
ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిద్దాం
పేండ్‌పెల్లి గ్రామస్తుల తీర్మానం
భైంసా రూరల్: వచ్చే విద్యాసంవత్సరంలో పిల్లలందరినీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలంలోని పేండ్‌పెల్లి గ్రామస్తులు తీర్మానించారు. బుధవారం సమావేశమైన గ్రామస్తులు ఈ మేరకు తీర్మానం చేశారు. సర్పంచ్ దేశెట్టి శ్రీనివాస్, వీడీసీ సభ్యులు, కుల సంఘాల పెద్దలు, యువజన సంఘాల నాయకులు, రైతులంతా కలసి స్కూల్ ఆవరణలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు.