సైనిక కుటుంబాలకు సాయం
శ్రీకాకుళం న్యూకాలనీ: దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన సైనిక కుటుంబాలకు కలెక్టర్ లక్ష్మీనరసింహం సోమవారం ఆర్థిక సాహాయాన్ని అందించారు. 2013 ఆగస్టు 14న ఐఎన్‌ఎస్ సింధూ రక్షక్ ఆపరేషన్‌లో ముష్కరులతో వీరోచిత పోరాటం చేసి వీరమణం పొందిన బొడ్డేపల్లి సీతారామ్ కుటుంబానికి(తల్లి బి.ఈశ్వరికి) చేయూతను అందించారు. అలాగే 2012 ఫిబ్రవరి 21వ తేదీన ఆపరేషన్ రినో(అస్సాం)లో వీరమరణం పొందిన తెప్పల రామారావు కుటుంబానికి(తల్లి టి.పార్వతి) సాయం అందించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఇరు కుటుంబాల వీరమాతలకు కలెక్టర్ ప్రత్యేక నిధి నుంచి చెరో రూ. లక్ష చొప్పున చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ–2 పి.రజనీకాంతరావు, జిల్లా సైనిక సంక్షేమాధికారి జి.సంత్యానందం తదితరులు పాల్గొన్నారు.