడ్డి రమణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి కాటూరి సురేష్‌బాబు, ప్రధానోపాధ్యాయురాలు రేవతి, డ్వాక్రా మహిళలు కాకుటూరి లక్ష్మమ్మ, సీమల అంజమ్మ, గ్రామపెద్దలు గజ్జల ముసలారెడ్డి వ్యవహరిస్తారన్నారు. గ్రామంలో ప్రత్యేక నిఘా : సీఐ బుచ్చిబాపన్నపాలెం గ్రామంలో మద్యం విక్రయాలు పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు సీఐ వి.వెంకటేశ్వరరావు చెప్పారు. ప్రతిరోజూ ఒక కానిస్టేబుల్ గ్రామంలో విధులు నిర్వహించేలా చూస్తామన్నారు. గ్రామంలో ఎక్కడైనా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే 94409 02484, 99490 95788 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. -
పుష్కరాలు ముగిసేంత వరకు అప్రమత్తం
రూరల్ ఎస్పీ నారాయణ్ నాయక్ పొందుగల (దాచేపల్లి): కృష్ణా పుష్కరాలకు భక్తులు అధికంగా తరలివస్తున్నారని, భక్తులకు ఇబ్బంది కలుగకుండా పుష్కరాలు ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని జిల్లా రూరల్ ఎస్పీ కె. నారాయణ నాయక్ పోలీసులకు సూచించారు. మండలంలోని పొందుగల పుష్కరఘాట్‌ను బుధవారం ఆయన సందర్శించారు. ఘాట్‌లో భక్తులు స్నానాలు చేసే ప్రదేశాలను పరిశీలించారు. ఘాట్ల వద్ద ఏర్పాట్లు పట్ల ఆయన సంతప్తి వ్యక్తం చేశారు. మరో ఆరురోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయని, సెలవు దినాల్లో, పుష్కరాల చివరి రెండు రోజుల్లో భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఎస్పీ చెప్పారు. భక్తులు పుష్కరస్నానం చేసి క్షేమంగా ఇంటికి వెళ్లేలా చూడాలని, ఆటంకాలు కలుగకుండా భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ ఇ. శ్రీనివాసరావు, ఎస్ఐ కట్టా ఆనంద్, ఎంపీపీ అంబటి నవకుమార్, డీసీ చైర్మన్ నర్రా పుల్లయ్య తదితరులున్నారు. -
పీఎల్జీఏ వారోత్సవాలతో పోలీసులు అప్రమత్తం
హుకుంపేట: మావోయిస్టుల పీఎల్జీఏ వారోత్సవాలతో పోలీసు యంత్రాంగం ఏజెన్సీలో తనిఖీలను మమ్మురం చేసింది. ఒడిశా సరి హద్దు కావడంతో హుకుంపేట మండలంపై పోలీస్ అధికారులు మరింత దష్టి కేంద్రీకరిం చారు. కోరాపుట్టు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి గిరిజనులు అధికంగా హుకుంపేట సంతకు వస్తుండడంతో శనివారం పాడేరు సీఐ ఎన్.సాయి ప్రత్యేక బలగాలతో సంత ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తుల బ్యాగ్‌లను సోదా చేసి, వ్యక్తిగత వివరాలను తెలుసుకున్నారు. కామయ్యపేట రోడ్డులో ఒడిశా నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేశారు. సీఐ ఎన్.సాయితో పాటు స్థానిక ఎస్ఐ రవికుమార్ పాల్గొన్నారు. అనంతరం హుకుంపేట స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామాలలోని శాంతి భద్రతలపై అధికారులతో సమీక్షించారు. ముమ్మరంగా పోలీసుల తనిఖీలు డుంబ్రిగుడ: మండల కేంద్రం సమీపంలోని అరకు–పాడేరు ప్రధాన రహదారిలో డుంబ్రిగుడ ఎస్ఐ బి.రామకష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ప్రధాన రహదారిలో వాహనాలను ఆపి పరిశీలించారు. -
తీరు మారని జిల్లా అధికార యంత్రాంగం !
♦ టీడీపీ నేతల పర్యటన.. అటెన్షన్లో అధికారులు ♦ కమిషనర్, ఆర్డీఓ, తహసీల్దార్.. క్యూకట్టిన యంత్రాంగం కడప: ‘నవ్విపోదురుగాక నాకేటీ సిగ్గు’ అన్నట్లుగా ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. ఓవైపు ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ విస్మరించడం, మరోవైపు టీడీపీ నేతలకు ప్రభుభక్తి ప్రదర్శించడాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నారు. అనేక విమర్శలు తలెత్తినా అధికారుల ధోరణిలో మార్పు రావడం లేదు. తాజాగా శనివారం కడపలో అలాంటి ఘటనే తెరపైకి వచ్చింది. హౌసింగ్‌బోర్డుకాలనీ పరిధిలోని రాజీవ్‌మార్గ్ లో శనివారం ఉద యం టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, హరిప్రసాద్, గోవర్ధన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, ఆసం నరసింహారెడ్డి, జయచంద్రారెడ్డిలు పర్యటించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న కార్పొరేషన్ స్థలం ఆక్రమణలను పరిశీలించారు. వాస్తవంలో ఆక్రమణలను తొలగించాలని అధికారులను అభ్యర్థించాల్సిన వారు, ఏకం గా అధికారులతో మార్చ్ఫాస్ట్ చేయించారు. ఈఘటన తిలకించిన పట్టణ ప్రజలు ఆశ్చర్యచకితులయ్యారు. ఆర్డీఓ చిన్నరాముడు, కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, తహసీల్దార్ రవిశంకర్‌రెడ్డి, టౌన్‌ఫ్లానింగ్ అధికారులు, రెవెన్యూయంత్రాంగమం తా రాజీవ్‌మార్గ్‌లో వచ్చివాలిపోయింది. అధికారహోదా లేకపోయినా నిస్సిగ్గుగా యంత్రాంగం టీడీపీ నేతల వెంట పర్యటించింది. ఇదేమీ వింత పరిస్థితని ఓ ఉన్నతాధికారిని ప్రశ్నిస్తే, ఉద్యోగం ఇక్కడే చేయాలంటే ఇలాంటి పరిస్థితి తప్పదని వాపోడం విశేషం. ఎక్కడికెళ్లినా అధికారులకు ఉద్యోగమే ఉంటుంది. అధికారి స్థాయిని తగ్గించలేరన్న విషయాన్ని పలువురు విస్మరిస్తున్నారు. వ్యవస్థలు నిర్వీర్యం అధికారం బలంతో వ్యవస్థలను నిర్వీర్యం చేసే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. ఆమేరకు వారి చర్యలే రుజువు చేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అభివృద్ధి చేయాలనే తలంపు ఉంటే నేత లు పరిశీలించి అధికారులకు ఫిర్యాదు చేయడం సమంజసం. అలాకాకుండా హోదా కోసం మొత్తం యంత్రాంగాన్ని తిప్పుకోవడం ఏమాత్రం సహేతుకం కాదని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధుల పట్ల బాధ్యతతో వ్యవహరించాలి. అలా కాకుండా స్థాయిని దిగజార్చుకొని వ్యవహరించడం ఏమాత్రం సముచితం కాదని పలువురు వివరిస్తున్నారు. -
ప్రశ్నించటాన్ని నేర్పేదే ప్రశ్నోపనిషత్
ఆత్మను తెలుసుకోవాలనుకునేవారు తపస్సు, బ్రహ్మచర్యం, నిష్ఠ, శ్రద్ధలతో యోగులై ఉత్తరాయణ మార్గంలో సూర్యుణ్ణి చేరుకుంటున్నారు. ఉత్తరాయణమే ప్రాణకేంద్రం. అమరం, అభయం. ఈ మార్గంలో వెళ్లినవాళ్లు మళ్లీ పుట్టరు. యువతరం జిజ్ఞాసతో, శ్రద్ధగా జ్ఞానసముపార్జన ఎలా చెయ్యాలో, ఎటువంటి గురువును ఆశ్రయించాలో, క్రమశిక్షణ ఎలా పాటించాలో అధర్వ వేదాంతర్గతమైన ప్రశ్నోపనిషత్తు చక్కగా తెలియజేస్తుంది. వేదం ప్రశ్నించమనే చెబుతోంది. అయితే తెలుసుకోవటానికే (జిజ్ఞాస) ప్రశ్నించాలి. గెలవటానికి (జిగీష) అహంకారంతో వేదాంత విషయాలు ప్రశ్నిస్తే సత్యదర్శనం కాకపోగా కాలం వృథా అవుతుంది. ఋక్, యజుర్ సామవేదాల తర్వాత ఏర్పడిన నాలుగోవేదం అధర్వ(ణ) వేదం. భౌతికంగా పనికి వచ్చే శాస్త్ర సాంకేతిక, ఆధునిక విషయాలు దీనిలో ఉన్నాయి. అలాగే వేదాంతాలైన ఉపనిషత్తులు కూడా అధర్వవేదంలో శాస్త్రీయ దృక్పథంతో ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే ప్రధానమైన ఉపనిషత్తులలో మూడు అధర్వవేదంలో నుంచే తీసుకున్నారు. వాటిల్లో ప్రశ్నోపనిషత్తు మరింత ముఖ్యం. ఆరుగురు యువ మునీశ్వరులు పిప్పలాద మహర్షిని ఆరు ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలను, సమాధానాలను తెలుసుకుందాం. ప్రథమప్రశ్న భరద్వాజ కుమారుడు సుకేశి. శిబికుమారుడు సత్యకాముడు. అశ్వల కుమారుడు కౌసల్యుడు. కత్యకుమారుడు కబంధి. విధర్భ దేశీయుడు భార్గవుడు, సూర్యపుత్రుడు గార్గ్యుడు. అనే ఆరుగురు ఋషులు శ్రద్ధతో తపస్సు చేశారు. బ్రహ్మనిష్ఠాపరులైన ఆ ఆరుగురికి పరబ్రహ్మాన్ని గురించి స్పష్టంగా తెలుసుకోవాలనిపించింది. దానిని సమగ్రంగా చెప్పగలిగిన గురువు పిప్పలాద మహర్షి అని తెలుసుకుని ఆయన దగ్గరకు వెళ్లారు. బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థించారు. ‘‘ఋషులారా! మీరు ఇప్పటివరకు ఎంత తపస్సు చేసినా మా దగ్గర ఒక సంవత్సరం పాటు శ్రద్ధతో, బ్రహ్మచర్యంతో తపస్సు చేయండి. తరువాత ఎన్ని ప్రశ్నలైనా అడగండి. మాకు తెలసింది మొత్తం మీకు చెబుతాం అన్నాడు పిప్పలాద మహర్షి. ఇక్కడ మాకు అనే బహువచనం గురుపీఠగౌరవాన్ని తెలియజేస్తుంది. ఇలా ఒక సంవత్సరం గడిచింది. అప్పుడు కాత్యాయనుడైన కబంధి గురువు గారి దగ్గరకు వెళ్లాడు. ‘‘భగవాన్! ఈ జీవులందరూ ఎక్కడినుంచి వస్తున్నారు’’? అని మొదటి ప్రశ్న అడిగాడు. పిప్పలాద మహర్షి ‘‘కబంధీ! ప్రాణులను సృష్టించాలని భావించిన ప్రజాపతి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆకాశాన్నీ, ప్రాణాలన్నీ ఒక జంటగా సృష్టించాడు. ఈ జంట ద్వారా అన్ని జీవులు ఏర్పడాలని ఆయన సంకల్పం. సూర్యుడు ప్రాణం. చంద్రుడు జడపదార్థం. ఈ సృష్టిలో కపడేవి, కనపడనివీ అన్నీ జడపదార్థాలే. సూర్యుడు తూర్పుదిక్కున ఉదయించి తన కాంతితో ఆ దిక్కుకు ప్రాణం ఇస్తున్నాడు. అలాగే