జాల్నా: దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు అంత్యంత వైభవంగా జరుగున్నాయి. అయితే మహారాష్ట్రలోని జాల్నాలో గణేశ మండపం ఒక ప్రత్యేకతను చాటుతోంది. ఇక్కడ ప్రతిరోజా సాయంత్రం వేళ వినాయకుని హారతి ఇచ్చిన అనంతరం భక్తులంతా సామూహికంగా రాజ్యాంగ ప్రవేశికను పఠిస్తున్నారు.
ఈ సందర్భంగా వినాయక ఉత్సవాల నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య సూత్రాలను ప్రోత్సహించడం, ప్రాథమిక హక్కుల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడమనే లక్ష్యంతో రోజూ రాజ్యాంగ పఠంనం చేస్తున్నామన్నారు. ఈ మండపాన్ని గణేష్ మహాసంఘ్ అధ్యక్షుడు అశోక్ పంగార్కర్ సారధ్యంలో ఏర్పాటు చేశారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత రాయ్‌సాహెబ్ దానే, ఎమ్మెల్యే కైలాష్ గోరంట్యాల తదితరులు మండపాన్ని దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment