నాపై దుష్ప్రచారం చేస్తున్నారు : హీరో భార్య | Hero Ganesh Wife Shilpa Complaint On Social Media Virals | Sakshi
Sakshi News home page

నాపై దుష్ప్రచారం చేస్తున్నారు

Published Fri, Jul 13 2018 8:04 AM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM

Hero Ganesh Wife Shilpa Complaint On Social Media Virals - Sakshi

భర్త గణేశ్‌తో శిల్ప (ఫైల్‌)

యశవంతపుర: సోషల్‌ మీడియాలో తన ఫొటో  ఉంచి నాడుప్రభు కెంపేగౌడకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలను పోస్టు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సినీహీరో గణేశ్‌ భార్య శిల్ప నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘కెంపేగౌడ కంటే గొప్పపనులు చేసినవారు అనేక మంది ఉన్నారు. సిల్క్‌ వర్శిటీకి కెంపేగౌడకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు’ అని రాసి శిల్ప ఫొటోను జతచేసి ఫేస్‌బుక్‌లో కొందరు పోస్టు చేశారు.

దీంతో శిల్పపై సోషల్‌మీడియాలో ఆగ్రహం వ్యక్తమైంది. నాడుప్రభు కెంపేగౌడపై తనకు అపారమైన గౌరవం ఉందని, అయనను అవమానించాల్సిన అవసరం లేదని పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. కొందరు కావాలనే తనకు చెడ్డపేరు తేవడానికి ఇలాంటి పోస్టులు చేసిన్నట్లు, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శిల్ప పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement