హుకుంపేట: మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలతో పోలీసు యంత్రాంగం ఏజెన్సీలో తనిఖీలను మమ్మురం చేసింది. ఒడిశా సరి హద్దు కావడంతో హుకుంపేట మండలంపై పోలీస్ అధికారులు మరింత దష్టి కేంద్రీకరిం చారు. కోరాపుట్టు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి గిరిజనులు అధికంగా హుకుంపేట సంతకు వస్తుండడంతో శనివారం పాడేరు సీఐ ఎన్.సాయి ప్రత్యేక బలగాలతో సంత ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తుల బ్యాగ్‌లను సోదా చేసి, వ్యక్తిగత వివరాలను తెలుసుకున్నారు. కామయ్యపేట రోడ్డులో ఒడిశా నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేశారు. సీఐ ఎన్.సాయితో పాటు స్థానిక ఎస్‌ఐ రవికుమార్ పాల్గొన్నారు. అనంతరం హుకుంపేట స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామాలలోని శాంతి భద్రతలపై అధికారులతో సమీక్షించారు.
ముమ్మరంగా పోలీసుల తనిఖీలు
డుంబ్రిగుడ: మండల కేంద్రం సమీపంలోని అరకు–పాడేరు ప్రధాన రహదారిలో డుంబ్రిగుడ ఎస్‌ఐ బి.రామకష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ప్రధాన రహదారిలో వాహనాలను ఆపి పరిశీలించారు.
పీఎల్‌జీఏ వారోత్సవాలతో పోలీసులు అప్రమత్తం
Published Sun, Jul 31 2016 12:04 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement