సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతుల పట్ల ప్రభుత్వం మరింత శ్రద్ధ వహిస్తోంది. వారి ప్రత్యేక హాస్టళ్లు, పాఠశాలలకు తాజా బడ్జెట్‌లోను తగినంత నిధులు కేటాయించింది. రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రభుత్వం 20 వసతి గృహాలు నిర్వహిస్తోంది. వాటిలో 1,675 మంది విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలను కల్పిస్తోంది.
బధిరుల కోసం బాపట్లలో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆరు రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్వహిస్తోంది. వాటిలో విజయనగరం, బాపట్ల, ఒంగోలులో బధిరులకు, విజయనగరం, విశాఖపట్నం, హిందూపురంలో అంధుల కోసం పాఠశాలలు నిర్వహిస్తున్నారు. వీటిని విభిన్న ప్రతిభావంతులకు అనుకూలంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నాడు–నేడు కార్యక్రమంలోను వారి కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
బడ్జెట్‌లో ప్రాధాన్యం..
►రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ ద్వారా వారికి అవసరమైన ఆసరా కల్పించేందుకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 4,201.26 లక్షలు కేటాయించారు. వారికి సబ్సిడీపై పరికరాలు, కృత్రిమ అవయవాలు, పునరావాసం, వైఎస్సార్ కళ్యాణమస్తు తదితర వాటి కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.
►రాష్ట్రంలో అంధ, బధిర విద్యార్థుల కోసం నిర్వహించే పాఠశాలలకు రూ. 973.02 లక్షలు, బాపట్లలోని బధిరుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలకు రూ. 45.67 లక్షలు కేటాయించారు.
►విభిన్న ప్రతిభావంతుల క్రీడా ఉత్సవాలను నిర్వహించేందుకు రూ. 25 లక్షలు కేటాయించారు.
►నిపుణులతో 300 మందికి కోచింగ్ ఇచ్చి పోటీ పరీక్షలకు విభిన్న ప్రతిభావంతులను సన్నద్ధం చేసేలా విజయవాడ కేంద్రంగా నిర్వహిస్తున్న స్టడీ సర్కిల్‌కు రూ. 20 లక్షలు కేటాయించారు.
►అనంతపురం, కాకినాడలలో అంధులకు హోమ్‌లు ఏర్పాటు చేసేందుకు రూ. 66.86 లక్షలు ప్రతిపాదించారు.
చదవండి: సంతోష సూచీలో మనమెక్కడ.. మనకంటే మెరుగైన స్థానాల్లో పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్
ప్రభుత్వ పాఠశాలల్లోను సౌకర్యాలు
రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు, కాలేజీలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ వారికి సౌకర్యాలు కలి్పంచేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. దూర ప్రాంతాల్లో ఉండే ప్రత్యేక పాఠశాలలకు వెళ్లలేని వారికి స్థానిక బడుల్లోనే అడ్మిషన్ ఇస్తున్నారు.
ఇందుకు అనుగుణంగానే విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వ పాఠశాల్లోని తరగతి గదుల్లో విభిన్న ప్రతిభావంతులకు సౌకర్యంగా ఉండేలా.. వీల్‌చైర్లు, నడిచి వెళ్లేందుకు వీలుగా ర్యాంపు వంటి నిర్మాణాలు చేపట్టారు.
–బి.రవిప్రకాశ్‌రెడ్డి, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు
Comments
Please login to add a commentAdd a comment