వరుణుడి కరుణ కోసమే యాగం
ఐరాల: రాష్ట్ర ప్రజలపై వరుణుడు కరుణించాలనే వరుణ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు కాణిపాక ఆలయ ఈవో పూర్ణచంద్రారావు తెలిపారు. వరుణయాగంలో భాగంగా మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో స్వామివారి కల్యాణ మండపంలో జప కలశాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆ కలశాలను స్వామివారి ఆలయం వద్ద చేర్చి ప్రత్యేక పూజలు ఆచరించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ నెల 19 వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వరుణయాగం నిర్వహించనున్నట్లు తెలిపారు.
అనంతరం ఆలయ పుష్కరిణి వద్దకు జప కలశాలను తీసుకువెళ్లి వేదపారాయణం, మంత్రోచ్ఛారణల మధ్య వరుణుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈకార్యక్రమంలో ఏఈవో ఎన్‌ఆర్ క్రిష్ణారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకుడు ధర్మేశ్వర గురుకుల్, సూపరిండెంట్ రవీంద్ర, వేదపండితులు కపిల్వాయ నరసింహమూర్తి,పలువురు పాల్గొన్నారు.