పోలీసుల అటెన్షన్ | police Attention | Sakshi
Sakshi News home page

పోలీసుల అటెన్షన్

Published Wed, Sep 18 2013 1:44 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM

police Attention

 సాక్షి,సిటీబ్యూరో:  నగరంలో బుధవారం జరిగే సామూహిక నిమజ్జనోత్సవానికి పోలీసులు సన్నద్ధమయ్యారు. ఈ తుదిఘట్టాన్ని ప్రశాంతంగా పూర్తిచేసేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆయా ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహించారు. ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలోని రహదారులపై వాహనాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా పలువురు అనుమానితుల నుంచి రూ.48లక్షల నగదుతోపాటు 25 వాహనాలను సీజ్ చేశారు. మేడిపల్లిలో రూ.7 లక్షలు, వనస్థలిపురంలో రూ.17 లక్షలు, నేరేడ్‌మెట్ చౌరస్తాలో రూ. 18 లక్షలు, 
 
 మియాపూర్‌లో రూ.2 లక్షలు, చందానగర్‌లో రూ.1.30 లక్షలు, ఎల్బీనగర్‌లో రూ.1.70 లక్షలు, కూకట్‌పల్లిలో రూ.లక్ష స్వాధీనం చేసుకున్నారు. అలాగే కూకట్‌పల్లి,రాజేంద్రనగర్ పరిధిలో రిజిస్ట్రేషన్ పత్రాల్లేని 14 బైక్‌లు, నాలుగుఆటోలు, ఏడుకార్లను స్వాధీనం చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా ముమ్మరం చేశారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆన ంద్  గచ్చిబౌలి, మియాపూర్, లింగంపల్లి, కూకట్‌పల్లి, సనత్‌నగర్ ఏరియాలో నాకాబందీ  తీరును ఆయన పరిశీలించారు. డీసీపీలు రవివర్మ, రమేష్‌నాయుడు, రంగారెడ్డి, శివకుమార్, అవినాష్ మహంతిలు నాకాబందీలో పాల్గొన్నారు. ముందుజాగ్రత్తగా స్పెషల్ ఆపరేషన్‌టీం (ఎస్‌వోటీ) ఓఎస్‌డీ గోవర్దన్‌రెడ్డి 21మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement