Diverse
-
విభిన్న ప్రతిభావంతులపై ఏపీ ప్రభుత్వం మరింత శ్రద్ధ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతుల పట్ల ప్రభుత్వం మరింత శ్రద్ధ వహిస్తోంది. వారి ప్రత్యేక హాస్టళ్లు, పాఠశాలలకు తాజా బడ్జెట్‌లోను తగినంత నిధులు కేటాయించింది. రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రభుత్వం 20 వసతి గృహాలు నిర్వహిస్తోంది. వాటిలో 1,675 మంది విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలను కల్పిస్తోంది. బధిరుల కోసం బాపట్లలో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆరు రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్వహిస్తోంది. వాటిలో విజయనగరం, బాపట్ల, ఒంగోలులో బధిరులకు, విజయనగరం, విశాఖపట్నం, హిందూపురంలో అంధుల కోసం పాఠశాలలు నిర్వహిస్తున్నారు. వీటిని విభిన్న ప్రతిభావంతులకు అనుకూలంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నాడు–నేడు కార్యక్రమంలోను వారి కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. బడ్జెట్లో ప్రాధాన్యం.. ►రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ ద్వారా వారికి అవసరమైన ఆసరా కల్పించేందుకు ప్రస్తుత బడ్జెట్లో రూ. 4,201.26 లక్షలు కేటాయించారు. వారికి సబ్సిడీపై పరికరాలు, కృత్రిమ అవయవాలు, పునరావాసం, వైఎస్సార్ కళ్యాణమస్తు తదితర వాటి కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. ►రాష్ట్రంలో అంధ, బధిర విద్యార్థుల కోసం నిర్వహించే పాఠశాలలకు రూ. 973.02 లక్షలు, బాపట్లలోని బధిరుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలకు రూ. 45.67 లక్షలు కేటాయించారు. ►విభిన్న ప్రతిభావంతుల క్రీడా ఉత్సవాలను నిర్వహించేందుకు రూ. 25 లక్షలు కేటాయించారు. ►నిపుణులతో 300 మందికి కోచింగ్ ఇచ్చి పోటీ పరీక్షలకు విభిన్న ప్రతిభావంతులను సన్నద్ధం చేసేలా విజయవాడ కేంద్రంగా నిర్వహిస్తున్న స్టడీ సర్కిల్‌కు రూ. 20 లక్షలు కేటాయించారు. ►అనంతపురం, కాకినాడలలో అంధులకు హోమ్‌లు ఏర్పాటు చేసేందుకు రూ. 66.86 లక్షలు ప్రతిపాదించారు. చదవండి: సంతోష సూచీలో మనమెక్కడ.. మనకంటే మెరుగైన స్థానాల్లో పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ప్రభుత్వ పాఠశాలల్లోను సౌకర్యాలు రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు, కాలేజీలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ వారికి సౌకర్యాలు కలి్పంచేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. దూర ప్రాంతాల్లో ఉండే ప్రత్యేక పాఠశాలలకు వెళ్లలేని వారికి స్థానిక బడుల్లోనే అడ్మిషన్ ఇస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వ పాఠశాల్లోని తరగతి గదుల్లో విభిన్న ప్రతిభావంతులకు సౌకర్యంగా ఉండేలా.. వీల్చైర్లు, నడిచి వెళ్లేందుకు వీలుగా ర్యాంపు వంటి నిర్మాణాలు చేపట్టారు. –బి.రవిప్రకాశ్‌రెడ్డి, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు -
పులి.. ఈ పేరు వింటేనే అందరికీ హడల్...
పులి.. ఈ పేరు వింటేనే అందరికీ హడల్. ఇది వన్యమృగం.. అయినా సౌమ్యం వీటి సొంతం. అయితే నల్లమల పులి జీవనం వైవిధ్యం. పులులు సంఘజీవులు కావు. ఒంటరిగా బతికేందుకు ఇష్టపడతాయి. ఇతర జంతువులతో కలవడం చాలా అరుదు. ఇవి ఆహారం కోసం వన్యప్రాణులను వేటాడడం.. పిల్లల్ని కనడం.. వాటికి జీవన మెళకువలు నేర్పడం.. ఆ తర్వాత అరణ్యంలో బతికేందుకు వదిలేయడం అంతా విభిన్నంగా ఉంటుంది. సువిశాల విస్తీర్ణంలో నెలకొన్న ఎన్ఎస్టీఆర్ (నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్ట్)లో ఉంటే పులులతో పాటు ఇతర టైగర్ ఫారెస్ట్‌ల్లో ఉండే వాటికంటే చాలా సౌమ్యంగా ఉంటాయి. బఫర్ ఏరియాలను దాటి జనారణ్యంలోకి తరుచూ వచ్చినా మనుషులపై దాడులు చేసిన ఘటనలు అరుదు. ఇక్కడ ఉండే పులులు సాధువుగా ఉంటాయని అంటున్నారు వన్యప్రాణుల పరిశోధకులు. జీవ వైవిధ్యానికి నెలవుగా ఉండే నల్లమల అభయారణ్యం 3,700 చదరపు కిలో మీటర్ల మేర ఎన్ఎస్టీఆర్ విస్తరించి ఉంది. దేశంలోనే అతి పెద్ద టైగర్ రిజర్వు ఫారెస్ట్ ఇది. దీని చుట్టూ వందలాది గిరిజన గూడేలు ఉన్నాయి. ఇక్కడ నివశించే పులి నల్లమల రాజుగా పేరొందింది. అంతరించిపోతున్న వీటి సంరక్షణకు, వీటి సంతతిని పెంచేందుకు అటవీశాఖ అధికారులు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారికంగా 75 పులులు ఉన్నాయని గుర్తించినా అనధికారికంగా 100కు పైగా ఉన్నాయని అంచనా. ఈ ఏడాది కూడా పులుల గణన ప్రారంభమైంది. ఏప్రిల్ నెల చివరి వరకూ వివిధ దశల్లో వీటిని లెక్కింపు చేస్తారు. మృగమే కానీ.. సాధారణంగా అటవీ ప్రాంతానికి సమీప గిరిజన గూడేలకు మధ్య బఫర్ ఏరియా ఉంటుంది. వన్యప్రాణులు, మృగాలు జనావాసాల వైపు రాకుండా ఉండేలా ఒక అంచనా వేస్తూ బఫర్ ఏరియాలను నిర్ణయించారు. అయితే మనుగడ కోసం గిరిజన ప్రాంతాల్లోని వారు బఫర్ ఏరియాలను దాటి ముందుకు వచ్చేశారు. దీంతో తరుచూ వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తున్నాయి. నల్లమల రాజుగా పేరొందిన పులులు ఇతర టైగర్ ఫారెస్టుల్లో ఉన్న పులులు కంటే చాలా సాధుగుణం కలిగి ఉంటాయి. తెలంగాణ, మహారాష్ట్ర బోర్డర్లో ఉన్న తడోబా టైగర్ ఫారెస్టులోని పులులు నిత్యం మనుషులపై దాడులు చేస్తుంటాయి. నెలకు ఒకరిద్దరిని పొట్టన పెట్టుకుంటుంటాయి. ఇలా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఎన్‌ఎస్‌టీఆర్‌లో మాత్రం పులులు తరుచూ జనారణ్యంలోకి వచ్చినా మనుషులపై దాడులు చేయడం చాలా అరుదు. మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే 0.001 శాతం మాత్రమే దాడి చేసి ఉంటాయని వన్యప్రాణి నిపుణులు అంటున్నారు. ఎన్‌ఎస్‌టీఆర్‌లో ఒక పులి సంచరించేందుకు 30 నుంచి 40 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం ఉంటుంది. ఇతర వన్యప్రాణులను వేటాడుతూ.. లేదా నీళ్ల కోసం బఫర్ ఏరియాలను దాటి గూడేల వైపు ఇవి వస్తుంటాయి. గత నెలలో గిద్దలూరు అటవీ డివిజన్ పరిధి మాగుటూరు, లక్ష్మీపురం, వెలగలపాయ, శంకరాపురం, కాకర్ల తదితర గ్రామాల పరిధిలోనూ, మార్కాపురం అటవీ డివిజన్ పరిధిలోని యర్రగొండపాళెం మండలం కొలుకుల గ్రామం పరిధిలో పులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు. వీటి దాడిలో ఎద్దులు సైతం మృతి చెందాయి. పులుల సంచారాన్ని గుర్తించేందుకు అధికారులు ట్రాప్ కెమెరాలు అమర్చారు. పెద్దపులి దాడి చేసిన ఎద్దు మృతదేహం వద్దకు వచ్చి కళేబరాన్ని తింటుండటం కెమెరాలో నిక్షిప్తమైంది. ఒక పులి తన పిల్లలతో వచ్చినట్టు కూడా గుర్తించినట్టు సమాచారం. పులుల సంతతి పెరిగేందుకు.. ఎన్‌ఎస్‌టీఆర్‌లో పులుల సంతతి పెరిగేందుకు ఆగస్టు, సెపె్టంబర్ రెండు నెలల పాటు పర్యాటకుల రాకపోకలను నిషేధించారు. ఆ సమయంలో పులులు స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కలుగుతుంది. మగ పులి, ఆడపులి కలిసేందుకు అది అనుకూలమైన సమయంగా అధికారులు గుర్తించారు. పులులకు సూపర్ సెన్స్ ఉంటుంది. ఆడపులి రాకను మగపులి 30 కిలో మీటర్ల దూరం నుంచే గుర్తిస్తుంది. ఆడపులి ఒక చెట్టును బరకడం, మూత్ర విసర్జన చేస్తుంది. ఆ సమయంలో విడుదలైన రసాయనాల వాసనను మగపులి గుర్తిస్తుంది. ఆడ పులితో మేటింగ్ తర్వాత వారం రోజులు ఉండి మగ పులి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. గర్భం దాల్చిన ఆడపులి 103 రోజుల తర్వాత పిల్లలకు జన్మనిస్తుంది. వాటిని ఇతర వన్యమృగాల బారిన పడకుండా అత్యంత రహస్య ప్రదేశంలో ఉంచి ఆహారానికి వెళుతుంది. అవి కళ్లు తెరిచే వరకు అత్యంత జాగ్రత్తగా ఉంటాయి. ఒక నెల తర్వాత వేటాడడం నేర్పుతోంది. ఇలా 18 నెలల పాటు వాటికి అన్ని రకాల మెళకువలు నేర్పి వదిలేస్తోంది. అలా తల్లి నుంచి వేరైన పులులు సొంతంగా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. పిల్లలు తనతో ఉన్నంత వరకు మగపులిని మేటింగ్‌కు ఆహ్వానించదు. అవి పిల్లలతో ఆహారం నిమిత్తం పొరపాటున జనారణ్యంలోకి వచ్చిన సమయంలో పులి కూనలను మనుషులు తాకితే ఇక వాటిని తల్లి పులి దగ్గరకు రానివ్వదు. ఇటీవల నంద్యాల జిల్లాలో పిల్లలతో కలిసి జనారణ్యంలోకి పులి వచ్చింది. నాలుగు కూనలు ఆరు బయట ఉండడంతో వాటిని స్థానికులు పట్టుకుని అటవీశాఖ అధికారులకు వివరాలు అందించారు. ఈ సమయంలో వాటిని మనుషులు ముట్టుకోవడంతో వాటి కోసం తల్లి పులి రాలేదని తెలుస్తోంది. పులుల సంరక్షణకు.. నల్లమల అభయారణ్యంలో నాలుగు డివిజన్లు, 16 నుంచి 20 రేంజ్‌లు ఉన్నాయి. అటవీ సమీపంలో ఉండే చెంచులకు అభయారణ్యంలోని జంతువుల గురించి పూర్తిగా తెలుసు. పెద్ద పులి ఎక్కడ ఉంది.. అది ఏం చేస్తుందనేది దూరం నుంచే పసిగడతారు. మనకంటే వారికే ఎక్కువగా తెలుసు. కొన్ని సందర్భాల్లో అటవీశాఖ సిబ్బందినే గైడ్ చేస్తారు. అందుకే వారిని ప్రొటెక్షన్ వాచర్లుగా, స్ట్రైక్ ఫోర్సులుగా నియమించారు. మొత్తం 600 మందికి ఉద్యోగాలు ఇచ్చి రక్షణగా నియమించారు. వేసవిలో వన్యప్రాణులకు నీటిఎద్దడి లేకుండా అవసరమైన చోట్ల సాసర్పిట్లు ఏర్పాటు చేసి వాటిని ఎప్పటికప్పుడు నీటితో నింపుతున్నారు. పులుల గణన ప్రారంభం ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పులుల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్‌ఎస్‌టీఆర్‌లో ఉండే పులులు శేషాచలం అడవులకు వెళ్లి వస్తున్నాయని అధికారులు గుర్తించారు. వివిధ దశల్లో 80 రోజుల పాటు డేటాను సేకరిస్తారు. ఫిబ్రవరి 20 నుంచి 20 రోజుల పాటు నంద్యాల, పోరుమామిళ్ల, లంకలమల, శేషాచలం కారిడార్‌లో వివరాలు సేకరించారు. మార్చి 11 తర్వాత మిగతా ఏరియాలో కెమెరాలను బిగించి మరో 20 రోజుల పాటు మార్చి 31 వరకు డేటాను సేకరిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి 20 వరకు ఆత్మకూరు, మార్కాపురం డివిజన్లో ఏప్రిల్ 21 నుంచి మే 10 వరకూ డేటాలను సేకరిస్తారు. వీటి ఆధారంగా పులుల సంఖ్యను లెక్కిస్తారు. పక్కాగా గణన పులుల గణన పక్కాగా సేకరిస్తున్నాం. ఎక్కడికక్కడ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశాం. ఎన్‌ఎస్‌టీఆర్‌లో పులుల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ప్రొటెక్షన్ వాచర్లను నియమించాం. వేసవిలో వాటికి నీటి అవసరాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. 120 సాసర్ పిట్లు ఏర్పాటు చేసి వాటి నిర్వహణకు ప్రత్యేక బృందాలను ఉంచాం. – మహ్మద్ హయత్, ఎఫ్ఆర్ఓ, బయోడైవర్శిటీ కేంద్రం, శ్రీశైలం -
నేను ఒక్కదాన్నే ఉంటాను
మనిషి కలిసి ఉండాలి. అమ్మ, నాన్న.. భార్య, భర్త... తల్లి, పిల్లలు... కాని దేశంలో దాదాపు ఆరుశాతం మంది స్త్రీలు ఈ బంధాలను ఎడంగా ఉంచి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. దక్షిణాదిలో వీరి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంది. సపరేటెడ్/డివోర్సీ/వితంతువు... ఈ స్త్రీలు తిరిగి ఏ బంధంలోకీ వెళ్లడానికి ఇష్టపడటం లేదు. కుటుంబాలతో కూడా ఉండటం లేదు. ఎందుకు? (కోవిడ్ కేర్ సెంటర్లలో నాణ్యమైన సేవలు) సుజాతగారి ఒక అబ్బాయి అమెరికాలో ఉంటాడు. ఇంకో అబ్బాయి ఇక్కడే హైదరాబాద్ లో ఉంటాడు. సుజాతగారు టీచర్‌గా రిటైర్ అయ్యారు. భర్త చనిపోయాక ఆమె తన ఇంట్లోనే ఉంటరిగా ఉంటున్నారు. అమెరికాకు వెళ్లడం లేదు. రెండోకొడుకు ఇంట్లో ఉండి కోడలి ప్రేమను తగ్గించుకోవడమూ ఇష్టం లేదు. ఇలా బాగానే ఉంది అనుకున్నారామె. రజితకు 40 ఏళ్లు. పిల్లలు లేరు. భర్త చనిపోయాడు. ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉద్యోగం చేసుకుంటూ ఒక్కతే ఉంటోంది. మొదటి పెళ్లిలో అత్తామామల నుంచి చాలా హింస పడింది. భర్త హఠాన్మరణం కూడా ఆమెను బెంబేలెత్తించింది. కొత్త బంధంలో ఏ సమస్యలు, చికాకులు ఉన్నాయో. ఇలా బాగానే ఉంది అని అనుకుని ఉండిపోయింది. రాధకు భర్తతో సరిపడలేదు. పదేళ్ల కూతురు ఉంది. భర్తతో విడివడి కూతురే లోకం అనుకుంటూ ఉంది. మరో పెళ్లి అనే ఆలోచన ఆమె ఎదుట అనేక ప్రశ్నలను ఉంచుతోంది. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోలేక ఒంటరిగా ఉండిపోయింది. ఇటీవల కూతురి కోసం ఒక కుక్కపిల్లను కొన్నది. వాళ్లిద్దరికి ఇప్పుడు కుక్కపిల్ల తోడు. స్త్రీలు ఒంటరిగా ఉండగలరు.. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు అని తాజా గణాంకాలు చెబుతున్నాయి. శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్– 2018 గణాంక నివేదిక ప్రకారం దేశంలో 5.5 శాతం మంది స్త్రీలు వివాహం అయ్యాక అనేక కారణాల రీత్యా ఒంటరిగా ఉంటున్నారు. విడాకులు లేకుండా విడిపోయి, విడాకులతో విడిపోయి, భర్త చనిపోయి... కారణాలు ఏవైనా వీరంతా ఒంటరిగా జీవిస్తున్నారు. అయితే కేరళ, తమిళనాడుల్లో ఈ సంఖ్య రెట్టింపు ఉంది. కేరళలో ఒంటరిగా ఉంటున్న స్త్రీలు 9.3 శాతం అయితే తమిళనాడులో 9.1 శాతం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వీరి సంఖ్య ఎక్కువగా ఉండటం గమనించాలి. ఆంధ్రప్రదేశ్‌లో 7.8 శాతం, తెలంగాణలో 7.1 శాతం ఉన్నారు. కాని వివాహం అనంతరం వివిధ కారణాల వల్ల ఒంటరిగా ఉంటున్న పురుషుల సంఖ్య కేవలం 1.5 శాతం మాత్రమే. అంటే మగవారు ఎలాగోలా ఒక స్త్రీతోడును వెతుక్కుంటుంటే స్త్రీలు మగతోడును వద్దనుకుంటున్నారు. ఒంటరి స్త్రీల సంఖ్య దక్షణాదిలో పెరగడానికి మైక్రోఫ్యామిలీ సిస్టమ్ ఒక ప్రధాన కారణం అని నిపుణులు భావిస్తున్నారు. పెళ్లయిన వెంటనే పిల్లలు వేరు కాపురాలు పెట్టడానికి ఆత్రపడటం వల్ల తల్లిదండ్రులు వేరుగా ఉండాల్సి వస్తోంది. వీరిలో వయసు వ్యత్యాసం వల్ల భర్త ముందు చనిపోతే భార్య ఒక్కతే ఉండాల్సి రావడం కేరళ, తమిళనాడుల్లో ఎక్కువగా కనిపిస్తోందని పరిశీలనలో తెలుస్తోంది. దక్షణాది రాష్ట్రాలలో అబ్బాయి వయసు అమ్మాయి వయసు కంటే ఎక్కువగా ఉండటం (దాదాపు 10 సంవత్సరాల వరకు) వల్ల కూడా భర్తల మరణం తర్వాత స్త్రీలు ఒంటరి జీవితానికి నిబద్ధులు అవుతున్నారు. కొద్దోగొప్పో చదువు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉపాధి మార్గాలు ఇవన్నీ వివాహం నుంచి బయటపడ్డ స్త్రీకి, సంతానం వద్ద ఉండే వీలు లేని స్త్రీకి/ పిల్లలు ఉండనివ్వని స్త్రీకి తన కాళ్ల మీద తాను నిలబడేలా చేస్తున్నాయి. కాని పిల్లల కోసం, సంఘ మర్యాద కోసం ‘టెక్నికల్’గా కలిసి ఉంటూ ఒకే ఇంటికప్పు కింద శారీరకంగా/ మానసికంగా ఒంటరిగా ఉన్న స్త్రీల గణన జరిగితే ఈ శాతం ఎంత ఉంటుందో ఊహించలేము. వివాహంలో సమ గౌరవం, సమ విలువ స్త్రీకి సంపూర్ణంగా లభించాల్సి ఉంది. వివాహ వ్యవస్థను నిలబెట్టుకోవడానికి పురుషుడు ఎంత ప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాడో, వివాహ వ్యవస్థలో స్త్రీకి ఉండే అభద్రత దూరం చేయడానికి సంఘం ఏమేరకు ప్రయత్నిస్తూ ఉందో తేలే వరకు ఒంటరిగా ఉండే స్త్రీల శాతం పెరుగుతూ పోతూ ఉండొచ్చు. గతంలో కేవలం కేరళలో మాత్రమే అధికంగా కనిపించే ఒంటరి మహిళలు ఇవాళ దక్షిణాది రాష్ట్రాలలో ఉత్తరాది కంటే అధికంగా కనిపించడానికి కారణాలు సంపూర్ణంగా అర్థం చేసుకుంటే స్త్రీలు ఒకరితో కలిసి ఉండగలిగే ఆనందమైన జీవితాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. – సాక్షి ఫ్యామిలీ -
‘అమలాపాల్-విజయ్ విడిపోడానికి అతడే!’
దర్శకుడు విజయ్, అమలాపాల్ విడిపోవడానికి నటుడు ధనుషే కారణం అట. మైనా చిత్రంతో కోలీవుడ్‌లో పాపులర్ అయిన మలయాళ కుట్టి అమలాపాల్. ఆ తరువాత వరుసగా ఆమెకు అవకాశాలు రావడం ప్రారంభం అయ్యాయి. అలాంటి సమయంలో దర్శకుడు విజయ్‌తో పరిచయమైంది. ఆయన విక్రమ్ హీరోగా తెరకెక్కించిన దైవ తిరుమగళ్ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా అమలాపాల్‌ను ఎంపిక చేశారు. ఆ తరువాత విజయ్ హీరోగా చేసిన తలైవాలోనూ అమలాపాల్‌నే హీరోయిన్గా నటించింది. అలా దర్శకుడు విజయ్, అమలాపాల్‌ల మధ్య పరిచయం ప్రేమగా మారి, ఆ తర్వాత పెళ్లికి దారి తీసింది. అలా 2014లో దర్శకుడు విజయ్, అమలాపాల్‌ల పెళ్లి పెద్దల సమ్మతంతో జరిగింది. అయితే పెళ్లి అయిన రెండేళ్లకే ఈ జంట విడిపోయారు. అప్పుట్లో ఇద్దరు పరస్పర చర్చలతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు కానీ, సమస్య ఏమిటన్నది ఎవరూ చెప్పలేదు. అయితే పెళ్లి అయిన తరువాత అమలాపాల్ మళ్లీ సినిమాల్లో నటించడం మొదలెట్టింది. ఆమె నటించడం విజయ్‌కు ఇష్టం లేదని, ఈ విషయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని ప్రచారం జరిగింది. ఇదంతా జరిగి మూడేళ్లపైనే అయ్యింది. దర్శకుడు విజయ్ గత ఏడాది ఐశ్వర్య అనే వైద్యురాలిని రెండో పెళ్లి చేసుకున్నారు. అమలాపాల్ నటిగా కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు విజయ్, అమలాపాల్ విడిపోవడానికి అసలు కారణాన్ని విజయ్ తండ్రి ఏఎల్.అళగప్పన్ కుండబద్దలు కొట్టారు. ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ వివాహానంతరం అమలాపాల్ నటించరాదని నిర్ణయించుకుందన్నారు. ఆ సమయంలో హీరో ధనుష్.. ఆమెను తను నిర్మించిన అమ్మా కణక్కు చిత్రంలో నటించేలా చేశారని చెప్పారు. ఆ చిత్ర షూటింగ్ ప్రారంభం అయిన తరువాతనే విజయ్‌కు, అమలాపాల్‌కు మధ్య సమస్యలు తలెత్తడం ప్రారంభించాయని ఏఎల్.అళగప్పన్ ఆరోపణలు చేశారు. ఇది ఇప్పుడు సినీపరిశ్రమలో కలకలానికి దారి తీసింది. కాగా అమ్మా కణక్కు తరువాత అమలాపాల్ .. ధనుష్‌తో కలిసి వేలైఇల్లా పట్టాదారి, దాని సీక్వెల్లోనూ వరుసగా నటించింది. కాగా ఇటీవల ఆడై చిత్రంలో నగ్నంగా నటించి సంచలనం కలిగించిన ఆమె ఆ తరువాత అదో అంద పరవై పోల చిత్రంలో నటించింది. ప్రేమికుల రోజు 14న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. చదవండి: అమలాపాల్ ఇంట తీవ్ర విషాదం అమ్మకు కీర్తి తెచ్చిన పాత్రలో కీర్తి -
సరిలేరు మీకెవ్వరూ..!
శ్రీకాకుళం న్యూకాలనీ: దివ్యాంగులు సకలాంగులకు ఏమాత్రం తీసిపోరని, ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తా రని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్) కళాశాల మైదానంలో బుధవారం విభిన్న ప్రతిభావంతుల జిల్లాస్థాయి క్రీడా పోటీలు జరిగాయి. జిల్లా విభిన్నప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో సత్తాకలిగిన దివ్యాంగ క్రీడాకారులు ఎంతోమంది ఉన్నారని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ పారా ఒలింపిక్స్ పోటీ ల్లో పాల్గొని పతకాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఏడీ కె.జీవన్‌బాబు మాట్లాడుతూ ఇక్క డ రాణించిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. అక్కడ రాణించి విజేతలగా నిలిస్తే జాతీయ పోటీలకు వెళ్లే అవకాశముందన్నారు.కార్యక్రమంలో జిల్లా చీఫ్ కోచ్ బి.శ్రీనివాస్‌కుమార్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.సుందరరావు, పీఈటీ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.వి.రమణ, కార్య దర్శి ఎం.సాంబమూర్తి, కార్యనిర్వహణ కార్య దర్శి ఎస్.సూరిబాబు, వై.పోలినాయుడు, దివ్యాంగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు ఎంకే మిశ్రా, జిల్లా దివ్యాంగ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు, విభిన్న సంస్థల నిర్వాహకులు, పీఈటీలు పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్.. అంతకుముందు కలెక్టర్ నివాస్ జాతీయ పతాకాన్ని ఎగురువేసి గౌరవ వందనం సమర్పించారు. ఏడీ జీవన్‌బాబు క్రీడల పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోటీలను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్టు బెలూన్లను నింగికి విడిచిపెట్టారు. 100 మీటర్ల ట్రైసైకిల్ రేస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి సుమారు 250 మంది విభిన్నప్రతిభావంతులు హాజరయ్యారు. ఎన్సీసీ క్యాడెట్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు విభిన్న ప్రతిభావంతులకు అమూల్యమైన సేవలు అందించారు. కోలాహలంగా సాగిన పోటీలు.. 6 నుంచి 15 ఏళ్లలోపు జూనియర్స్ విభాగం, 15 ఏళ్లు పైబడినవారిని సీనియర్స్ విభాగంగా బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. టోటల్లీ బ్లైండ్, హియరింగ్, ఆర్థోపిడికల్లీ, మెంటల్లీ రిటార్డెడ్ కేటగిరీల్లో పోటీలు జరిగాయి. అథ్లెటిక్స్ ఈవెంట్స్‌లో రన్నింగ్, షాట్‌పుట్, లాంగ్‌జంప్, జావెలిన్‌త్రో, డిస్కస్‌త్రో, సాఫ్ట్బాల్త్రోలో పోటీలు నిర్వహించారు. ట్రైసైకిల్ రేస్తోపాటు చెస్, క్యారమ్స్, క్రికెట్, వాలీబాల్, సింగింగ్, నృత్యం తదితర అంశాలలో హుషారుగా పోటీల్లో పాల్గొని సత్తాచాటారు. ఒక వ్యక్తి రెండు ఈవెంట్స్లలోనే పాల్గొనాలని అధికారులు షరతు పెట్టడంతో కొంతమంది నిరాశ చెందారు. -
సంసారంలో సంక్షోభం
పంచభూతాల సాక్షిగా ఒక్కటైన జంట... ప్రలోభాలకు గురికావడం, మోసబుద్ధిని చూపడం, అది పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లడం ఇటీవలి కాలంలో ఎక్కువవుతోంది. నమ్మిన జీవిత భాగస్వామిని వంచించడం కాపురాలను కకావికలం చేస్తోంది. కర్ణాటక : వరకట్నం, సఖ్యత లేకపోవడం, పరువుప్రతిష్టలకు వెళ్లి దాంపత్యజీవితాన్ని నరకం చేసుకుంటున్నారు. వీటికి తోడు అనైతిక సంబంధాలు కూడా కాపురాలను కూల్చుతున్నాయి. భర్త, లేదా బార్య వివాహానికి ముందు, వివాహమైన తరువాత కూడా సంబంధాలను నెరుపుతూ సమస్యల ఊబిలోకి దిగబడుతున్నారు. ఐటీ రాజధాని బెంగళూరులో గత ఏడాది ఇటువంటివి 236 కేసులు నమోదయ్యాయి. బాధితులు సాయం కోరుతూ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని వనితా సహాయవాణి కేంద్రం మెట్లెక్కారు. వేధింపులు, దాడులు, లైంగిక అపసవ్యతలు, చిన్నవిషయాలకే ఘర్షణ, తదితర సమస్యలతో పాటు మూడో వ్యక్తితో సంబంధం ఉందని ఆరోపిస్తూ పరిష్కారాలకు, విడాకులకోసం వచ్చే భార్యభర్తలు అధికంగా ఉన్నారు. ఎందుకిలా.. నేటి డిజిటల్ యుగంలో ప్రపంచం కుగ్రామం అయిపోగా ఎక్కడెక్కడి వ్యక్తులు, పాత స్నేహితుల మధ్య ఇట్టే పరిచయాలు ఏర్పడుతున్నాయి. ఇవి కొన్ని పరిస్థితుల ప్రాబల్యంతో లైంగిక సంబంధాల వరకూ వెళ్తున్నాయి. నేటి సమాజంలో ఇదొక ప్రధాన సమస్యగా మారిన మాట నిజమని సామాజికవేత్తలు చెబుతున్నారు. సంసారం పాడుచేసుకోవద్దు దంపతులు వివాహేతర సంబంధానికి లోనైతే పిల్లలు ఒడిదుడుకులకు గురి కావడం జరుగుతుంది. క్షణం సుఖానికి సంసారం పాడుచేసుకోవడం సరికాదని కౌన్సిలింగ్ నిపుణురాలు అపర్ణాపూర్ణేశ్ అన్నారు. విడాకులకు ఇదే కారణం విడాకులకు వివాహేతర సంబందాలు ముఖ్యకారణం అవుతున్నాయి. వనితా సహాయవాణిని సందర్శించిన మహిళలకు కౌన్సిలింగ్ అందించి వారి జీవితం నిలబెట్టడం మా ప్రధాన ఉద్దేశమని సహాయవాణి చీఫ్ రాణిశెట్టి తెలిపారు. ఆమె ఘనకార్యం పేరుపొందిన ప్రైవేటు విద్యాసంస్ధ లో టీచరైన మహిళ భర్త సాప్ట్వేర్ ఇంజనీర్. వీరికి ఒక కుమార్తె ఉంది. భర్త నిత్యం విధుల్లో ఉంటూ భార్యను పట్టించుకునేవాడు కాదు. భార్య 2016లో ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తితో సంబంధం నెలకొల్పుకుంది. భర్తకు అబద్ధం చెప్పి అప్పుడప్పుడు ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లేది. 2017 డిసెంబరులో భార్య వాట్సప్‌ను గమనించగా విషయం గుట్టురట్టైంది. దంపతులిద్దరూ వనితా సహాయవాణిని సంప్రదించగా భార్య తన తప్పు ఒప్పుకుని, ఇక ముందు ఇలా చేయనని హామీనిచ్చింది. మోసకారి భర్త గుట్టురట్టు భార్య ఉన్నత ఉద్యోగంలో ఉండగా, భర్త ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. భార్య తనకంటే ఎక్కువ వేతనం తీసుకుంటుందని భర్త ఆత్మన్యూనతకు లోనయ్యాడు. వీరికి పదేళ్లు వయసున్న కుమారుడు ఉన్నారు. భార్య వేతనంతోనే నగరంలో స్వంత ఇళ్లు కొనుగోలు చేశారు. భార్యే కుటుంబ భారాన్ని మోస్తోంది. ఆరునెలల నుంచి ఇంట్లో వంట చేయడానికి ఒక మహిళను నియమించుకున్నారు. ఆమెతో భర్త వివాహేతర సంబంధం ప్రారంభించాడు. ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాల్లో ఇద్దరి రాసలీలల దృశ్యాలు నిక్షిప్తం కావడంతో భార్య గమనించింది. భర్త వంచనను తట్టుకోలేక భార్య వనితా సహాయవాణిలో ఫిర్యాదు చేసింది. సహాయవాణి అధికారులు ఆ దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చి సర్దుబాటు చేశారు. పెరుగుతున్న కేసులు వివాహేతర సంబంధాలపై 2014–15లో 196 కేసులు 2015–16 నాటికి ఈ సంఖ్య 164. 2016–17 లో మళ్లీ పెరిగి 180కి చేరాయి. సహాయవాణిలో నమోదైన కేసులు కేసులు 2014–15 2015–16 2016–17 కుటుంబదౌర్జన్యాలు 490 154 332 వివాహానికి ముందు సంబంధం 64 68 56 వివాహానంతర సంబంధం 196 164 180 వరకట్నవేదింపులు 174 162 153 ఇతరత్రా గొడవలు 53 46 24 పెండింగ్ కేసులు 80 80 78 మొత్తం 1140 1192 1252 -
హాలీవుడ్ నటికి విడాకులు మంజూరు
ప్రముఖ హాలీవుడ్ నటి స్కారెట్ జోహన్ సన్ కు కోర్టు విడాకులు మంజూరు చేసింది. 2014లో రొమైన్ డ్యూరియక్ ను స్కార్లెట్ రెండో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు రోజ్ డొరథీ అనే కూతురు ఉంది. అయితే కొంత కాలం క్రితం స్కార్లెట్, రొమైన ల మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే పాప బాధ్యత ఎవరికి అప్పగించాలన్న విషయం పై ఒక నిర్ణయానికి రాలేకపోవటంతో ఆరునెలలుగా విడాకుల విషయం కోర్టులోనే ఉంది. తాజాగా పాప బాధ్యత పూర్తిగా నాకే వదిలేయాలంటూ స్కార్లెట్ కోరటంతో మ్యాన్‌హట్టన్ కోర్టు విడాకులు మంజూరు చేసింది. కొద్ది రోజులుగా కొలిన్ జోస్ట్ అనే వ్యక్తితో స్కార్లెట్ సన్నిహితం ఉంటుందన్న ప్రచారం జరగుతోంది. అయితే విడాకులు మంజూరు అయిన సందర్భంగా స్పందించిన ఈ హాలీవుడ్ నటి మాత్రం ఇక నాది ఒంటరి జీవితమే అంటూ కామెంట్ చేసింది. -
వాట్సాప్‌లో తలాఖ్‌పై తోడి కోడళ్ల న్యాయ పోరాటం
-
విభిన్నం...వినూత్నం
తాజ్ డెక్కన్‌లో శనివారం ఫ్యాషన్ షో నిర్వహించారు. విభిన్న రకాల దుస్తులతో మోడల్స్ హొయలొలికించారు. నగరంలో తొలిసారి నిర్వహించిన ఇంటర్నేషనల్ గ్లామ్ ఫ్యాషన్ వీక్ బ్రాండ్ ఫ్యాషన్ ఈవెంట్ ఆకట్టుకుంది. బెంగళూరుకు చెందిన ఈ బ్రాండ్ ఆధ్వర్యంలో నగరంలో రెండురోజుల ఈ కార్యక్రమం శనివారం తాజ్‌డెక్కన్‌లో ప్రారంభమైంది. తొలిరోజు లక్నోకు చెందిన డిజైనర్ హర్షిజమాల్, ముంబయికి చెందిన సంతోష్, హైదరాబాద్‌కి చెందిన నాగరాజు, అమిన్ ఫరిష్టా తదితర 10 మంది డిజైనర్ల దుస్తులను మోడల్స్ ప్రదర్శించారు. డిజైనర్లు తమ కలెక్షన్లలో స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్స్‌కు ఎక్కువగా చోటు కల్పించారు. - సాక్షి, సిటీబ్యూరో -
ప్రకృతిని పలకరిస్తూ!
విభిన్నం ఈ లోకంతో సంబంధం లేనట్లుగా, నాలుగు గోడల మధ్య ఇరుకిరుకుగా వ్యాయమాలు చేస్తుంటాం. ఇలా కాకుండా కాస్త కొత్తగా ఆలోచించాడు హైదరాబాద్‌కు చెందిన చైతన్యరెడ్డి. హైదరాబాద్ రగ్బీ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్న చైతన్య సరికొత్త ‘ఫిట్నెస్ ఫిలాసఫీని’ కనిపెట్టాడు. ‘‘వ్యాయామం అంటే నాలుగు గోడల మధ్య, కృత్రిమ వాతావరణం మధ్య చేసేది కాదు. విశాలమైన ప్రకృతిని చూస్తూ, దాంట్లో మమేకం అవుతూ చేసేది’’ అంటుంది ఆయన ఫిలాసఫీ. విశేషం ఏమిటంటే, వ్యాయామానికి ఉపయోగించే సంప్రదాయ పరికరాలు ఆయన దగ్గర సరికొత్త రూపంలో, అంటే చెట్ల మొద్దుల రూపంలో కనిపిస్తుంటాయి. వెయిట్ ట్రైనింగ్‌ను చెట్ల దుంగలతో చేస్తున్నాడు చైతన్య. ప్రకృతి మధ్య చేసే ఈ వ్యాయామానికి ‘మోవంట్’ అని పేరు పెట్టాడు చైతన్య. ‘మోవంట్’ గురించి వివరించడానికి యూట్యూబ్‌లో ఛానల్ కూడా ప్రారంభించాడు. ‘‘సహజమైన పద్ధతిలో శారీరకదృఢత్వాన్ని కాపాడుకోవడమే మోవంట్’’ అంటున్న చైతన్య వ్యాయామాన్ని ‘వ్యాయామశాల’ నుంచి ప్రకృతిమధ్యకు తీసుకువెళ్లే పనిలో ఉన్నాడు. ‘‘ఏసీలు, కృత్రిమ వెలుగులు, క్యూబికల్‌లు మనకు సహజమైపోయాయి. నిజానికవి అసహజమైనవి. యోగాను స్టూడియోలలో, నాలుగు గోడల మధ్య చేయడం లేదనే విషయాన్ని గ్రహించాలి’’ అంటున్నాడు చైతన్య. మనకున్న బిజీ షెడ్యూల్లో రోజూ ప్రకృతి మధ్య వ్యాయామం కుదరకపోయినా, వారానికి కనీసం రెండుసార్లయినా చేయాలని, ప్రకృతికి దగ్గర కావాలని సూచిస్తున్నాడు చైతన్య. -
అనగనగా ఒక కొత్త బడి!
విభిన్నం అర్ఘ్యా బెనర్జీని...సన్నిహితులు సరదాగా ‘ఫున్షుక్ వాంగ్డూ’అని పిలుస్తారు. వాంగ్డూ? అది ‘త్రీ ఇడియట్స్’ సినిమాలో అమీర్‌ఖాన్ పేరు కదా! ఆ సినిమాలో చేసినట్లే, ప్రయోగాత్మకమైన,స్వేచ్ఛాయుతమైన బడికి బెనర్జీ రూపకల్పన చేశారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లాంటి పెద్ద చదువు చదివి, ‘క్రిసిల్’లాంటి అంతర్జాతీయ స్థాయి కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తున్న బెనర్జీ ఉన్నట్టుండి ‘లెవల్ఫీల్డ్’ పేరుతో స్కూల్ ఎందుకు మొదలు పెట్టారు? కాస్త వెనక్కి వెళదాం. కూతురిని మంచి స్కూల్లో చేర్పించడానికి భార్య ఆసిమాతో కలిసి చిన్నా పెద్దా స్కూళ్లన్నీ తిరిగారు అర్ఘ్యా బెనర్జీ. ఏ స్కూల్లో చూసినా ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈకాలపు స్కూళ్లలో అన్నీ ఉన్నాయి... కానీ పిల్లలకు అవసరమైనది ఏదీ లేదు! అనుకున్నారు బెనర్జీ. ఐఐయం, అహ్మదాబాద్‌లోని టీచింగ్ మెథడాలజీస్ అంటే బెనర్జీకి ఇష్టం. అక్కడ కథలను, సినిమాలను, నిజజీవిత సంఘటనలను కాన్సెప్ట్‌లుగా బోధిస్తారు. ఉదాహరణకు ‘నాయకత్వం’ అనే అంశం మీద బోధించాల్సి వచ్చిప్పుడు ‘లగాన్’ సినిమాను ఎంచుకొని అందులోని వివిధ సందర్భాలను విశ్లేషణాత్మకంగా చెబుతుంటారు. నిర్వచనాలు, పాఠాలుగా చెప్పడం కూడా ఇలా దృశ్య ఆధారంగా చెప్పడం వల్ల ఎక్కువ ప్రభావం ఉంటుంది. తొందరగా మెదడుకు ఎక్కుతుంది. ఇది ఆశాజనకమైన ఊహ కాదు... శాస్త్రీయంగా నిరూపణ అయిన వాస్తవం. ఇలాంటి విధానం స్కూళ్లలో ఉంటే బాగుండేది అనుకున్నారుబెనర్జీ. ఎవరో వచ్చి ఏదో చేయాలని ఎదురుచూడడం ఎందుకు? తానే ఒక స్కూలు స్థాపిస్తే? అలా మొదలైంది ‘లెవెల్ఫీల్డ్ స్కూల్’ పశ్చిమబెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలోని సూరి అనే చిన్నపట్టణంలో ‘లెవెల్ఫీల్డ్’ను ప్రారంభించారు బెనర్జీ. ఐఐయం-అహ్మదాబాద్‌లో చదువు పూర్తయిన తరువాత ఒక కార్పొరేట్ సంస్థలో చేరి కో-హెడ్ స్థాయికి ఎదిగారు బెనర్జీ. ఆ సమయంలో సిఏ, యంబిఏ చదివిన వాళ్లలో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్, తార్కిక ఆలోచనలాంటి సాధారణమైన నైపుణ్యాలు లేకపోవడాన్ని దగ్గరి నుంచి గమనించారు. ‘విద్యార్థిదశలోనే పిల్లలకు ఇలాంటివి ఎందుకు నేర్పకూడదు?’ అని ఆలోచించారు బెనర్జీ. కొత్తగా ఆలోచించడం, విశ్లేషణ, రచన..మొదలైనవి విద్యార్థులకు నేర్పడం అత్యవసరం అనుకున్నారు. తాను అనుకున్నవి తానే అమలు చేసే అవకాశం ‘లెవెల్ఫీల్డ్’ ద్వారా ఆయనకు వచ్చింది. ఆయన తన ఆలోచనల గురించి పేరెంట్స్‌కు మొదట చెప్పినప్పుడు, అందరూ బెనర్జీని గ్రహాంతరవాసిని చూసినంత ఆశ్చర్యంగా చూశారు. పిల్లలను కాదు.. మొదట తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయాలనుకొని ఆ ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు బెనర్జీ. ప్రయత్నాలు ఫలించాయి. ‘ఎంత ఎక్కువ సేపు చదివితే...అంత ఎక్కువ చదువు వస్తుంది’ అనే అభిప్రాయం నుంచి బయటికి రావాల్సిందిగా చెప్పారు కూడా. ప్రస్తుతం ‘లెవెల్ఫీల్డ్’లో 300 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్లకు మార్కులతో పనిలేదు. ఆడుతూ పాడుతూ చదువుకుంటారు. ఆడుతూ పాడుతూనే అందమైన కలలు కంటారు. ఏ కష్టం, ఒత్తిడి లేకుండానే వాటిని నిజం చేసుకుంటారు. ఆధునిక స్కూళ్లతో పోల్చితే ‘లెవెల్ఫీల్డ్’ ఆలోచనలు చాదస్తంగా అనిపించవచ్చు. ఇలాంటి సందర్భంలో ఒక మాటను గుర్తు తెచ్చుకుంటే సమాధానంతో పాటు సాంత్వన కూడా దొరుకుతుంది. ‘మొదట నిన్ను ఎవరూ పట్టించుకోరు. పట్టించుకున్న తరువాత విమర్శిస్తారు. ఆ తరువాత నిన్ను అనుసరిస్తారు.’ ఒక్కసారి నా బాల్యంలోకి వెళితే... ఫలానా రాజు ఎప్పుడు పదవీచ్యుతుడు అయ్యాడు? ఫలానా రాజు ఎన్ని యుద్ధాలలో పాల్గొన్నాడు... ఇలాంటి ప్రశ్నలతో కాలమంతా వృథా అయ్యింది అనిపిస్తుంది. ఇలాంటి ప్రశ్నలు, జవాబులతో మనకు ఎంత ఉపయోగం ఉంది? - బెనర్జీ పంచరత్నాలు... పిల్లలలో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించడం మీద దృష్టి పెడతారు. ఉదా: పఠన నైపుణ్యం. పిల్లలతో ఇష్టమైన కథలను చదివిస్తారు. పాఠ్య పుస్తకాలు అంటూ ప్రత్యేకంగా కనిపించవు. ఆణిముత్యాల లాంటి పాత రచనలను పునఃకథనం చేస్తారు. తేలికైన భాషలో పిల్లలకు వాటిని చెబుతారు. ప్రాథమిక స్థాయి పిల్లలు కూడా ఈ ఓల్డ్ క్లాసిక్స్ గురించి చెప్పగలిగేలా బోధిస్తారు. చర్చలు, వాదోపవాదాలు... ఇతర రకాల ప్రక్రియల ద్వారా అవతలి వారితో మాటామంతీ జరిపే నైపుణ్యాలను పెంచుతారు. గణితం అంటే పిల్లలకు ఉండే సహజమైన భయాన్ని పోగొట్టి, ఆటపాటల ద్వారా ఇష్టాన్ని పెంచుతారు. రోజూ కొన్ని సమస్యలను ఇచ్చి వాటిని పరిష్కరించమని చెబుతారు. దాన్ని ఒక అలవాటుగా మారుస్తారు. ఉదా: పిల్లలను ఆకట్టుకునే జపాన్ పజిల్స్... సుడోకు, షికాకు, కెన్కెన్... మొదలైనవి.