దక్షిణం, పడమర, ఉత్తరం, భూమి, ఆకాశం, ఆగ్నేయం, నైరృతి, వాయవ్యం, ఈశాన్యం అన్నివైపులా తన కిరణాలను ప్రసరింపజేస్తున్నాడు. ప్రాణులన్నింటికీ ప్రాణశక్తిని ఇస్తున్నాడు. వైశ్వానరుడు, విశ్వరూపుడు, ప్రాణస్వరూపుడు అయిన సూర్యుడు అగ్నిగోళంలా ఉదయిస్తాడు. ఋగ్వేదం ఇలా చెబుతోంది. సర్వజ్ఞుడు, జ్యోతిస్వరూపుడు, సకల ప్రాణులకూ ప్రాణమైన సూర్యుడు వెయ్యికిరణాలతో ఉదయిస్తూ వందవిధాలుగా జీవులను కాపాడుతున్నాడు. సృష్టికర్త సంవత్సర స్వరూపుడు. ఆయనకు ఉత్తరాయణం, దక్షిణాయనం అనే రెండు దారులు ఉన్నాయి. కోరికతో యాగాలు, సత్కర్మలు, సత్కార్యాలు చేసినవారు చంద్రలోకానికి చేరుకుని మళ్లీ భూమి మీద పుడతారు. సంతానాన్ని కోరే ఋషులు దక్షిణాయనంలో చంద్రలోకానికి వెళుతున్నారు. ఇది చాలా కష్టం. సూర్యుడు అయిదు పాదాలతో, పన్నెండు రూపాలలో ఉంటాడు. ఆయనే సర్వజ్ఞుడు. వర్షప్రదాత. ఆరు ఆకులున్న ఏడుచక్రాల రథం మీద సంచరిస్తూ ఉంటాడు. సంవత్సరంలో ఒక భాగం మాసం (నెల) మాసమే సృష్టికర్త. మాసంలో రెండు పక్షాలు ఉంటాయి. శుక్లపక్షం ప్రాణస్వరూపం. ఋషులు యజ్ఞయాగాలు ఈ పక్షంలోనే చేస్తారు. కృష్ణపక్షం జడపదార్థం. ఒకరోజులో పగలు, రాత్రి ప్రజాపతి స్వరూపమే. పగలు ప్రాణం రాత్రి జడం. ప్రాణస్వరూపమైన పగటివేళ సంభోగించిన వారి ఆయుర్దాయం క్షీణిస్తుంది. నాయనా! కబంధీ! అన్నం కూడా ప్రజాపతి రూపమే. అన్నం నుంచే రేతస్సు ఏర్పడుతుంది. రేతస్సు నుంచే అన్ని జీవులు పుడుతున్నాయి. ఈవిధంగా ప్రజాపతి ఏర్పరచిన ఈ వ్రతాన్ని ఎవరు శ్రద్ధగా పాటిస్తారో వారు జంటలను సృష్టిస్తారు. ఎవరియందు తపస్సు, బ్రహ్మచర్యం, సత్యనిష్ఠ ప్రతిష్ఠితమై ఉన్నాయో వారు మాత్రమే బ్రహ్మలోకానికి చేరుకోగలుగుతారు. నియమబద్ధంగా జీవించేవారికే సత్త్వగుణ ప్రధానమైన బ్రహ్మలోకం చేరే అర్హత లభిస్తుంది. వక్రత, అసత్యం, మాయ, మోసం ఉన్నవారు ఎప్పటికీ బ్రహ్మలోకాన్ని చేరుకోలేరు. బ్రహ్మజ్ఞానాన్ని పొందలేరు. పిప్పలాద మహర్షి ఈ విధంగా కబంధి అడిగిన ప్రశ్నకు కళ్లకు కట్టినట్టు స్పష్టమైన సమాధానం ఇచ్చాడు. ప్రాణులు ప్రాణవంతం కావడంలో సూర్యుని పాత్ర, కాలస్వరూపం అయనాలు, ఋతువులు, మాసాలు, రోజులు, పగలు, రాత్రి ఇవన్నీ పరబ్రహ్మస్వరూపమే. మానవులు తపస్సు, బ్రహ్మచర్యం, సత్యనిష్ఠ శ్రద్ధాభక్తులతో మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలుగుతారు’’ అంటూ మానవ జన్మ పరమార్థాన్ని, మానవ జీవిత విధానాన్ని వివరించారు. కబంధుడు అడిగిన ప్రశ్నకు గురువుగారు చెప్పిన సమాధానాన్ని ఆరుగురూ అర్థం చేసుకున్నారు. రెండోప్రశ్నను, సమాధానాన్ని వచ్చేవారం తెలుసుకుందాం. - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
ఇదో కన్నీళ్ల స్టోరీ!
ఇదో కన్నీళ్ల స్టోరీ. కనురెప్పల్నుంచి దిగి, ముక్కు పక్కలకు ప్రవహించి, మీసాల్లో కలిసి, పెదవుల కిందికి జారి, చుబుకాన్ని అంటి, గొంతు కిందిగా సాగి, ఛాతీ వెంట్రుకల్లో పాయలుగా విడిపోయి, అక్కడి నుంచి సిక్స్ ప్యాక్ గడుల సందులకు దిగి, మరింత దిగువకు చేరి, గుంభనంగా, గంభీరంగా నాభిలో కలిసిపోయే కన్నీళ్ల స్టోరీ. ఏడ్చే మగాళ్లను నమ్మొచ్చా? మళ్లీ మొదటికొచ్చారా! సరే మీ ఇష్టం. మగాళ్లను నమ్మకండి. కనీసం వాళ్ల కన్నీళ్లనైనా నమ్మకపోతే ఎలా? మీరనుకోవడం ఏంటంటే... మగాళ్లది దొంగ ఏడుపని. అందుకే నమ్మనవసరం లేదని. అవునా? ఏదో ఒక ఏడుపు బాస్. వాళ్ల ఏడుపు వాళ్లను ఏడ్వనివ్వకపోవడం కరెక్టు కాదేమో! నో అటెన్షన్ ప్లీజ్. ‘బాయ్స్ డోన్ట్ క్రయ్’ అనే మాట ఏ వేదంలోనైనా ఉండి ఉండాలి. లేకుంటే మనవాళ్లు మగాళ్ల ఏడుపుపై ఇంత పట్టింపుతో ఉండేవాళ్లు కాదు. అసలు మగాళ్లు ఎందుకు ఏడ్వకూడదు? వాళ్లు రోబోలేం కాదు కదా. కాదు కానీ, ఫీలింగ్స్ లేని రోబోల్లాగే వాళ్లు ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా స్త్రీల ఫీలింగ్స్ విషయంలో. వినరు. విన్నా పట్టించుకోరు. సో... వీళ్లు ఏడ్చే అర్హతను కోల్పోయి, ఏడ్పించే జాతిలోకి చేరిపోయారని అర్థం చేసుకోవాలి. ఇంకొకటేంటంటే... ఏడుపు మగాళ్లకు నప్పదు. (నచ్చదు కాదు. నప్పదు). అందుకే వాళ్లు ఏడిస్తే నవ్వొస్తుంది. లేదా భయం వేస్తుంది. లేదా వింతగా, విడ్డూరంగా ఉంటుంది. బాధతో ఏడ్చినా, సంతోషంతో ఏడ్చినా! బరాక్ ఒబామా ఏడ్చాడనే అనుకుందాం. అనుకోవడం ఏముంది! రెండోసారి ఎన్నికైనప్పుడు, మొన్నీమధ్య వీడ్కోలు స్పీచ్‌లో ఆయన నిజంగానే ఏడ్చేశారు... సంతోషాన్ని పట్టలేక, బాధని ఓర్చుకోలేక. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి కూడా ఏడ్చిన హిస్టరీ ఉంది. ఎలక్షన్ ర్యాలీలో మాట్లాడుతూ మాట్లాడుతూ పట్టలేని ఎమోషన్‌తో ఆయన ఏడ్చేశారు. జర్మన్ మగాళ్లు అస్సలు ఏడ్వరు. కానీ ఒకప్పటి వాళ్ల ఛాన్స్లర్ హెల్మట్ కోల్ ‘‘నేనెందుకు ఏడ్వకూడదు?’’ అని డైరీలో రాసుకున్నారు. దీన్ని బట్టి ఏడుపురాని, వస్తే ఏడవకూడదని అనుకునే మగాళ్లు ఈ భూమండలంపై లేరనే అనుకోవాలి. చిత్రం చూడండి, ఒబామా ఏడ్చినా, మన పక్కింటి వెంకటేశ్వర్రావుగారు ఏడ్చినా ఒకే విధమైన ఆశ్చర్యం కలుగుతుంది మనకు. ఏడుపు విషయంలో సెలబ్రిటినీ, సగటు మగాణ్నీ వేర్వేరుగా టాలరేట్ చెయ్యలేకపోతున్నాం మనం! ఆల్బర్ట్ కామూ నవల ‘ది ఔట్‌సైడర్’లో మెహ్సో (క్ఛఠటట్చఠ్ట) అనే క్యారెక్టర్ ఉంటుంది. అతడు మనుషుల్లో కలవడు. నిర్లక్ష్యంగా ఉంటాడు. దేన్నీ పట్టించుకోడు. సొంత తల్లి చనిపోతే అంత్యక్రియలప్పుడు కూడా అతడికి ఏడుపురాదు. కానీ ఆ తర్వాత ఒక హత్య చేస్తాడు. ఈ మధ్య రణబీర్ కపూర్ ఆ పుస్తకం చదివాడట. అందులో మెహ్సో, తనూ ఒకటేనట. చివరిసారిగా తనెప్పుడు ఏడ్చాడో రణబీర్‌కి గుర్తులేదట. ఏడ్చే అవకాశం లేక మగాళ్లంతా ఇలా... మెహ్సోలా ఇంట్రావర్ట్‌లు అయిపోతున్నారనుకోవాలా? వాళ్లను హాయిగా ఏడ్వనిస్తే.. స్త్రీ జాతిని ఏడిపించడం నుంచి డైవర్ట్ అవుతారని ఆశించాలా? అద్వానీ నుంచి ఆమిర్ వరకు ఇండియాలో బహిరంగంగా ఏడ్చిన సెలబ్రిటీ మగాళ్ల లిస్టు మరీ అంత చిన్నదేం కాదు. అసలు మగాళ్లు ఏడిస్తే చాలు, ఎక్కడలేని సెలబ్రిటీ స్టేటస్ వచ్చేస్తుంది! ఈ ఏడుపుగొట్టు స్టేటస్ మనకెందుగ్గానీ, కన్నీళ్లు జలజలా రాలితే గుండెకు బలమని వైద్య పరిశోధకులు అంటున్నారు. అందుకోసమైనా మగాళ్లు ఏడుపు ఆపుకోనక్కర్లేదు. ‘ఒక మగవాడి ఫీలింగ్స్’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన మగ పుస్తకం ‘మధుపం’ లో కుర్ర రచయిత పూడూరి రాజిరెడ్డి అన్నట్టు... ‘నేను మగవాణ్ణి’ అన్న ఆనందం అనుభవించడం కోసం కనుక ఎవరైనా ఏడవ్వడం మానేసి ఉంటే.. అది గుండెకు ఆరోగ్యం కలిగించని ఆనందం అని గ్రహించడం మంచిది. మాధవ్ శింగరాజు -
పోలీసుల అటెన్షన్
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో బుధవారం జరిగే సామూహిక నిమజ్జనోత్సవానికి పోలీసులు సన్నద్ధమయ్యారు. ఈ తుదిఘట్టాన్ని ప్రశాంతంగా పూర్తిచేసేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆయా ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహించారు. ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలోని రహదారులపై వాహనాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా పలువురు అనుమానితుల నుంచి రూ.48లక్షల నగదుతోపాటు 25 వాహనాలను సీజ్ చేశారు. మేడిపల్లిలో రూ.7 లక్షలు, వనస్థలిపురంలో రూ.17 లక్షలు, నేరేడ్మెట్ చౌరస్తాలో రూ. 18 లక్షలు, మియాపూర్‌లో రూ.2 లక్షలు, చందానగర్‌లో రూ.1.30 లక్షలు, ఎల్బీనగర్లో రూ.1.70 లక్షలు, కూకట్‌పల్లిలో రూ.లక్ష స్వాధీనం చేసుకున్నారు. అలాగే కూకట్పల్లి,రాజేంద్రనగర్ పరిధిలో రిజిస్ట్రేషన్ పత్రాల్లేని 14 బైక్‌లు, నాలుగుఆటోలు, ఏడుకార్లను స్వాధీనం చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా ముమ్మరం చేశారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆన ంద్ గచ్చిబౌలి, మియాపూర్, లింగంపల్లి, కూకట్పల్లి, సనత్‌నగర్ ఏరియాలో నాకాబందీ తీరును ఆయన పరిశీలించారు. డీసీపీలు రవివర్మ, రమేష్‌నాయుడు, రంగారెడ్డి, శివకుమార్, అవినాష్ మహంతిలు నాకాబందీలో పాల్గొన్నారు. ముందుజాగ్రత్తగా స్పెషల్ ఆపరేషన్‌టీం (ఎస్వోటీ) ఓఎస్డీ గోవర్దన్‌రెడ్డి 21మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశారు.